డాక్టర్ నిర్లక్ష్యంతో కోమాలోకి రోగి
ABN, Publish Date - Nov 30 , 2024 | 12:03 AM
జిల్లా కేంద్రంలోని ఓ ప్రైవేట్ ఆసుపత్రికి అయిజ పట్టణానికి చెందిన ఓ మహిళ ముక్కులో గడ్డ ఉం దని గత రెండు రోజుల క్రితం రాగా డాక్టర్ వేసిన ఇంజక్షన్‌తో అపస్మారకస్ధితిలోకి వెళ్లి చివరకు కోమాలోకి వెళ్లిన సంఘటన శుక్రవారం చోటు చేసుకొంది.
- రోగి పరిస్థితి విషమం
గద్వాల క్రైం, నవంబరు 29 (ఆంధ్రజ్యోతి): జిల్లా కేంద్రంలోని ఓ ప్రైవేట్ ఆసుపత్రికి అయిజ పట్టణానికి చెందిన ఓ మహిళ ముక్కులో గడ్డ ఉం దని గత రెండు రోజుల క్రితం రాగా డాక్టర్ వేసిన ఇంజక్షన్‌తో అపస్మారకస్ధితిలోకి వెళ్లి చివరకు కోమాలోకి వెళ్లిన సంఘటన శుక్రవారం చోటు చేసుకొంది. ఇందుకు సంబంధించి బాధితులు, డీఎంహెచ్‌వో డాక్టర్ సిద్ధప్ప కథనం మేరకు వివరాలిలా ఉన్నాయి. జిల్లా కేంద్రంలోని ఓ ప్రైవేట్ ఆసుపత్రికి గురువారం మధ్యాహ్నం అయిజ పట్టణానికి చెందిన కవిత అనే మహి ళ, ఆమె బంధువులు వచ్చారు. కవిత ముక్కులో గడ్డ ఉందని, శ్వాస తీసుకోవడం కష్టంగా ఉందని.. ఆపరేషన్‌కు రూ. 20వేలు అవుతుందని డాక్టర్ చెప్పారు. దీంతో రోగి బంధువులు రూ. 15వేలకు ఆపరేషన్ చేసేందుకు డాక్టర్ తో ఒప్పందం కుదుర్చుకున్నారు. అయితే ఎలాంటి పరీక్షలు నిర్వహించకుండా డాక్టర్ ఆమెకు మత్తు ఇంజక్షన్ ఇవ్వడంతో వెంటనే స్పృహతప్పి కింద పడిపోయింది. వెంటనే కోమాలోకి వెళ్లడంతో పరిస్థితి సీరియస్‌గా ఉందని కర్నూల్ ఆసుపత్రికి తీసుకెళ్లాలని డాక్టర్ సూచించాడు. వెంటనే క ర్నూల్‌లోని ఓ ప్రైవేట్ ఆసుపత్రికి తరలించగా గురువారం నుంచి శుక్రవారం వరకు వైద్యపరీక్షలు నిర్వహించిన డాక్టర్లు ఆమె మెదడులో నరాలు చిట్లిపోయా యని, ఆమె ఎ ప్పుడు కోమా నుంచి బయటకు వస్తుందో చెప్పడం కష్టమన్నారు. అయితే డాక్టర్ వేసిన ఇంజక్షన్ వల్లే ఇబ్బందులు ఏర్పడ్డాయని బాధితులు విలేకరులతో ఆవేదన వ్యక్తం చేశారు. ఈ విషయంపై జిల్లా వైద్యఆరోగ్యశాఖ సిబ్బంది శుక్రవారం సాయంత్రం గద్వాలలో ఆసుపత్రిని తనిఖీ చేశారు. పేషెంట్‌కు సంబంధించిన ఆన్ని వివరాలను సేకరించారు. డీఎంహెచ్‌వో డాక్టర్ సిద్దప్ప ఆదేశాల మేరకు సదరు డాక్టర్‌కు షోకాజ్ నోటీస్‌ను అందజేశారు.
Updated Date - Nov 30 , 2024 | 12:03 AM