‘వేదంత దర్శిని’ పుస్తకావిష్కరణ
ABN, Publish Date - Sep 15 , 2024 | 11:24 PM
జిల్లా కేంద్రంలోని ఆర్య సమాజ మందిరంలో ఆదివారం పండిట్ అశోక్‌కుమార్ ఆధ్వర్యంలో నిర్వహించిన కారక్రమంలో ఏపూరి కిష్టప్ప రచించిన వేదాంత దర్శిని (సంకలనం) పుస్తకాన్ని డాక్టర్ మురళీధర్‌రావు, ఎం. కృష్ణారావు, డాక్టర్ భరద్వాజ్, రచయిత దోరేటి చెన్నయ్య, శతవదాని ములుగు అంజయ్య అతిథిగా హాజరై అవిష్కరించారు.
మహబూబ్‌నగర్ విద్యావిభాగం సెప్టెంబరు 15 : జిల్లా కేంద్రంలోని ఆర్య సమాజ మందిరంలో ఆదివారం పండిట్ అశోక్‌కుమార్ ఆధ్వర్యంలో నిర్వహించిన కారక్రమంలో ఏపూరి కిష్టప్ప రచించిన వేదాంత దర్శిని (సంకలనం) పుస్తకాన్ని డాక్టర్ మురళీధర్‌రావు, ఎం. కృష్ణారావు, డాక్టర్ భరద్వాజ్, రచయిత దోరేటి చెన్నయ్య, శతవదాని ములుగు అంజయ్య అతిథిగా హాజరై అవిష్కరించారు. వారు మాట్లాడుతూ.. వచ్చే తరాల వారికి జ్ఞానాన్ని అందించాలన్న విధంగా వేదాంత దర్శిని రచించబడిందన్నారు. ఉత్తమ ఉపాధ్యాయుడిగా ప్రభుత్వంచే గౌరవించబడి విద్యార్థులను తీర్చిదిద్ది అక్కడితో తన బాధ్యత పూర్తయిందని అనుకోకుండా, పదవీవిరమణ తర్వత కూడా తన రచనల ద్వారా ఏపూరి కిష్టప్ప ప్రజల్లో చైతన్యం కలిగిస్తున్నారని అన్నారు. కార్యక్రమంలో నాయిని భాగన్న గౌడ్, ప్రధానాచార్యులు నరసింహారెడ్డి తదితరులు పాల్గొన్నారు.
Updated Date - Sep 15 , 2024 | 11:24 PM