కోటా నింపుకునేందుకే.. కొనుగోళ్లు
ABN, Publish Date - Nov 20 , 2024 | 11:19 PM
గత సీజన్‌లలో ప్రభుత్వానికి సీఎంఆర్ ఇవ్వని మిల్లులను కాంగ్రెస్ ప్రభుత్వం డీఫాల్ట్ లిస్టులో పెట్టింది. దీంతో ఆ మిల్లులకు ఈ ఏడాది ధాన్యం కేటాయించడం లేదు.
- రైతుల కల్లాల వద్దే ధాన్యం కొంటున్న బ్లాక్ లిస్టెడ్ రైస్‌మిల్లర్లు
- ఆ ధాన్యంతో పెండింగ్ సీఎంఆర్ భర్తీకి ఏర్పాట్లు
- రాష్ట్రంలో 15 లక్షల టన్నుల మేర గత సీజన్ల ధాన్యం మాయం
- ప్రభుత్వ కొనుగోలు కేంద్రాల వద్ద మందకొడిగా ధాన్యం సేకరణ
- నారాయణపేట, గద్వాల ధాన్యం రాయిచూర్ మార్కెట్‌కు తరలింపు
- ధర తక్కువ వస్తున్నా పచ్చి ధాన్యమే కొనడంతో రైతులు సుముఖం
గత సీజన్‌లలో ప్రభుత్వానికి సీఎంఆర్ ఇవ్వని మిల్లులను కాంగ్రెస్ ప్రభుత్వం డీఫాల్ట్ లిస్టులో పెట్టింది. దీంతో ఆ మిల్లులకు ఈ ఏడాది ధాన్యం కేటాయించడం లేదు. కొన్నేళ్లుగా పౌరసరఫరాల శాఖ కేటాయించే ధాన్యంపై ఆధారపడి వ్యాపారం చేస్తున్న మిల్లర్లు చాలా మంది డీఫాల్ట్ లిస్టులోకి వెళ్లడంతో ధాన్యం కేటాయింపులు నిలిపివేశారు. అంతే కాకుండా గత బీఆర్‌ఎస్ ప్రభుత్వం మాదిరిగా కాకుండా కాంగ్రెస్ ప్రభుత్వం మిల్లర్లు సీఎంఆర్ పెండింగ్ పెట్టకుండా ఉండేందుకు బ్యాంకు గ్యారెంటీ తీసుకువచ్చింది. దీంతో డీఫాల్ట్ మిల్లుల యజమానులకు జరిమానా విధించేందుకు ప్రభుత్వం సిద్ధమవుతుండటంతో సీఎంఆర్ పెండింగ్ ఉన్న మిల్లుల యజమానులు తాజాగా రైతుల నుంచి ధాన్యం సేకరణలో నిమగ్నమయ్యారు. ప్రభుత్వం ఏర్పాటు చేసిన కొనుగోలు కేంద్రాల్లో ఆరబెట్టిన ధాన్యం మాత్రమే తీసుకుంటున్నారు. కానీ, దళారులు, రైస్ మిల్లర్లు పచ్చి ధాన్యం కూడా తీసుకుంటుండటం, కల్లాల వద్దకే వెళ్లి కొనుగోలు చేస్తుండటంతో పాటు చెల్లింపులు అదే రోజు లేదా మరుసటి రోజు చేస్తుండటంతో రైతులు వారికే విక్రయించేందుకు ఆసక్తి చూపుతున్నారు.
