రైతులకు ఇబ్బందులు కలిగిస్తే సహించేది లేదు
ABN, Publish Date - Nov 05 , 2024 | 11:44 PM
కొనుగోలు కేంద్రాలకు ధాన్యం తీసుకువచ్చిన రైతులకు ఇబ్బందులు కలిగిస్తే సహించేది లేదని అదనపు కలెక్టర్ వెంకటేశ్వర్లు హెచ్చరించారు.
అదనపు కలెక్టర్ వెంకటేశ్వర్లు
ఆత్మకూరు, నవంబరు 5 (ఆంధ్రజ్యోతి) : కొనుగోలు కేంద్రాలకు ధాన్యం తీసుకువచ్చిన రైతులకు ఇబ్బందులు కలిగిస్తే సహించేది లేదని అదనపు కలెక్టర్ వెంకటేశ్వర్లు హెచ్చరించారు. ఆత్మకూరు పట్టణంలోని వ్యవసాయ మార్కెట్‌లో ఏర్పాటు చేసిన కొనుగోలు కేంద్రాన్ని ఆయన మంగళవారం పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... తక్షణమే ఆత్మకూరు మండలంలో మొత్తం 24 కొనుగోలు కేంద్రాలు ప్రారంభించాలని సూచించారు. సన్న, దొడ్డు రకం వరి కొనుగోలు వేర్వేరుగా ఉండాలన్నారు. ఇప్పటి వర కు మిల్లర్లు ఎంపిక కాలేదు. కొనుగోలు చేసిన ధాన్యాన్ని ఎక్కడికి పంపాలని పీఏసీఎస్ అధికారులు కలెక్టర్ దృష్టికి తీసుకెళ్లారు. కొనుగోలు చేసిన ధాన్యాన్ని వ్యవసాయ మార్కెట్లోని గోదాములలో నింపాలని, అక్కడ స్థలం సరిపోకుంటే వనపర్తి మండలం చిట్యాల గోదాముకు తరలించాలని సూచించారు. అనంతరం తహసీల్దార్ కార్యాలయంలో అధికారులతో సమావేశమయ్యారు. ఇంటింటి సర్వే లో ప్రత్యేక అధికారులు తప్పనిసరిగా పాల్గొనాలని సూచించారు. ప్రతీ ఒక్కరురోజు 10 కుటుంబాలకు పైగా ఆధారాలను సేకరిం చాలని సూచించారు. కార్యక్రమంలో డీటీ ప్రసాద్, సింగిల్ విండో అధికారులు , రెవెన్యూ సిబ్బంది పాల్గొన్నారు.
Updated Date - Nov 05 , 2024 | 11:44 PM