ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

హోంగార్డ్‌ల బదిలీలు

ABN, Publish Date - Nov 23 , 2024 | 11:27 PM

ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా పెద్ద ఎత్తున హోంగార్డుల బదిలీలు జరగనున్నాయి. అందుకు కసరత్తు పూర్తి చేసిన అధికారులు శనివారం రాత్రి పొద్దుపోయాక ఉత్తర్వులు విడుదల చేసే అవకాశం ఉంది.

మహబూబ్‌నగర్‌లోని హోంగార్డ్స్‌ కార్యాలయం

ఉమ్మడి జిల్లాలో దాదాపు 150 మందికి స్థాన భ్రంశం

మహబూబ్‌నగర్‌, నవంబరు 23 (ఆంధ్రజ్యోతి): ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా పెద్ద ఎత్తున హోంగార్డుల బదిలీలు జరగనున్నాయి. అందుకు కసరత్తు పూర్తి చేసిన అధికారులు శనివారం రాత్రి పొద్దుపోయాక ఉత్తర్వులు విడుదల చేసే అవకాశం ఉంది. ప్రతీ రెండేళ్లకోసారి బదిలీలు చేయాల్సి ఉండగా, జిల్లాల విభజన తరువాత ఐదేళ్ల క్రితం బదిలీలు జరిగాయి. ఆ తర్వాత బదిలీలు చేపట్టకపోవడంతో ఎక్కడివాళ్లు అక్కడే ఉండిపోయారు. తాజాగా చేపట్టనున్న బదిలీల్లో మహబూబ్‌నగర్‌ జిల్లా నుంచి వంద మంది హోంగార్డ్‌లను ఇతర జిల్లాలకు బదిలీ చేయనున్నారు. వారిలో కొందరిని నారాయణపేట, మరికొందరిని గద్వాలకు బదిలీ చేస్తున్నారు. ఆయా జిల్లాల నుంచి వంద మంది హోంగార్డ్‌లు మహబూబ్‌నగర్‌కు రానున్నారు. మహబూబ్‌నగర్‌ జిల్లాలో జిల్లాకు చెందిన ఉద్యోగులు ఉండాల్సిన దానికన్నా ఎక్కువ సంఖ్యలో ఉండటంతో వారిని ఇతర జిల్లాలకు బదిలీ చేయాల్సి వస్తోంది. నారాయణపేట, గద్వాల జిల్లాలలో సొంత జిల్లాకు చెందిన వాళ్లు తక్కువగా ఉన్నారు. దాంతో ఆయా జిల్లాలకు మహబూబ్‌నగర్‌ నుంచి ఎక్కువ మందిని పంపించాల్సి వస్తోంది. వనపర్తిలోనూ కొద్దిమంది మాత్రమే తక్కువగా ఉండగా, నాగర్‌కర్నూల్‌ జిల్లాలో ఆ జిల్లాకు చెందిన హోంగార్డ్‌లు దాదాపుగా సరిపడా ఉన్నారు. కాగా సొంతజిల్లాకు చెందిన వారిని ఇతర జిల్లాలకు బదిలీ చేస్తుండటంతో పలువురు రాజకీయ నాయకులతో పైరవీలు సాగిస్తున్నారన్న ప్రచారం సాగుతోంది. పోలీ్‌సశాఖలో ఓ ఉన్నతాధికారి కనుసన్నలలో బదిలీల ప్రక్రియ సాగుతుండటంతో ఆ అధికారిని ప్ర సన్నం చేసుకునేందుకు హోంగార్డులు ప్రయత్నిస్తున్నారన్న వదంతులు వినిపిస్తున్నాయి.

బదిలీలలో అత్యంత గోప్యత

హోంగార్డుల బదిలీలలో ఉన్నతాధికారులు గోప్యతను ప్రదర్శిస్తున్నారు. ఓ జిల్లాకు సంబంధించిన అధికారి వద్దకు రెండు మూడ్రోజులుగా బదిలీల విషయంలో హోంగార్డులు క్యూ కడుతుండటంతో వారి తాకిడి తట్టుకోలేక ఆ అధికారి సెలవుపెట్టి వెళ్ళిపోయినట్లు సమాచారం. సొంత జిల్లాకు వచ్చేందుకు కొందరు ఉత్సాహం చూపుతుండగా, పక్క జిల్లాలకు వెళ్లే వారు ఎలాగైనా బదిలీ కాకుండా ఆపుకునేందుకు ప్ర యత్నాలు చేస్తున్నారు. సోమవారం నాటికి బదిలీలు, రిపోర్ట్‌ చేసే కార్యక్రమాలను ముగించాలని ఉన్నతాధికారులు భావిస్తున్నారు.

Updated Date - Nov 23 , 2024 | 11:27 PM