ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

ఏం ఉద్దరించారని సంబురాలు

ABN, Publish Date - Nov 30 , 2024 | 12:04 AM

ఏడాది కాలంలో రాష్ట్రంలో కాంగ్రెస్‌ ప్రభుత్వం రైతు ల కోసం ఏం ఉద్ద రించారని మూడు రోజుల పాటు రైతు సంబురాలు చేసుకుంటున్నట్లని మాజీ మంత్రి నిరంజన్‌రెడ్డి మండిపడ్డారు.

పార్టీ నాయకులతో కలిసి జై తెలంగాణ నినాదాలు చేస్తున్న మాజీ మంత్రి నిరంజన్‌రెడ్డి

- దీక్షా దివస్‌లో మాజీ మంత్రి నిరంజన్‌రెడ్డి

వనపర్తి అర్బన్‌, నవంబరు 29 (ఆంధ్రజ్యోతి): ఏడాది కాలంలో రాష్ట్రంలో కాంగ్రెస్‌ ప్రభుత్వం రైతు ల కోసం ఏం ఉద్ద రించారని మూడు రోజుల పాటు రైతు సంబురాలు చేసుకుంటున్నట్లని మాజీ మంత్రి నిరంజన్‌రెడ్డి మండిపడ్డారు. శుక్ర వారం బీఆర్‌ఎస్‌ పార్టీ ఆధ్వర్యంలో నిర్వ హించిన దీక్ష దివస్‌ కార్యక్ర మం ఆ పార్టీ కార్యాలయంలో ఘనంగా నిర్వహిం చారు. ఆయన హాజరై మాట్లాడుతూ... ఉద్యమ నాయకుడు మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్‌ 14 ఏళ్లు రాష్ట్రం కోసం సుదీర్ఘ పోరాటం చేశారన్నారు. దే శం లోనే వ్యవసాయంలో ముందున్న పంజాబ్‌, హర్యా నా రాష్ట్రాలు కూడా మంచినీటి, సాగునీటి, పరిశ్రమ లు, జీవన ప్రమాణాలలో మనకంటే వెనకాలనే ఉ న్నారని గుర్తు చేశారు. ప్రజలకు అవసర మైన పను లను తొమ్మిదిన్నర ఏళ్ల కాలంలో చేసి ప్రజల మన్న నలు పొందారని గుర్తు చేశారు. తదనంతరం అధి కారంలోకి వచ్చిన కాంగ్రెస్‌ పార్టీ ఏడాది కాలంలోనే దేశంలో ఏ రాష్ట్ర ప్రభుత్వమూ మూటకట్టుకోని అప కీర్తిని పొందిందని విమర్శించారు. ఉమ్మడి జిల్లాకు చెందిన ఒక మంత్రి పుట్టినప్పటి నుంచి కాంగ్రెస్‌ పా ర్టీలో ఉన్నట్లు కేసీఆర్‌పై విమర్శలు చేస్తున్నారని, మొన్నటి వరకు కేసీఆర్‌ హయాంలో 2019లో ఓ డిపోయినా బుల్లెట్‌ ప్రూఫ్‌ వాహనం, పది మంది సె క్యూరిటీని పెట్టుకుని రాజభోగం అనుభవించలేదా అని ప రోక్షంగా జూపల్లిపై మండిపడ్డారు. రాబోయే స్థానిక సంస్థల ఎన్నికలను దృష్టిలో ఉంచుకుని బీఆర్‌ఎస్‌ బలోపేతం చేయడంతో పాటు పార్టీ నిర్ణయించే అభ్యర్థులను స్థానిక సంస్థల్లో గెలి పించాలని సూచించారు. వనపర్తి నియోజకవర్గం కో సం ఎంతో కృషి చేశానని గుర్తు చేశారు. కొందరు సన్యాసులు ఏవేవో మాట్లాడుతూ ఉంటారని అవి వారి విజ్ఞతకే వదిలేస్తున్నట్లు తెలిపారు. జిల్లా అ ధ్యక్షుడు గట్టు యాదవ్‌, జిల్లా అధికార ప్రతినిధి వాకిటి శ్రీధర్‌, పట్టణ అధ్యక్షుడు రమేష్‌ గౌడ్‌, మీడియా సెల్‌ కన్వీనర్‌ అశోక్‌, పార్టీ నాయకులు, కార్యక ర్తలు తదితరులు పాల్గొన్నారు.

Updated Date - Nov 30 , 2024 | 12:04 AM