గ్రూప్-3 పరీక్షలకు పకక్బందీగా నిర్వహించాలి
ABN, Publish Date - Nov 13 , 2024 | 11:07 PM
నవంబరు 17, 18 తేదీల్లో నిర్వహించనున్న తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ గ్రూప్-3 పరీక్షలకు పకడ్బందీగా ఏర్పాట్లు చేసి విజయవంతం చేయాలని కలెక్టర్ బీఎం సంతోష్ అన్నారు.
- కలెక్టర్ బీఎం సంతోష్
గద్వాల న్యూటౌన్, నవంబరు 13 (ఆంధ్రజ్యోతి) : నవంబరు 17, 18 తేదీల్లో నిర్వహించనున్న తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ గ్రూప్-3 పరీక్షలకు పకడ్బందీగా ఏర్పాట్లు చేసి విజయవంతం చేయాలని కలెక్టర్ బీఎం సంతోష్ అన్నారు. బుధవారం తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ చైర్మన్ మహేందర్‌రెడ్డి పబ్లిక్ సర్వీస్ కమిషన్ సభ్యులతో కలసి హైదరాబాద్ నుంచి వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... పరీక్షల నిర్వహణలో ఎలాంటి ఇబ్బందులు లేకుండా చూడాలన్నారు. అనంతరం జిల్లా అధికారులతో కలెక్టర్ మాట్లాడుతూ ఏర్పాట్లలో లోటుపాట్లు లేకుండా జాగ్రత్తలు చేపట్టాలన్నారు. స్ర్టాంగ్ రూమ్ ఏర్పాట్లు పటిష్టంగా చేయాలన్నారు. పరీక్షా కేంద్రాల వద్ద ఇబ్బందులు లేకుండా చూడాలన్నారు. పరీక్ష కేంద్రాల వద్ద ఏర్పాట్లను శాఖాధికారి, సంబంధిత చీఫ్ సూపరింటెండెంట్‌తో సమన్వయం చేసుకొని ఒకరోజు ముందుస్తుగా పూర్తి చేయాలన్నారు. తాగునీటి వసతి, పారిశుధ్య పనులు చేయాలన్నారు. చీఫ్ సూపరింటెండెంట్‌కు తప్ప మరెవరికి పరీక్షా కేంద్రం లోపలికి మొబైల్ ఫోన్ అనుమతిలేదన్నారు. పరీక్ష విధుల సిబ్బంది, అధికారులు కేంద్రానికి ముందుగా చేరుకొని ఏర్పాట్లను పూర్తి చేయాలన్నారు. జిల్లాలో 8750 మంది అభ్యర్థులు గ్రూప్-3 పరీక్షలు రాయనున్నారని, 25 పరీక్ష కేంద్రాలు ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. అదనపు కలెక్టర్ నర్సింగరావు, రీజినల్ కో-ఆర్డినేటర్ రామ్‌మోహన్ ఉన్నారు.
Updated Date - Nov 13 , 2024 | 11:07 PM