కలెక్టర్‌పై దాడిచేసిన వారిని అరెస్టు చేయాలి
ABN, Publish Date - Nov 14 , 2024 | 11:33 PM
వికారాబాద్ జిల్లా కలెక్టర్ ప్రతీక్‌జైన్, కాడా ప్రత్యేకాధికారి వెంకట్‌రెడ్డిపై దాడిచేసిన వారిని తక్షణమే అరెస్టు చేయాలని టీజీఈజేఏసీ చైర్మన్, టీఎన్‌జీవోస్ యూనియన్ జిల్లా అధ్యక్షుడు జి.రా జీవ్‌రెడ్డి డిమాండ్ చేశారు.
- కలెక్టరేట్ ఎదుట ధర్నా చేసిన టీఎన్‌జీవోస్, టీజీవోస్ నాయకులు
పాలమూరు, నవంబరు 14 (ఆంధ్రజ్యోతి): వికారాబాద్ జిల్లా కలెక్టర్ ప్రతీక్‌జైన్, కాడా ప్రత్యేకాధికారి వెంకట్‌రెడ్డిపై దాడిచేసిన వారిని తక్షణమే అరెస్టు చేయాలని టీజీఈజేఏసీ చైర్మన్, టీఎన్‌జీవోస్ యూనియన్ జిల్లా అధ్యక్షుడు జి.రా జీవ్‌రెడ్డి డిమాండ్ చేశారు. గురువారం కేంద్ర సంఘం పిలుపుమేరకు జిల్లా కేంద్రంలోని ఐడీ వోసీ ప్రాంగణంలో మధ్యాహ్నం భోజన విరామ సమయంలో ధర్నా నిర్వహించారు. దాడిచేసిన వారిపై పీడీయాక్టు నమోదు చేయాలని డిమాం డ్ చేశారు. తమకు రక్షణ కల్పించాల్సిన బాధ్య త ప్రభుత్వం తీసుకోవాలన్నారు. ఆర్.చంద్రానా యక్, టీజీవో రాజ్‌గోపాల్, ట్రెస్సా అధ్యక్షుడు చె న్నకిష్టన్న, మదన్‌మోహన్, టీఎన్‌జీవోస్ కోశాధి కారి డా.కృష్ణమోహన్ ప్రసంగించారు. కార్యక్ర మంలో ఉద్యోగులు పాల్గొన్నారు.
Updated Date - Nov 14 , 2024 | 11:33 PM