పొరపాట్లు చేశాం..
ABN, Publish Date - Nov 30 , 2024 | 12:09 AM
‘అధికారంలో ఉన్నపుడు కొన్ని పొరపాట్లు చేశాం. నిజమైన కార్యకర్తలకు పదవుల విషయంలో, గుర్తింపు విషయంలో న్యాయం జరగలేదు. పైరవీలకోసం పార్టీలోకి వచ్చిన వాళ్ళు పైరవీలు చేసుకుని వెన్నుపోటు పొడిచి పోయారు. మరికొందరు పార్టీలోనే ఉంటూ వెనుక గోతులు తీయడం వల్ల నష్టపోయాం.
జెండా మోసినోళ్ళకే గౌరవం
మాజీమంత్రి వి శ్రీనివా్‌సగౌడ్
మహబూబ్‌నగర్‌లో ఘనంగా బీఆర్‌ఎస్ దీక్షాదివస్
మహబూబ్‌నగర్, నవంబరు 29 (ఆంధ్రజ్యోతి): ‘అధికారంలో ఉన్నపుడు కొన్ని పొరపాట్లు చేశాం. నిజమైన కార్యకర్తలకు పదవుల విషయంలో, గుర్తింపు విషయంలో న్యాయం జరగలేదు. పైరవీలకోసం పార్టీలోకి వచ్చిన వాళ్ళు పైరవీలు చేసుకుని వెన్నుపోటు పొడిచి పోయారు. మరికొందరు పార్టీలోనే ఉంటూ వెనుక గోతులు తీయడం వల్ల నష్టపోయాం. ఇక అలాంటి పొరపాట్లు చేయకుండా జెండా మోసిన నిఖార్సైన కార్యకర్తలకు గౌరవం ఇచ్చే బాధ్యత మాది. అదే సమయంలో ద్రోహులను ఆధారాలతో పట్టుకుని కార్యకర్తలే పార్టీ నుంచి తన్ని తరిమేయాలి. ఇకపై అలాంటి పొరపాట్లు పార్టీలో జరగనివ్వమ’ని మాజీమంత్రి వి.శ్రీనివా్‌సగౌడ్ అన్నారు. బీఆర్‌ఎస్ దీక్షా దివ్‌సను పురస్కరించుకుని శుక్రవారం పార్టీ నాయకులు జిల్లా కేంద్రంలోని అమరవీరుల స్థూపం వద్ద నివాళులు అర్పించారు. అనంతరం పార్టీ జిల్లా కార్యాలయంలో తెలంగాణ తల్లి చిత్రపటానికి పూలమాలలు వేశారు. పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా ఉద్యమం గురించి కార్యకర్తలకు గుర్తు చేశారు. బీఆర్‌ఎస్ జిల్లా అధ్యక్షుడు, మాజీమంత్రి డాక్టర్ సి.లక్ష్మారెడ్డి అధ్యక్షత వహించిన ఈసమావేశంలో మాజీమంత్రి శ్రీనివా్‌సగౌడ్ మా ట్లాడుతూ తమిళనాడులో నిర్వహిస్తున్న రాజకీయ పార్టీ కార్యకర్తలను ఎలా చూసుకుంటుంది? పార్టీ ఏ విధంగా పటిష్టంగా ఉందన్న విషయాలను బీఆర్‌ఎస్ విశ్లేషిస్తుందన్నారు. కేసీఆర్ దీక్ష చేయకుంటే తెలంగాణనే లేదన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వంపై ప్రజల్లో ప్రభుత్వంపై తీవ్ర వ్యతిరేకత వచ్చిందన్నారు. కేంద్రం జమిలీ ఎన్నికలకు పోవాలని తీవ్ర ప్రయత్నాలు చేస్తోందని, అదే జరిగితే రెండేళ్లు ముందుగానే ఎన్నికలు వస్తాయన్నారు. ఎన్నికలు ఎప్పుడు జరిగినా మళ్ళీ మనదే అధికారమని ధీమా వ్యక్తం చేశారు. లగచర్లలో మన పోరాటం కారణంగా 700 ఎకరాల భూసేకరణను ప్రభుత్వం రద్దు చేసుకుందన్నారు. లక్ష్మారెడ్డి మాట్లాడుతూ రైతులకు ఏం చేసిందని ఈ ప్రభుత్వం రైతు పండగను నిర్వహిస్తుందని ప్రశ్నించారు. కేసీఆర్ ఆనవాలు లేకుండా చేస్తామని ప్రభుత్వం చెప్పడం హాస్యాస్పదంగా ఉందని, అది భగవంతుడికే సాధ్యం కాదని మాజీ ఎమ్మెల్యే ఆల వెంకటేశ్వర్‌రెడ్డి అన్నారు. దీక్షా దివస్ ఇన్‌చార్జి క్యామమల్లే్‌షయాదవ్, నాయకులు ఇంతియాజ్, వాల్యానాయక్, రాజేశ్వర్‌గౌడ్, కోరమోని నర్సింహులు పాల్గొన్నారు.
Updated Date - Nov 30 , 2024 | 12:09 AM