ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

మీ వివాహ కలను నెరవేర్చుకోడానికి 40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్ లో ఇప్పుడు ప్రీమియం మెంబర్షిప్ ఉచితం. ఫోన్|| 9390 999 999, 8008 56 7898

చెరువు కట్ట పనులు వేగవంతం చేయాలి

ABN, Publish Date - May 31 , 2024 | 10:50 PM

మండలంలోని గణప సముద్రం చెరువు కట్ట పనులను త్వరగా పూర్తి చేయాలని ఇరిగేషన్‌ సీఈ రఘునాథరావు తెలిపారు.

ఖిల్లా ఘణపురం, మే 31: మండలంలోని గణప సముద్రం చెరువు కట్ట పనులను త్వరగా పూర్తి చేయాలని ఇరిగేషన్‌ సీఈ రఘునాథరావు తెలిపారు. మండల కేంద్రంలోని గణప సముద్రం జలాశయం పనుల్లో భాగంగా చేపట్టిన చెరువు కట్ట, కాలువ కత్వ పనులను శుక్రవారం ఇరిగేషన్‌ సీఈ రఘు నాథరావు పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రిజర్వాయర్‌ పనుల్లో భాగంగా చెరువు కట్టను ఆరు మీటర్ల వెడల్పు విస్తరించేలా పనులు చేపట్టినట్లు గుర్తు చేశారు. చెరువు కట్ట, అలుగు, తూము మరమ్మతులు కాలువ కత్వ పనులకు రాష్ట్ర ప్రభుత్వం రూ.20 కోట్లు మంజూరు చేసిందని తెలిపారు. చెరువు కట్ట లీకేజీలు కాకుండా కట్ట లోప ల వైపు ఒండ్రు మట్టితో మరమ్మతు చేసినట్లు తెలిపారు. చెరువు అలుగు తూముల మరమ్మతు పనులను వెంటనే ప్రారంభించాలని సూచించారు. మల్కిమియాన్‌పల్లి శివారులో చెక్‌ డ్యాం వద్ద కత్వ కూలిపోవడంతో చెరువు కట్ట నిధుల్లో భాగంగా కత్వ నిర్మాణం చేపట్టి షట్టర్‌ బిగించే పనులను త్వరలో ప్రారంభిస్తామని అన్నారు. కత్వ పనులు పూర్తయితే నే గణపసముద్రం చెరువులోకి సాగునీరు వస్తుందని తెలిపారు. వచ్చే సీజన్‌ నాటికి ఆయకట్టు రైతులకు నీరు అందించేలా త్వరితగతిన పనులు పూర్తి చేయాలని ఆదేశించారు. గణపసముద్రం చెరువు రిజర్వాయర్‌గా మార్పు చెందుతున్న తరుణంలో కట్ట పనులను నాణ్యతగా చేయాలని సూచించారు. కార్యక్రమంలో ఇరిగేషన్‌ ఎస్‌ఈ సత్యశీలారెడ్డి, డీఈ నరేందర్‌ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

Updated Date - May 31 , 2024 | 10:51 PM

Advertising
Advertising