ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

బాలిక మృతిపై దర్యాప్తు జరిపించాలి

ABN, Publish Date - Oct 30 , 2024 | 11:13 PM

బాలిక మృతిపై సమగ్ర విచారణ జరిపించాలని నడిగడ్డ హక్కుల పోరాట సమితి జిల్లా చైర్మన్‌ రంజిత్‌కుమార్‌ డిమాండ్‌ చేశారు.

ఎన్‌హెచ్‌పీఎస్‌ జిల్లా చైర్మన్‌ రంజిత్‌కుమార్‌

గద్వాల టౌన్‌, అక్టోబరు 30 (ఆంధ్రజ్యోతి) : బాలిక మృతిపై సమగ్ర విచారణ జరిపించాలని నడిగడ్డ హక్కుల పోరాట సమితి జిల్లా చైర్మన్‌ రంజిత్‌కుమార్‌ డిమాండ్‌ చేశారు. బాలిక మృత దేహానికి రీ పోస్టుమార్టం నిర్వహించి వాస్తవాలను బయటపెట్టాలన్నారు. పట్టణంలోని సమితి కార్యాలయంలో బుధవారం నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. మృతికి కారకులైన నిందితులను అరెస్టు చేయాలని, ఈ సంఘటనపై ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్‌రెడ్డి, బీజేపీ జాతీయ ఉపాధ్యక్షురాలు, ఎంపీ డీకే అరుణ స్పందించకపోవడం బాధ్యతారాహిత్యమన్నారు. వాస్తవాలను వెలికి తీసేందుకు రీ పోస్టుమార్టం నిర్వహించాలన్నారు. నిందితులను అరెస్టు చేసే వరకు జిల్లా వ్యాప్తంగా ఆందోళనలు ఉధృతం చేస్తామన్నారు. పోరాట సమితి కన్వీనర్‌ బుచ్చిబాబు, నాయకులు రంగస్వామి, వెంకట్రాములు, ప్రేమరాజ్‌, గోపాల్‌ ఉన్నారు.

బాలిక మృతి కారుకులను అరెస్ట్‌ చేయాలి

వడ్డేపల్లి : బాలికల బలవన్మరణానికి కారకులైన సీడ్‌ ఆర్గనైజర్‌ను తక్షణమే అరెస్టు చేయాలని ఎంఎస్‌పీ జిల్లా కన్వీనర్‌, ఎమ్మార్పీఎస్‌ జిల్లా మాజీ అధ్యక్షుడు ఐజ రాజు డిమాండ్‌ చేశారు. బుధవారం శాంతినగర్‌ మండల కేంద్రంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వారు మాట్లాడారు. ఎమ్మార్పీఎస్‌ జాతీయ నాయకుడు కొంకల భీమన్నమాదిగ, ఎమ్మార్పీఎస్‌ రాష్ట్ర ఉపాధ్యక్షుడు పల్లెపాడు మస్తాన్‌మాదిగ, వడ్డేపల్లి మండల నాయకుడు ఏసేపు మాదిగ, ఎంఎస్‌ఎఫ్‌ మండల అధ్యక్షుడు రాజశేఖర్‌, ఐజ దేవరాజు పాల్గొన్నారు.

Updated Date - Oct 30 , 2024 | 11:13 PM