ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

తప్పులు లేకుండా సర్వే చేయాలి

ABN, Publish Date - Nov 09 , 2024 | 11:14 PM

ప్రభుత్వం చేపట్టిన సామాజిక, ఆర్థిక, విద్య, ఉపాధి, రాజకీయ, కుల సమగ్ర ఇంటింటి కుటుంబ సర్వేను తప్పులు లేకుండా చేపట్టాలని జిల్లా పంచాయతీ అధికారి శ్యాంసుందర్‌ అన్నారు.

కొత్తదేవరపల్లిలో సర్వేను పరిశిలిస్తున్న డీపీవో శ్యాంసుందర్‌

ఇటిక్యాల/ధరూరు/గట్టు/మల్దకల్‌/ఉండవల్లి/అయిజ టౌన్‌/మానవపాడు/వడ్డేపల్లి/రాజోలి, నవంబరు 9 (ఆంధ్రజ్యోతి) : ప్రభుత్వం చేపట్టిన సామాజిక, ఆర్థిక, విద్య, ఉపాధి, రాజకీయ, కుల సమగ్ర ఇంటింటి కుటుంబ సర్వేను తప్పులు లేకుండా చేపట్టాలని జిల్లా పంచాయతీ అధికారి శ్యాంసుందర్‌ అన్నారు. శనివారం మండలంలోని కొత్తదేవరపల్లి, నక్కలపల్లి గ్రామాల్లో ఇంటింటి సర్వే ప్రారంభం కాగా, ఆయా గ్రామాలను సందర్శించి, ఎన్యుమరేటర్లకు సూచనలు, సలహాలు ఇచ్చారు. సమగ్ర కుటుంబ సర్వేకు వచ్చే బృందానికి పూర్తి వివరాలు చెప్పి సహకరించాలని ఎంపీడీవో జ్యోతి ప్రజలకు సూచించారు. ధరూరు, ఓబులోనిపల్లిలో ఇంటింటికి తిరిగి కుటుంబ సభ్యుల వివరాలు సేకరించారు. గట్టు మండలంలో కొనసాగిన సమగ్ర కుంటుబ సర్వేను తహసీల్దార్‌ సరితారాణి, ఎంపీడీవో చెన్నయ్య పరిశీలించారు. మల్దకల్‌ మండలం తాటికుంట గ్రామంలో ప్రారంభమైన సర్వేను ఎంపీడీవో ఆంజనేయరెడ్డి, ఎంపీవో రాజశేఖర్‌ పర్యవేక్షించారు. ఉండవల్లి మండలంలోని 16 గ్రామాల్లో 52 ఎన్యుమరేటర్లు మొదటి రోజు 163 గృహాల సర్వేని పూర్తి చేసినట్లు తహసీల్దార్‌ హరికృష్ణ, ఎంపీడీవో తిరుపతన్న తెలిపారు. అయిజ పట్టణంలోని 20 వార్డుల్లో మునిసిపల్‌ సిబ్బందితో పాటు 52 మంది ఎన్యుమరేటర్లు సర్వే చేపట్టారు. మునిసిపల్‌ కౌన్సిలర్‌, కాంగ్రెస్‌ రాష్ట ఓబీసీ కార్యదర్శి షెక్షావలి ఆచారి 19వ వార్డులో సర్వేను పరిశీలించారు. మానవపాడు మండల కేంద్రంలో స్పెషల్‌ ఆఫీసర్‌ సక్రియా నాయక్‌ ఆధ్వర్యంలో సర్వే నిర్వహించారు. ఏ బూడిదపాడు గ్రామంలో నిర్వహించిన సర్వేలో ఎంపీడీవో భాస్కర్‌ పాల్గొన్నారు. వడ్డెపల్లి మండలం కోయిలదిన్నె గ్రామంలో చేపట్టిన సర్వేను ఎంపీడీవో రామకృష్ణ పరిశీలించారు. గ్రామంలో 117 ఇళ్ల వివరాలు సేకరించినట్లు తెలిపారు. రాజోలి మండల కేంద్రమైన కొత్త రాజోలిలో చేపట్టిన సర్వేను మండల ప్రత్యేక అధికారి శ్రీనివాసులు పరిశీలించారు. ఎంపీడీవో ఖాజామొయినుద్దిన్‌ ఉన్నారు.

Updated Date - Nov 09 , 2024 | 11:14 PM