ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

మీ వివాహ కలను నెరవేర్చుకోడానికి 40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్ లో ఇప్పుడు ప్రీమియం మెంబర్షిప్ ఉచితం. ఫోన్|| 9390 999 999, 8008 56 7898

నేడు మృగశిర కార్తె

ABN, Publish Date - Jun 07 , 2024 | 11:18 PM

వర్షాకాలానికి నాంది పలికే మృగశిర కార్తె శనివారం నుంచి ప్రారంభం కానుంది. వానకాలం పంటల సాగు కోసం ఉగాది తర్వాత దుక్కిదున్ని పొలాలను సిద్ధం చేసుకున్న రైతులు రోహిణి కార్తెలో కురిసే మోస్తరు వర్షాలకు ఆరుతడి పంటలైన కందులు, పెసర్లు వేయడం ఆనవాయితీగా వస్తోంది.

కార్తె రాకతో వర్షాల వల్ల వాతావరణంలో మార్పులు

చలి నుంచి ఉపశమనం కోసం మాంసాహారం తినడం ఆనవాయితీ

పెరిగిన నాటు కోళ్ల ధరలు

పుంజుకోనున్న వ్యవసాయ పనులు

నారాయణపేట, జూన్‌ 7: వర్షాకాలానికి నాంది పలికే మృగశిర కార్తె శనివారం నుంచి ప్రారంభం కానుంది. వానకాలం పంటల సాగు కోసం ఉగాది తర్వాత దుక్కిదున్ని పొలాలను సిద్ధం చేసుకున్న రైతులు రోహిణి కార్తెలో కురిసే మోస్తరు వర్షాలకు ఆరుతడి పంటలైన కందులు, పెసర్లు వేయడం ఆనవాయితీగా వస్తోంది. అయితే ఈ సారి నారాయణపేట జిల్లాలో ముందే వర్షాలు కురియడంతో రైతులు విత్తనాలు వేస్తున్నారు. జూన్‌ మొదటి వారంలో వచ్చే మృగశిర కార్తె సందర్భంగా రైతులు వ్యవసాయ పనులకు శ్రీకారం చుడతారు. అప్పటి వరకు వేసవి ఉక్కబోత వల్ల సతమతమైన ప్రజలు మృగశిర కార్తెలో పడే వానలకు వాతావరణం చల్లబడి ఉపశమనం పొందుతారు.

కోడి మాంసం తప్పనిసరి

మృగశిర కార్తెను గ్రామీణులు మిరుగు కార్తెగానూ అభివర్ణిస్తారు. ఆ రోజు పల్లెల్లో ప్రత్యేక వంటకాలు చేసుకుంటారు. మాంసహారులు కోడి మాంసాన్ని తప్పనిసరిగా తింటారు. చికెన్‌తో పాటు చేపలు, మటన్‌ కూడా తింటారు. మాంసం తినడంతో పాటు మద్యం తాగుతారు. వేసవి ముగిశాక మృగశిర కార్తెలో వచ్చే చలిని తట్టుకునేందుకు కార్తె రోజు మాంసాహారం తినడం ఆనవాయితీగా వస్తోందని పలువురు పేర్కొంటున్నారు. శాఖహారులు తీపి వంటకాలతో పాటు ఇంగువ, బెల్లం కలుపుకుని మింగుతారు. వేడిని పెంచే ఇంగువను వంటకాల్లో వినియోగిస్తారు.

నాటు కోడి ధర రూ.1,200

మృగశిర కార్తె నేపథ్యంలో నాటుకోళ్ల ధరలు పెరిగాయి. రెండు కిలోలకు పైగా బరువున్న కోళ్ల ధర రూ.1,200గా ఉంది. ఫారం కోళ్లు లైవ్‌ ధర కేజీ రూ.170గా ఉండగా, చికెన్‌ కేజీ రూ.240, స్కిన్‌లెస్‌ రూ.260గా ఉంది.

చేపల కొనుగోలు

కందనూలు: మృగశిర కార్తె సందర్భంగా నాగర్‌కర్నూల్‌ జిల్లా కేంద్రంలో ఒక రోజు ముందుగానే ప్రజలు చేపలను కొనుగోలు చేశారు. మృగశిర కార్తె ఆరంభం నుంచి వాతావరణంలో మార్పుల కారణంగా ఉష్ణోగ్రతలు తగ్గి, వివిధ రకాల వ్యాధులు సక్రమించే అవకాశం ఉంటుందని, అందుకే చేపలు తింటారని పూర్వీకులు చెబుతున్నారు. బొచ్చెలు, రౌటలు, బంగారు తీగలు వంటి రకాల చేపలు విక్రయించారు. బొచ్చెలు కిలో రూ.130 కాగా.. రౌటలు రూ.150, బంగారు తీగలు రూ.120కి విక్రయించారు.తాళం పగులగొట్టి చోరీ

Updated Date - Jun 07 , 2024 | 11:18 PM

Advertising
Advertising