మహబూబ్‌నగర్, నవంబరు 20 (ఆంధ్రజ్యోతి ప్రతినిధి): గత ప్రభుత్వ హయాంలో సీఎంఆర్ కోసం కేటాయించిన ధాన్యాన్ని అమ్ముకొని సొమ్ము చేసుకున్న మిల్లర్లు ఇప్పుడు తాజా ప్రభుత్వం కొత్త పాలసీ తీసుకురావడంతో ఇరకాటంలో పడ్డ విషయం తెలిసిందే. ప్రస్తుతం వానా కాలం సీజన్‌కు సంబంధించి ధాన్యం కొను గోళ్లు ప్రారంభమైనప్పటికీ సీఎంఆర్ పెండింగ్ లేని మిల్లుల నుంచి మాత్రమే అధికారులు అగ్రిమెంట్లు, బ్యాంక్ గ్యారెంటీ లు తీసుకుంటున్నారు. గత సీజన్‌లలో పెండింగ్ ఉన్న మిల్లర్లకు కేటాయింపులు చేయకుండా కొనుగోలు చేస్తున్న ధాన్యాన్ని గోదాంలలో నిల్వ చేస్తున్నారు. ఏళ్లుగా పౌరసరఫరాల శాఖ కేటాయించే ధాన్యం పై ఆధారపడి వ్యాపారం చేస్తున్న మిల్లర్లు ఈసారి డీఫాల్ట్ మిల్లులకు ధాన్యం కేటా యింపులు చేయకపోవడం, మిల్లు నడిపిం చాలంటే సొంతంగా కొనుగోలు చేయాల్సి న పరిస్థితి ఏర్పడటంతో పెండింగ్ సీఎం ఆర్ భర్తీ చేసుకునేందుకు ఏర్పాట్లు చేసు కుంటున్నారు. ప్రస్తుత సీజన్‌లో కోతలు ముమ్మరంగా జరుగుతుండగా రైతుల కల్లాల వద్దకే వెళ్లి ధాన్యం కొనుగోలు చేస్తున్నారు. రైతులకు ధర తక్కువగా ఇస్తున్నప్పటికీ వెంటనే కొనుగోళ్లు జరిగిపోతుండటం పచ్చి వడ్లనే తీసుకుంటుండ టం, డబ్బులు వేగంగా చెల్లించడం, కొనుగోలు కేంద్రాల వద్ద నిరీక్షణ తప్పనుండటంతో రైతులూ సుముఖంగానే ధాన్యం విక్రయిస్తున్నారు. ఈ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత విజి లెన్స్ అండ్ ఎన్‌ఫోర్స్‌మెంట్ తనిఖీలు నిర్వహిం చగా దాదాపు రూ.3301 కోట్ల విలువైన 15 లక్షల టన్నుల ధాన్యం మాయమైనట్లు గుర్తించిన విష యం తెలిసిందే. ఈ క్రమంలోనే మిల్లర్లు సీఎం ఆర్ పెండింగ్ పెట్టకుండా ఉండేందుకు బ్యాంకు గ్యారెంటీలు తీసుకురావడంతో పాటు పెండింగ్ ఉన్న మిల్లుల వారికి జరిమానా విధించేందుకు విధాన రూపకల్పన చేయడంతోనే మిల్లర్లు రైతు ల నుంచి ధాన్యం సేకరణలో నిమగ్నమయ్యారు.
- కలిసి వస్తున్న మందకొడి సేకరణ...
ప్రస్తుతం ఉమ్మడి పాలమూరు జిల్లాలో ప్రభుత్వ కొనుగోలు కేంద్రాల వద్ద ధాన్యం సేకరణ మందకొడిగా సాగుతుండటం రైస్‌మిల్లర్ల కు వరంగా మారిందని చెప్పవచ్చు. అక్కడ వేగం గా కొనుగోలు చేస్తే ధర ఎక్కువగా వస్తుందని రైతులు అక్కడికే మొగ్గుచూపే అవకాశం ఉంది. ఉదాహరణకు ఈ సీజన్ ప్రారంభమైన తర్వాత ఇప్పటివరకు అత్యధిక సేకరణ ఉన్న వనపర్తి జిల్లాలో కేవలం 10వేల మెట్రిక్ టన్నులు మాత్రమే ధాన్యం కొనుగోలు చేశారు. ఈ జిల్లాలో 4 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం సేకరణ చేయా ల్సి