ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

సంక్షేమ పథకాలు వినియోగించుకోవాలి

ABN, Publish Date - Dec 07 , 2024 | 11:18 PM

ప్రభుత్వ సంక్షేమ పథకాలను మహిళలు వినియోగించుకోవాలని ఎమ్మెల్యే డాక్టర్‌ చిట్టెం పర్ణికారెడ్డి అన్నారు.

పేట చౌక్‌బజార్‌ సమీపంలో అర్బన్‌ మహిళా శక్తి క్యాంటీన్‌ ప్రారంభం అనంతరం మహిళలతో ఎమ్మెల్యే డాక్టర్‌ చిట్టెం పర్ణికారెడ్డి

- ఎమ్మెల్యే డాక్టర్‌ చిట్టెం పర్ణికారెడ్డి

- చౌక్‌బజార్‌లో అర్బన్‌ మహిళా క్యాంటీన్‌ ప్రారంభం

నారాయణపేట టౌన్‌, డిసెంబరు 7 (ఆంధ్రజ్యోతి): ప్రభుత్వ సంక్షేమ పథకాలను మహిళలు వినియోగించుకోవాలని ఎమ్మెల్యే డా క్టర్‌ చిట్టెం పర్ణికారెడ్డి అన్నారు. జిల్లా కేంద్రంలోని చౌక్‌బజార్‌ సమీపంలో అర్బన్‌ మహిళా క్యాంటీన్‌ను శనివారం ఆమె ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ మహిళలు ప్రభుత్వ సం క్షేమ పథకాలను సద్వినియోగం చేసుకొని ఆర్థి కంగా రాణించాలని సూచించారు. అలాగే ముని సిపాలిటీకి నూతనంగా మంజూరైన పారిశుధ్య ట్రాక్టర్లను ఎమ్మెల్యే ప్రారంభించారు.

ఎమ్మెల్యేకు వినతుల వెల్లువ

పేట జిల్లా కేంద్రంలో పీజీ కళాశాలను ఏర్పా టు చేయాలని పీడీఎస్‌యూ ఆధ్వర్యంలో ఎమ్మె ల్యేకు వినతిపత్రం అందించారు. అలాగే ప్రభుత్వ జూనియర్‌ కళాశాలల్లో మధ్యాహ్న భోజనం అమలు చేయాలని కోరారు. కోటకొండ గ్రామాన్ని మండల కేంద్రంగా ఏర్పాటు చేయాలని బీఆర్‌ఎస్‌ పార్టీ ఆధ్వర్యంలో వినతిపత్రం సమర్పించారు. వాల్మీకి బోయలను ఎస్టీ జాబితాలోకి మా ర్చేలా అసెంబ్లీలో మాట్లాడాలని.. గ్రామ పంచా యతీ కార్మికులకు ఇందిరమ్మ ఇల్లు మంజూరు చేయాలని కోరుతూ వేర్వేరుగా వినతిపత్రం అం దించారు.

ఘనంగా బొడ్రాయి ప్రతిష్ఠాపన

నారాయణపేట రూరల్‌ : మండల పరిధిలోని భైరంకొండ గ్రామంలో ఆంజనేయ స్వామి విగ్రహ ప్రతిష్ఠ, బొడ్రాయి ప్రతిష్ఠాపన ఉత్సవాలు శనివారం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆలయంలో నిర్వహించిన ప్రత్యేక పూజల్లో మహబూబ్‌నగర్‌ ఎంపీ డీకే అరుణ, పేట ఎమ్మెల్యే డాక్టర్‌ చిట్టెం పర్ణికారెడ్డిలు హాజరై, ప్రత్యేక పూజలు నిర్వహించారు. కార్యక్రమంలో మార్కెట్‌ కమిటీ చైర్మన్‌ సదాశివారెడ్డి, కాంగ్రెస్‌ నాయకులు సిద్రాంరెడ్డి, వాదిరాజ్‌, వెంకట్‌రెడ్డి, ఉపసర్పంచ్‌ బాలు, బీజేపీ జిల్లా అధ్యక్షుడు శ్రీనివాస్‌, మహిళా మోర్చా జిల్లా అధ్యక్షురాలు లక్ష్మీశ్యాంసుందర్‌, ఎంపీటీసీ మాజీ సభ్యురాలు జ్యోతి, నాయకులు సత్యయాదవ్‌, రఘుపాల్‌, నారాయణరెడ్డి, తదితరులు పాల్గొన్నారు. అదేవిధంగా భీష్మ ఫౌండేషన్‌ చైర్మన్‌ కె.రాజ్‌కుమార్‌రెడ్డి స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు.

ఫారెస్ట్‌ భవనం ప్రారంభం

పేట మండల పరిధిలోని కోటకొండ గ్రామంలో ఫారెస్ట్‌ నూతన భవనాన్ని శనివారం ఎమ్మెల్యే డాక్టర్‌ చిట్టెం పర్ణికారెడ్డి ప్రారంభించారు. రూ.30.95 లక్షలతో మంజూరైన భవనాన్ని ఆమె ప్రారంభించారు.

అంబులెన్స్‌ సేవలు వినియోగించుకోవాలి

దామరగిద్ద : మండల ప్రజలు అంబులెన్స్‌ సేవలు వినియోగించుకోవాలని ఎమ్మెల్యే డాక్టర్‌ చిట్టెం పర్ణికారెడ్డి అన్నారు. శనివారం మండల కేంద్రంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో నూతన 108 అంబులెన్స్‌ వాహనానికి ఆమె పూజలు చేసి ప్రారంభించారు. అనంతరం ఆరోగ్య కేంద్రంలోకి వెళ్లి పలు రిజిస్టర్లు పరిశీలించి, ఆసుపత్రిలో ఉన్న సమస్యలు అడిగి తెలుసుకున్నారు. పీహెచ్‌సీ ప్ర స్తుతం 12 గంటలు మాత్రమే ఉందని.. 24 గంట లు సేవలందించేలా మంజూరు చేయాలని స్థానిక నాయకులు కోరారు. డీఎంఅండ్‌హెచ్‌వో సౌ భాగ్యలక్ష్మి, డాక్టర్‌ సుదేశ్న, కీర్తీ, కాంగ్రెస్‌ నాయకులు పాల్గొన్నారు.

ఆర్టీసీ అభివృద్ధికి పాటుపడ్తాం

నారాయణపేట : ఆర్టీసీ సంస్థకు రాష్ట్ర ప్రభుత్వం అండగా ఉండి అభివృద్ధి చేస్తుందని ఎమ్మె ల్యే చిట్టెం పర్ణికారెడ్డి అన్నారు. శనివారం స్థానిక ఆర్టీసీ డిపోలో డీఎం లావణ్య అధ్యక్షతన జరిగిన ప్రజాపాలన విజయోత్సవ సభలో ఎమ్మెల్యే మాట్లాడారు. అనంతరం ఇద్దరు మహిళా ప్రయా ణికులతో పాటు ఓ మహిళా కండక్టర్‌ను ఎమ్మె ల్యే శాలువాతో సత్కరించారు. కార్యక్రమంలో మునిసిపల్‌ చైర్‌పర్సన్‌ గందె అనసూయ, మార్కెట్‌ చైర్మన్‌, జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్‌ వార్ల విజయ్‌కుమార్‌, కౌన్సిలర్లు ఎండీ.సలీం, సరిత, ఆర్టీసీ సిబ్బంది పాల్గొన్నారు.

Updated Date - Dec 07 , 2024 | 11:18 PM