ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

మత్స్యకారుల సంక్షేమమే ధ్యేయం

ABN, Publish Date - Nov 07 , 2024 | 10:52 PM

మత్స్యకారుల సంక్షేమానికి కాంగ్రెస్‌ ప్రభుత్వం చిత్తశుద్దితో కృషి చేస్తుందని సీఎం రేవంత్‌రెడ్డి అన్నివిధాలుగా మత్స్యకారులకు అండగా నిలిచేం దుకు కృషి చేస్తున్నారని ఎమ్మెల్యే వాకిటి శ్రీహరి అన్నారు.

సంగంబండ రిజర్వాయర్‌లో చేప పిల్లలను వదులుతున్న ఎమ్మెల్యే వాకిటి శ్రీహరి

- మక్తల్‌ ఎమ్మెల్యే డాక్టర్‌ వాకిటి శ్రీహరి

- సంగంబండ, భూత్పూర్‌ రిజర్వాయర్‌లో చేప పిల్లల విడుదల

మక్తల్‌రూరల్‌, నవంబరు 7 (ఆంధ్రజ్యోతి): మత్స్యకారుల సంక్షేమానికి కాంగ్రెస్‌ ప్రభుత్వం చిత్తశుద్దితో కృషి చేస్తుందని సీఎం రేవంత్‌రెడ్డి అన్నివిధాలుగా మత్స్యకారులకు అండగా నిలిచేం దుకు కృషి చేస్తున్నారని ఎమ్మెల్యే వాకిటి శ్రీహరి అన్నారు. నియోజకవర్గ పరిధిలోని సంగంబండ, భూత్పూర్‌ రిజర్వాయర్‌లో సుమారు పది లక్షల చేప పిల్లలను ఎమ్మెల్యే వదిలారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ కాంగ్రెస్‌ ప్రభు త్వం మత్స్యకారుల సంక్షేమానికి అధిక ప్రాధా న్యత ఇస్తూ చేపపిల్లలు, రొయ్యలు తదితర వాటి పెంపకానికి కృషి చేస్తోందని అన్నారు. అనంత రం ఎమ్మెల్యేతో పాటు, మత్స్యశాఖ ఏడీ రెహమాన్‌, మత్స్య సంఘం జిల్లా అధ్యక్షుడు కాంత్‌కు మార్‌, మాజీ చీఫ్‌ ప్రమోటర్‌ కోళ్ల వెంకటేష్‌లను సంఘం నాయకులు శాలువా, పూలమాలలతో ఘనంగా సన్మానించారు. కార్యక్రమంలో సంగం బండ రిజర్వాయర్‌ మత్స్య సంఘం అధ్యక్షుడు తిప్పన్న, భూత్పూర్‌ రిజర్వాయర్‌ మత్స్య సంఘం అధ్యక్షుడు ఆనంద్‌, శేఖర్‌, డైరెక్టర్లు, నాయకులు పాల్గొన్నారు.

అతి త్వరలో కోర్టు ఏర్పాటు..

స్వాతంత్రం వచ్చిన నాటి నుంచి మక్తల్‌ నియోజకవర్గంలో కోర్టు ఏర్పడాలన్నది ఇక్కడి ప్రజల చిరకాల కోరిక అని, అతి త్వరలో వారి కల నెరవేరబోతున్నందున ఆ కార్యక్రమాన్ని పండుగ లా నిర్వహించుకుందామని ఎమ్మెల్యే డాక్టర్‌ వాకిటి శ్రీహరి పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యేకు న్యాయవాదులందరు మిఠాయిలు తినిపించారు. కార్యక్రమంలో న్యాయవాదులు దత్తాత్రేయ, నీరజ్‌, సురేందర్‌, రామ్మోహన్‌, సూర్యప్రకాష్‌, రంకుల ఆనంద్‌, శివ, నాయకులు బోయ రవికుమార్‌, ఆనంద్‌గౌడ్‌, చంద్రకాంత్‌గౌడ్‌, కావలి తాయప్ప, కావలి రాజేందర్‌, వడ్వాట్‌ రవీందర్‌ తదితరులున్నారు.

సర్వేకు ప్రజలందరూ సహకరించాలి..

అందరి వర్గాలకు సముచిత న్యాయం కల్పించే దిశగా కాంగ్రెస్‌ నాయకులు రాహూల్‌గాంధీ, సీఎం రేవంత్‌రెడ్డిలు కుల గణన నిర్ణయం తీసుకోవడం చారిత్రాత్మకమని ఎమ్మెల్యే వాకిటి శ్రీహరి అభిప్రాయపడ్డారు. పేట జిల్లాలోని ఏడు మండలాలు, మూడు మునిసిపాలిటీలలో పార్టీలకు చెందిన కాంగ్రెస్‌ అధ్యక్షులు, ప్రధాన కార్యదర్శులు, గ్రామాలకు చెందిన పార్టీ నాయకులు అందరు ముందంజలో నిలిచి కులగణన సర్వేలో ప్రజలందరు పాల్గొనేలా సహకరించాలని సూచించారు. నియోజకవర్గ పరిధిలో కాంగ్రెస్‌ పార్టీ పెద్దలతో త్వరలో ఒక వార్‌రూమ్‌ను ఏర్పాటుచేసి కుల గణనపై ఎలాంటి సందేహలు ఉన్నా నివృత్తి చేసే విధంగా తోడ్పాటు అందిస్తారని ఆయన సూచించారు.

Updated Date - Nov 07 , 2024 | 10:52 PM