విద్యార్థుల సామర్థ్యాలను పరిశీలించాలి
ABN, Publish Date - Dec 06 , 2024 | 11:43 PM
విద్యా ర్థులు క్రమం తప్పకుండా కళాశాలకు వస్తున్నా రా లేదా అన్న విషయాన్ని వారి తల్లిండ్రులకు పరిశీలించాలని జిల్లా ఇంటర్మీడియల్ విద్యాశాఖ అధికారి (డీఐఈఓ) ఎం.హృదయరాజు అన్నారు.
డీఐఈవో హృదయరాజు
ధరూరు, డిసెంబరు 6 (ఆంధ్రజ్యోతి): విద్యా ర్థులు క్రమం తప్పకుండా కళాశాలకు వస్తున్నా రా లేదా అన్న విషయాన్ని వారి తల్లిండ్రులకు పరిశీలించాలని జిల్లా ఇంటర్మీడియల్ విద్యాశాఖ అధికారి (డీఐఈఓ) ఎం.హృదయరాజు అన్నారు. తరచూ కళాశాలను సందర్శించడం ద్వారా వి ద్యార్థుల హాజరుతో పాటు వారి సామర్థ్యాన్ని ప్ర త్యక్షంగా పరిశీలించే అవకాశం ఉంటుందని తెలి పారు. రాష్ట్ర విద్యాశాఖ కమిషనర్ ఆదేశాల మే రకు శుక్రవారం ధరూరు ప్రభుత్వ జూనియర్ కళాశాలలో విద్యార్థుల తల్లిదండ్రులతో సమావే శం నిర్వహించారు. ఈ సందర్బంగా హృదయ రాజు మాట్లాడుతూ ప్రతి మూడు నెలలకు ఒక సారి సమావేశం నిర్వహించడం వల్ల విద్యార్థుల సామర్థ్యాలు తెలుసుకునే అవకాశం ఉంటుంద న్నారు. అదే సమయంలో తల్లిదండ్రులు కూడా ఆ దిశగా విద్యార్థులకు సరైన సూచనలు, సల హాలు ఇవ్వాలన్నారు. విద్యార్థులు క్రమశిక్షణతో మెలిగి ఉన్నత లక్ష్యాలను నిర్ధేశించుకుని చదివి భవిష్యత్‌లో ఉన్నత స్థానాలను పొందాలన్నారు. పరీక్షలు సమీపిస్తున్న తరుణంలో విద్యార్థులు ప్రణాళికా బద్ధంగా చదవాలన్నారు. సమావేశంలో ప్రిన్సిపా ల్, అధ్యాపకులు, సిబ్బంది ఉన్నారు.
Updated Date - Dec 06 , 2024 | 11:43 PM