ప్రతీ గ్రామానికి ఆర్టీసీ బస్సు సౌకర్యం కల్పిస్తాం..
ABN, Publish Date - Dec 06 , 2024 | 11:43 PM
వీలైనంత త్వరలో వనపర్తి నియోజకవర్గంలో ప్రతీ గ్రామానికి ఆర్టీసీ బస్సు సౌకర్యం ఉండే లా ఏర్పాటు చేస్తానని ఎమ్మెల్యే తూడి మేఘా రెడ్డి హామీ ఇచ్చారు.
వనపర్తి అర్బన్, డిసెంబరు 6 (ఆంధ్రజ్యోతి) : వీలైనంత త్వరలో వనపర్తి నియోజకవర్గంలో ప్రతీ గ్రామానికి ఆర్టీసీ బస్సు సౌకర్యం ఉండే లా ఏర్పాటు చేస్తానని ఎమ్మెల్యే తూడి మేఘా రెడ్డి హామీ ఇచ్చారు. శుక్రవారం జిల్లా కేంద్రం లోని ఆర్టీసీ ప్రజాపాలన ఉత్సవాల్లో పాల్గొని మాట్లాడారు. గత ప్రభుత్వ పాలనలో ఇబ్బందు లు ఎదుర్కొన్న ఆర్టీసీ.. నేడు 69 లక్షల నుంచి రూ.11 కోట్ల ఆదాయానికి చేరుకుందన్నారు. ఆర్టీ సీకి సంబంధించిన సమస్యలపై పోరాటం చేసే వీలు లేకుండా యానియన్లను రద్దు చేసి నియ ంతపాలన కొనసాగించారని మండిపడ్డారు. బీ ఆర్‌ఎస్ హయాంలో ఆర్టీసీ ఉద్యోగుల యూని యన్లను రద్దు చేసి ఉన్న ఆస్తులను అమ్మిన చరి త్ర బీఆర్‌ఎస్ పాలకులకే దక్కిందని అన్నారు. రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తరువాత మహిళలకు గత ఎన్నికల ముందు ఇ చ్చిన హామీ మేరకు ఉచితంగా ఆర్టీసీ బస్సు ప్ర యాణం కల్పించినట్లు తెలిపారు. మునిసిపల్ చె ర్మన్ పుట్టపాకల మహేష్, మార్కెటింగ్ యార్డు చైర్మన్ శ్రీనివాస్ గౌడ్, డిపో మేనేజర్ వేణుగో పాల్, ఆర్టీసీ కార్మికులు, కౌన్సిలర్లు పాల్గొన్నారు.
Updated Date - Dec 06 , 2024 | 11:43 PM