ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

కలెక్టర్‌కు రైతు కృతజ్ఞతలు

ABN, Publish Date - Nov 04 , 2024 | 11:31 PM

కలెక్టర్‌ విజ యేందిర బోయికి, రెవెన్యూ అదనపు కలెక్టర్‌ మోహన్‌రావుకు రైతు తాళ్ళ రాములు కృతజ్ఞత లు తెలియజేశారు.

The farmer is grateful to the collector

మహబూబ్‌నగర్‌ కలెక్టరేట్‌, నవంబరు 4 (ఆంధ్రజ్యోతి): జిల్లా కలెక్టర్‌ విజయేందిర బోయి ఆదేశాల మేరకు రెవెన్యూ అదనపు కలెక్టర్‌ ఎస్‌ మోహన్‌ రావు హన్వాడ మండలం పేరారం గ్రా మానికి చెందిర రైతు తాళ్ళ రాములుకు సోమవారం పట్టాదారుపాసు పుస్తకాన్ని అందజేశారు. రైతు తాళ్ళ రాములు 20ఏళ్ల క్రితం కొండన్నకు చెందిన సర్వే నెంబర్‌ 387లో వ్యవసాయ భూమిని కొనుగోలు చేసి వ్యవసాయం చేసుకుంటున్నాడు. ఇప్పటివరకు అయినా పట్టాదారు పాస్‌ పుస్తకం అందలేదు. ఈసమస్యపై రైతు తహసీల్దార్‌ కార్యాలయం చుట్టూ తిరిగినా పని జరగలేదు. ఈవిషయంపై కలెక్టరేట్‌లో ప్రజావాణిలో ఆర్జీ పెట్టుకున్నాడు. దీన్ని పరిశీలించిన కలెక్టర్‌ విజ యేందిర బోయి ఆదేశాల మేరకు రెవెన్యూ అదనపు కలెక్టర్‌ మోహన్‌రావు విచారణ చేప ట్టారు. రైతు తాళ్ళ రాములుకు సోమవారం ప్ర జావాణి కార్యక్రమంలో పట్టాదారు పాస్‌ పుస్తకా న్ని అందజేశారు. ఈసందర్భంగా కలెక్టర్‌ విజ యేందిర బోయికి, రెవెన్యూ అదనపు కలెక్టర్‌ మోహన్‌రావుకు రైతు తాళ్ళ రాములు కృతజ్ఞత లు తెలియజేశారు.

ఫార్మాట్‌ ప్రకారమే సర్వే పూర్తి చేయాలి

జడ్చర్ల, నవంబరు 4 (ఆంధ్రజ్యోతి): సామాజి క, ఆర్థిక, విద్య, ఉపాధి, రాజకీయ, కుల (సమగ్ర ఇంటింటి కుటుంబ) సర్వేను పకడ్బందీగా నిర్వ హించాలని కలెక్టర్‌ విజయేందిర బోయి ఆదేశిం చారు. మండలంలో సర్వే చేపట్టే ఎన్యుమరేట ర్‌లకు జడ్చర్ల మండల ప్రజాపరిషత్‌ కార్యాల యంలో, మున్సిపాలిటీలో సర్వే చేపట్టే ఎన్యుమరే టర్‌లకు జడ్చర్ల ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో సోమ వారం నిర్వహించిన శిక్షణ కార్యక్రమంలో కలెక్టర్‌ పాల్గొన్నారు. ప్రతి ఇంటికి ఎన్యుమరేటర్‌ వెళ్లాల ని, ఇచ్చిన ఫార్మాట్‌ ప్రకారం అన్ని వివరాలను నమోదు చేయాలని సూచించారు. కుటుంబ సభ్యుల వివరాలు, భూముల వివరాలు, నమోదు చేయాలని చెప్పారు. రాజకీయ నాయకులకు సంబంధించిన వివరాల సేకరణలో నామినేటెడ్‌, కార్పొరేషన్‌, సహకార సంఘం, ప్రభుత్వేతర సం స్థలలో సభ్యులుగా ఉన్న తదితర అంశాలను నమోదు చేయాలని చెప్పారు. అలాగే వలస వెళ్లి న వారు ఉంటే ఆ వివరాలను సైతం ఫార్మాట్‌ ప్రకారం నమోదు చేయాలని, ఇంటి యజమాని, ఎన్యుమరేటర్‌, సూపర్‌వైజర్‌లు సంతకం చేయా ల్సి ఉంటుందని తెలిపారు. కార్యక్రమంలో జడ్పీ సీఈవో వెంకట్‌రెడ్డి, తహసీల్దార్‌ బ్రహ్మంగౌడ్‌, ఎంపీడీవో విజయ్‌కుమార్‌, మున్సిపల్‌ కమిషనర్‌ లక్ష్మారెడ్డి, ఎంఈవో మంజులాదేవి, ఎన్యుమరేట ర్‌లు, సూపర్‌వైజర్లు పాల్గొన్నారు.

Updated Date - Nov 04 , 2024 | 11:31 PM