సోమశిల వద్ద కృష్ణానదిలో విషాదం
ABN, Publish Date - Nov 05 , 2024 | 11:43 PM
నిండుకుండ లా ఉన్న కృష్ణా నదిలో అలివి వలలతో చేపల వేట సా గించి కోట్ల రూపాయలు గడించా లన్న దళారుల దురాశ ఓ నిండు ప్రాణాన్ని బలితీసుకున్నది.
- మైనర్ల ద్వారా చేపల వేట సాగిస్తున్న దళారులు
- పని నచ్చక పారిపోయేందుకు యత్నించిన ఆంధ్ర జాలరి మృతి
కొల్లాపూర్, నవంబరు 5 (ఆంధ్రజ్యోతి): నిండుకుండ లా ఉన్న కృష్ణా నదిలో అలివి వలలతో చేపల వేట సా గించి కోట్ల రూపాయలు గడించా లన్న దళారుల దురాశ ఓ నిండు ప్రాణాన్ని బలితీసుకున్నది. చేపలు పట్టడం ఇష్టంలేక వెట్టిచాకిరి భరించలేక పారిపోయేందుకు యత్నించిన మైనర్ అయిన ఆంధ్ర జాలరి కృష్ణానదిలో పడి మృతి చెందిన సంఘటన నాగర్‌కర్నూల్ జిల్లా కొల్లాపూర్ మండలం సోమశిల గ్రామంలో మంగళవారం తెల్లవారుజామున చోటుచేసుకున్నది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం లోని రాజమండ్రి సమీపంలోని ఓ గ్రామానికి చెందిన మైనార్టీ కూడా తీరని జాలరి నాగరాజును కొన్ని రోజుల క్రితమే తెలంగాణ మత్స్యకారులు కృష్ణానదిలో అలివి వలలతో చేపలు పట్టేందుకు సోమశిలకు తీసుకు వచ్చా రు. సోమశిలకు దగ్గరలోని అమరగిరి సమీపాన గట్టు ప్రదేశంలో చేపలవేట సాగించే స్థావరం ఏర్పాటు చేసు కున్నారు. కొన్ని రోజుల నుంచి తాను చేస్తున్న పని ఇష్టం లేక సొంత ఊరికి పారిపో యేందుకు కృష్ణానదిలో పుట్టి ద్వారా మంగళవారం తెల్లవారుజామున వారి స్థావరం నుంచి సుమన్‌తో కలిసి సోమశిల గ్రామానికి బయలుదేరాడు. గ్రామం సమీపం లోకి రాగానే నీటిపై తేలియాడుతున్న నీడను చూసి ఒడ్డు వచ్చిందని ఇద్దరూ దూకారు. దీంతో వాళ్లు నీట మునిగారు. చేసేది ఏమీ లేక ఓడ్డుకు చేరాలని ప్రయత్నించారు. అందులో సుమన్ అనే యువకుడు ఒడ్డుకు చేరుకోగా నాగరాజు నదిలో మునిగి ప్రాణాలు విడిచాడు. మంగళవారం ఉదయం సుమన్ చెప్పిన వివరాల ప్రకారం మత్స్యకారులు కృష్ణా నదిలో నాగరాజు మృత దేహాన్ని గుర్తించి పోలీసులకు సమాచారం ఇచ్చారు. పోలీసులు కేసు నమోదు చేసుకొ ని దర్యాప్తు చేస్తున్నారు. మృతదే హాన్ని కొల్లాపూర్ ఆసుపత్రిలో ఉంచారు. బుధవారం మృతదే హానికి పోస్టు మార్టం నిర్వహించి బాధిత కుటుంబ సభ్యులకు అప్ప జెప్పుతామని కొల్లాపూర్ ఎస్‌ఐ హృషికేష్ చెప్పారు.
Updated Date - Nov 05 , 2024 | 11:43 PM