ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

స్కూల్‌ బస్సును ఢీకొట్టిన ట్రాక్టర్‌

ABN, Publish Date - Nov 20 , 2024 | 11:24 PM

పాఠశాలకు విద్యార్థుల ను తీసుకొని వస్తున్న బస్సును పొ లంలో నుంచి రోడ్డుపైకి ఎక్కే క్ర మంలో

- బస్సు బోల్తా, తప్పిన ప్రాణాపాయం

- 18 మంది విద్యార్థులు ఉండగా ఇద్దరికి గాయాలు

బిజినేపల్లి, నవంబరు 20 (ఆంధ్రజ్యోతి) : పాఠశాలకు విద్యార్థుల ను తీసుకొని వస్తున్న బస్సును పొ లంలో నుంచి రోడ్డుపైకి ఎక్కే క్ర మంలో ట్రాక్టర్‌ ఢీకొనడంలో ఇద్దరు విద్యార్థులు గాయపడ్డ ఘటన బుధవారం నాగర్‌కర్నూలు జిల్లా బిజినేపల్లి మండలంలో జరిగింది. స్థానికులు తెలిపిన వివరాల మేరకు మండల కేంద్రంలోని ఓ ప్రైవేట్‌ పాఠశాలకు చెందిన బస్సు తిమ్మాజిపేట మండలం కోడుపర్తి గ్రామంలో విద్యార్థులను ఎక్కించుకొని మరో గ్రామం బాజీపూర్‌లో ఉన్న విద్యా ర్థులను ఎక్కించుకునేందుకు బయలుదే రింది. వట్టెం సమీపంలో రోడ్డుకు ఇరు వైపులా పిచ్చిమొక్కలు ఏపుగా పెరగ డంతో రోడ్డుపై వస్తున్న బస్సును గమనించని డ్రైవర్‌ పొలంలో నుం చి రోడ్డుపైకి ట్రాక్టర్‌ను ఎక్కించా డు. చివరి క్షణంలో ట్రాక్టర్‌ను గ మనించిన బస్సు డ్రైవర్‌ ట్రాక్టర్‌ ను తప్పించేందుకు మరోవైపు రోడ్డు కిందకు బస్సును దించా డు. వేగంగా వచ్చిన ట్రాక్టర్‌ ఢీకొట్టడంతో బస్సు బోల్తా పడింది. వెంటనే పొలా ల్లో ఉన్న రైతులు గమనించి బస్సు అద్దాలను పగులగొట్టి చిన్నారులను బయటకు తీశారు. బస్సులో ఉన్న 18 మంది విద్యార్థుల్లో రోహిత్‌, ప్రియాంక స్వల్పంగా గాయపడినట్లు స్థానికులు తెలిపారు. ప్రాణాపాయం తప్పడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు. గాయాలైన విద్యార్థులను 108 అంబు లెన్స్‌లో జిల్లా ఆసుపత్రికి తరలించి వైద్య చికిత్స అందించారు. పాఠశాల యాజమాన్యానికి షోకాజ్‌ నోటీసు బస్సు ప్రమాదం జరిగి ప్రాణాపాయం జరుగకున్నా నిర్లక్ష్యంగా వ్యవహరించిన పాఠశాల యాజమాన్యానికి డీఈవో గోవిందరాజులు షోకాజు నోటీసు ఇచ్చారు. పాఠశాల గుర్తింపు ఎందుకు రద్దు చేయకూడదో వివరణ ఇవ్వాలని పేర్కొన్నారు. ప్రైవేట్‌ పాఠశాలల యాజమా న్యాలు విద్యార్థుల భద్రతకు ప్రాముఖ్యం ఇవ్వకపోయినా, బస్సుల ఫిట్‌నెస్‌, డ్రైవర్ల సామర్థ్యం పరిశీలన ఎప్పటిక ప్పుడు చేయకపోయినా కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ప్రమాదం జరిగిన స్థలాన్ని ఆయన పరిశీలించారు.

Updated Date - Nov 20 , 2024 | 11:24 PM