ఉంది. అలాగే ఈసారి కాంగ్రెస్ ప్రభుత్వం సన్న రకాలకు బోనస్ ప్రకటించడంతో వాటి కొనుగోళ్లు వేరుగా చేపట్టాల్సి వస్తోంది. కొనుగోళ్ల నుంచి రవాణా వరకు అన్నీ ప్రత్యేకంగా చూసుకుంటుండటం, గన్నీ బ్యాగులపై ఓటీపీలు రాయడం వంటి కారణాల వల్ల ఆలస్యమవు తోంది. దీంతో కొంత తక్కువ ధరకు మిల్లర్లు వాటిని కొనుగోలు చేస్తున్నారు. వరి ధాన్యానికి ప్రస్తుతం కనీస మద్దతు ధర రూ. 2,300 కాగా, సన్న ధాన్యం అయితే మరో రూ. 500 బోనస్ కలుపుకొని రాష్ట్ర ప్రభుత్వం రూ. 2800 చెల్లి స్తోంది. దీనికి రైతు కొనుగోలు కేంద్రాలకు ధాన్యం తరలించడం, దాన్ని నిర్దేశిత తేమశాతం వరకు ఆరబెట్టడం, సుదీర్ఘ నిరీక్షణ తర్వాత విక్రయించ డం, డబ్బులు ఆలస్యంగా జమ కావడంతో రైతు లు దళారులు లేదా రైస్‌మిల్లర్లకే విక్రయిస్తున్నా రు. రూ. 2,200 నుంచి రూ. 2,400 వరకు దళా రులు ధర చెల్లిస్తున్నారు. రైతులు ధాన్యం ఆరబోసిన ప్రాంతాలకే వెళ్లి కొనుగోలు చేస్తుండ టంతో పాటు చెల్లింపులు అదే రోజు లేదా మరు సటి రోజు చేస్తుండటంతో రైతులు ఆసక్తి చూ పుతున్నారు.
సరిహద్దు ధాన్యం రాయిచూరుకే..
ప్రభుత్వం సన్నరకాల ధాన్యంపై రూ. 500 బోనస్ ప్రకటించడంతో ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లా సరిహద్దులో ఉన్న ఆంధ్రప్రదేశ్, కర్ణాటక రాష్ట్రాల నుంచి దళారులు, మిల్లర్లు ధాన్యం తీసుకువచ్చి ఇక్కడ కొనుగోలు కేంద్రాల్లో రైతుల పేరుతో విక్రయించే అవకాశం ఉందని అధికారులు భావించారు. ఈ నేపథ్యంలో నారా యణపేట, జోగుళాంబ గద్వాల, నాగర్‌కర్నూలు జిల్లాల్లో ధాన్యం రవాణాను అడ్డుకునేందుకు చెక్ పోస్టులు కూడా ఏర్పాటు చేశారు. కానీ అధికా రుల ఆలోచనలకు భిన్నంగా కర్ణాటక వ్యాపారు లు, రైస్‌మిల్లర్లు, వారికి సంబంధించిన దళారులు ఇక్కడి రైతుల నుంచే ధాన్యం కొనుగోలు చేసి రాయిచూర్ మార్కెట్‌కు తరలిస్తున్నారు. ఇప్పటికే నారాయణపేట, జోగుళాంబ గద్వాల, మహబూబ్‌నగర్ జిల్లాల్లో మెజారిటీ ధాన్యం కర్ణాటక వ్యా పారులతో పాటు స్థానిక రైస్‌మిల్లర్లు కొనుగోలు చేస్తున్నారు. దొడ్డు రకాల ధాన్యం ఇక్కడి రైస్ మిల్లర్లు కొనుగోలు చేస్తుం డగా సన్నరకాల ధాన్యం మాత్రం రాయి చూర్ మార్కెట్‌కు సంబంధించిన దళారులు కొనుగోలు చేస్తున్నారు. యాసంగి సీజన్‌లో కూడా ఇక్కడి నుంచి కర్ణాటక వ్యా పారులు అధికంగా ధాన్యం కొనుగోలు చేసి తరలించారు. ఈ సీజన్‌లో కూడా అదే పరిస్థితి ఏర్పడుతోంది. రైతులు కూడా ఆసక్తిగా విక్రయిస్తుండటంతో పెద్దగా ఇబ్బందు లు లేవనే చెప్పవచ్చు.
Updated Date - Nov 20 , 2024 | 11:19 PM