ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

యువత మహనీయులను ఆదర్శంగా తీసుకోవాలి

ABN, Publish Date - Nov 06 , 2024 | 11:09 PM

నేటి యువత శ్రీశ్రీ, వి వేకానంద వంటి మహనీయులు చెప్పిని స్ఫూర్తిని ఇచ్చే విషయాలను ఆద ర్శంగా తీసుకుని జీవితంలో ఉన్నతంగా ఎదగాలని కర్ణాటక మాజీ డీజీపీ, విశ్రాంత ఐపీఎప్‌ డాక్టర్‌ పుట్టపాట రవీంద్రనాథ్‌ అన్నారు.

జ్యోతి ప్రజ్వలన చేస్తున్న మాజీ డీజీపీ డాక్టర్‌ పుట్టపాగ రవీంద్రనాథ్‌

- కర్ణాటక మాజీ డీజీపీ డాక్టర్‌ పుట్టపాగ రవీంద్రనాథ్‌

నాగర్‌కర్నూల్‌ టౌన్‌, నవంబరు 6 (ఆంధ్రజ్యోతి): నేటి యువత శ్రీశ్రీ, వి వేకానంద వంటి మహనీయులు చెప్పిని స్ఫూర్తిని ఇచ్చే విషయాలను ఆద ర్శంగా తీసుకుని జీవితంలో ఉన్నతంగా ఎదగాలని కర్ణాటక మాజీ డీజీపీ, విశ్రాంత ఐపీఎప్‌ డాక్టర్‌ పుట్టపాట రవీంద్రనాథ్‌ అన్నారు. బుధవారం నాగ ర్‌కర్నూల్‌ జిల్లా కేంద్రంలోని సాయిగార్డెన్‌లో ఐక్య సమాజ సంస్థ ఆధ్వర్యం లో వ్యక్తిత్వ వికాసంపై ఇంటర్‌ విద్యార్థులకు అవగాహన సదస్సు నిర్వహిం చారు. కళ్యాణం నరసింహ సభాధ్యక్షత నిర్వహించి ఈ సదస్సుకు ఐక్య స మాజ సంస్థ వ్యవస్థాపకుడు డాక్టర్‌ పుట్టపాగ రవీంద్రనాథ్‌తో పాటు జిల్లా ఇంటర్‌ విద్య నోడల్‌ అధికారి జి.వెంకటరమణ, క్రియేటర్‌ కృష్ణ జ్యోతి ప్రజ్వ లన చేసి కార్యక్రమం ప్రారంభించారు. ఈ సందర్భంగా మాజీ డీజీపీ మా ట్లాడుతూ ఈ ప్రాంతానికి చెందిన తన తండ్రి మాజీ మంత్రి పుట్టపాగ మ హేంద్రనాథ్‌ జాతీయోన్నత పాఠశాల స్థాపించి ఎందరో పేద విద్యార్థులకు ఉచిత చదువును అందించి జీవితంలో ఉన్నతంగా ఎదిగేందుకు కృషి చేశార ని పేర్కొన్నారు. తన తండ్రిని స్ఫూర్తిగా తీసుకుని నేటి యువతకు బంగా రు భవత చూపాలనే లక్ష్యంతో వ్యక్తిత్వ వికాస శిక్షణలు నిర్వహిస్తున్నామ న్నారు. జాతీయోన్నత పాఠశాల మాజీ ప్రిన్సిపాల్‌ అబ్దుల్లాఖాన్‌, ముర ళీధర్‌, నరేందర్‌రెడ్డి, దుర్గాప్రసాద్‌, అధ్యాపకుడు భగవేణి నర్సింహులు, రా జారాం, వంకేశ్వరం లక్ష్మయ్య, వార్డెన్‌ చెన్నయ్య తదితరులు పాల్గొన్నారు.

Updated Date - Nov 06 , 2024 | 11:09 PM