కోలాహలంగా వినాయక నిమజ్జనం
ABN, Publish Date - Sep 15 , 2024 | 11:05 PM
నాగర్‌కర్నూల్ జిల్లా కేంద్రంలో నవరాత్రులు పూజలు అందుకున్న గణ నాథులు ఆదివారం రాత్రి భక్తుల కోలాహలం మధ్య ని మజ్జనానికి తరలివెళ్లారు.
- డీజే నృత్యాలతో మార్మోగిన పట్టణం
- పెద్ద సంఖ్యలో తిలకించిన భక్తులు
నాగర్‌కర్నూల్ టౌన్, సెప్టెంబరు 15: నాగర్‌కర్నూల్ జిల్లా కేంద్రంలో నవరాత్రులు పూజలు అందుకున్న గణ నాథులు ఆదివారం రాత్రి భక్తుల కోలాహలం మధ్య ని మజ్జనానికి తరలివెళ్లారు. పట్టణంలోని మైల్‌స్టోన్ యూ త్, రెబల్‌యూత్, వీర శివాజీ యూత్, వివేకానంద యూత్, ఫ్రెండ్స్ యూత్, సెలక్షన్ సిండికేట్ తదితర ప్ర ధాన భారీ వినాయకులను ఉత్సవ కమిటీల ఆధ్వర్యంలో బ్యాండ్ మేళాలలో నిమజ్జనానికి తరలించారు. యువకు ల డీజే నృత్యాలు, చిన్నారుల కోలాటాలు, మహిళల బొ డ్డెమ్మలు, డోలు, సన్నాయి, చెక్క భజన కళాకారుల ప్రదర్శనలతో అర్థరాత్రి వరకు ఊరేగింపు నిర్వహించారు. యువకులు, చిన్నారులు ‘గణపతి బప్పా మోరియా’ అం టూ ఆనందంగా పరవశించిపోతూ నాగనూలు చెరువు వద్దకు నిమజ్జనానికి తరలివెళ్లారు. పట్టణంలోని ప్రఽధాన వీధులంతా భక్తుల సందర్శనతో సందడి నెలకొంది. వినా యక నిమజ్జన కార్యక్రమంలో పట్టణ ప్రజలు పెద్ద సం ఖ్యలో పాల్గొని తిలకించారు. వినాయక విగ్రహాలు ఊరేగింపు, నిమజ్జనం వద్ద ఎలాంటి అవాంఛనీ య సంఘటనలు పోలీ సులు కట్టుదిట్టమైన ఏర్పాట్ల మధ్య ఉత్స వాలను పూర్తి చేశారు.
గణనాథులను దర్శించుకున్న ఎమ్మెల్యే, మాజీ ఎమ్మెల్యే
కల్వకుర్తి : పట్టణంలో ప్రతిష్టించిన గణనా థులను ఎమ్మెల్మే కశిరెడ్డి నారాయణరెడ్డి, మాజీ ఎమ్మెల్యే గుర్క జైపాల్‌యాదవ్, పలువురు నాయకులు దర్శించు కుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా మండపాల నిర్వాహకులు ఎమ్మెల్యే, మాజీ ఎమ్మెల్యేలను పూల మాలలు, శాలువాలతో ఘనంగా సత్కరించారు. అనంతరం ఆయా మండపాల వద్ద విఘ్నేశ్వరున్ని పూ జిస్తూ మేలు చేకూరుతుందని పేర్కొన్నారు. అదేవిధంగా పలువురు నాయకులు గణనాథులను ద ర్శించుకుని పూజలు నిర్వహించా రు. వినాయక మండపాల వద్ద భక్తులు అన్నప్రసా ద కార్యక్రమాలు చేప ట్టారు. పీబీఎస్ ఓల్డే జ్‌హోమం సమీపం లో ప్రతిష్టించిన గణ నాథుని నిమజ్జనం కార్యక్రమం అత్యంత భ క్తిశ్రద్ధలతో జరిగింది. ఆ యా కార్యక్రమాల్లో మునిసిపల్ చైర్మన్ ఎడ్మ సత్యం, మాజీ సర్పంచ్ బృంగి ఆనంద్‌కుమార్, కౌన్సిలర్లు పాల్గొన్నారు.
తిమ్మాజిపేట : మండల పరిధిలోని అప్పాజిప ల్లిలో ఆదివారం భక్తిశ్రద్ధలతో భక్తులు రెడ్డి సేవా సమితి ఆధ్వర్యంలో ప్రతిష్ఠించిన వినాయకుడి నిమజ్జనం చేశా రు. ఈ సందర్భంగా గణేష్ కొలువుదీరిన మంటప ఆవ రణలో నిర్వహించిన లడ్డూ వేలం పాటలో పెద్ద ఎత్తున భక్తులు పాల్గొని పోటీ పడుతూ అదే గ్రామానికి చెందిన ఎనుముల కిరణ్‌కు మార్‌రెడ్డి అనే భక్తులు 30వేల 16రూపాయలకు దక్కిం చుకున్నారు. ఉత్సవ కమిటీ సభ్యులు ఆయనను శాలు వా కప్పి సన్మానించారు. గత 8రోజులుగా పూజలు అం దుకున్న వినాయకుని భజనలు చేస్తూ యువకులు నృత్యాలు చేస్తూ కోలాటాలు వేస్తూ మ హిళలు బతుకమ్మలు ఆడుతూ గ్రామంలో ఊరేగించారు. వి నాయకుడి ముందర వేసి న అడుగుల భజన ప్రత్యేక ఆకర్షణగా నిలి చింది. అంతకు ముం దు భక్తులకు అన్నదా నం చేశారు.
కోడేరు: మండ ల కేంద్రంతో పాటు మండ ల పరిధిలోని రాజాపూర్, నర్సా యిపల్లి, ఎత్తం తదితర గ్రామాల్లో గణనాథులు నిమజ్జనానికి ఆదివారం తరలివెళ్లారు. గ ణపయ్యలు, నవరాత్రులు పూజలు అందుకుని నిమజ్జనా నికి తరలివెళ్లారు. గణనాథులను భక్తిశ్రద్ధలతో భక్తులు ప్రత్యేక పూజలు నిర్వహించారు. గణేష్ మండపాల దగ్గర భక్తులు అన్నదాన కార్యక్రమాలు నిర్వహించారు. భక్తులకు గణనాథులు ఆశీస్సులు ఉండాలని ప్రజలు సుఖ సంతోషాలతో పాడి పంటలతో విరజిల్లాలని వేడు కున్నారు. గణేష్ లడ్డూ ఆయన అలంకరించిన పంచె తదితర వస్త్రాలను వేలం వేయగా భక్తులు వేలంలో పా ల్గొని వాటిని వారి సొంతం చేసుకున్నారు.
Updated Date - Sep 15 , 2024 | 11:05 PM