ప్రధాన కాలువ మరమ్మతు చేయించాలి
ABN, Publish Date - Sep 15 , 2024 | 10:45 PM
రంగ సముద్రం బ్యాలెన్స్ రిజర్వాయర్ నుంచి వెళ్లే ప్రధాన కాలువ భారీ వర్షాలకు తెగిపోయింది.
శ్రీరంగాపురం,సెప్టెంబరు 15: రంగ సముద్రం బ్యాలెన్స్ రిజర్వాయర్ నుంచి వెళ్లే ప్రధాన కాలువ భారీ వర్షాలకు తెగిపోయింది. కల్వరాల - పుల్గర్ చర్ల గ్రామాల మధ్య కాలువ తెగిన కాలువను ఆది వారం కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు రాజేంద్ర ప్రసాద్ యాదవ్ పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఈ కాలువ ద్వారా దాదాపు 21,000 ఎకరాలకు సాగునీరు అందాల్సి ఉందని, బీమా అధికారుల నిర్లక్ష్యం వల్ల రైతులు పంటలు ఎండబెట్టుకుంటున్నారని అన్నారు. అధికారులు తెగిపోయిన కాలువకు మరమ్మతులు చేపట్టాలని ఆయన డిమాండ్ చేశారు. సాగునీరు లేక శ్రీరంగా పురం పుల్గర్‌చర్ల కల్వరాల, వీపనగండ్ల, అమ్మపల్లి తదితర గ్రామాల రైతులు సాగు చేసిన పంటలు ఎండిపోతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. 16వ ప్యాకేజీ ప్రధాన కాలువకు గండ్లు పడ్డాయని, అంచనా వేసి ప్రభుత్వానికి ప్రతిపాదనలు పం పామని, నిధులు మంజూరు అయిన వెంటనే కాలువ గండ్లు పూడ్చి సాగునీరు అందిస్తామని బీమా అధికారులు తెలిపారు.
Updated Date - Sep 15 , 2024 | 10:45 PM