క్రీడల్లో గెలుపు, ఓటములు సహజం
ABN, Publish Date - Nov 09 , 2024 | 11:12 PM
క్రీడల్లో గెలుపు, ఓటములు సహజమని, క్రీడా స్ఫూర్తిని చాటాలని జిల్లా ఎస్‌జీఎఫ్ అండర్-19 సె క్రటరీ పాపిరెడ్డి అన్నారు.
- ఎస్జీఎఫ్ అండర్-19 సెక్రటరీ పాపిరెడ్డి
మహబూబ్‌నగర్ స్పోర్ట్స్, నవంబరు 9(ఆంధ్రజ్యోతి): క్రీడల్లో గెలుపు, ఓటములు సహజమని, క్రీడా స్ఫూర్తిని చాటాలని జిల్లా ఎస్‌జీఎఫ్ అండర్-19 సె క్రటరీ పాపిరెడ్డి అన్నారు. జిల్లా స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ ఆధ్వర్యం లో జిల్లా కేంద్రంలోని స్టేడియం మైదానంలో నిర్వహిస్తున్న రాష్ట్ర్ట్ర స్థాయి ఎస్‌జీఎఫ్ అండర్-19 బాల,బాలికల బాస్కెట్‌బాల్ టోర్నీలో భాగంగా శనివారం రెండో రోజు పోటీలను పాపిరెడ్డి హాజరై ప్రా రంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ చదువుతో పాటు క్రీడల్లో రాణించాలని, క్రీడాకారులకు మంచి భవిష్యత్తు ఉంటుందని తెలిపారు. టోర్నీలో క్రీడా కారులు ప్రతిభ చాటి జాతీయ స్థాయి పోటీల కు ఎదగాలని ఆకాంక్షించారు.టోర్నీ రాష్ట్ర పరి శీలకుడు గోవర్దన్‌రెడ్డి, పీడీ ముకుర్రం, బా స్కెట్‌బాల్ సంఘం ప్రతినిధి సుభహన్ జీ, కోచ్ ఖలీల్, వ్యాయామ ఉపాధ్యాయు లు అరుణజ్యోతి, నాగరాజు పాల్గొన్నారు.
హ్యాండ్‌బాల్‌లోరన్నర్‌గా నిలిచిన మహబూబ్‌నగర్ జట్లు
రంగారెడ్డి జిల్లా తుక్కుగూడలో శని వారం జరిగిన రాష్ట్ర స్థాయి ఎస్‌జీఎఫ్ అం డర్-19 హ్యాండ్‌బాల్ టోర్నీలో పాల్గొనే ఉ మ్మడి జిల్లా బాలబాలికల జట్లు రన్నర్‌గా నిలిచాయి. జిల్లా జట్లు రన్నర్‌గా నిలువడం పట్ల ఎస్‌జీఎఫ్ అండర్-19 సెక్రటరీ పాపిరెడ్డి, హ్యాండ్‌బాల్ అసోసియేషన్ ప్రతినిధులు జీయావుద్దీన్, ఆసీఫ్, బాలు అభినందించారు.
ఫైనల్‌కు చేరిన మహబూబ్‌నగర్, హైదరాబాద్, రంగారెడ్డి జట్లు
జిల్లా స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ ఆ ధ్వర్యంలో జిల్లా కేంద్రంలోని స్టేడియం మైదానం లో నిర్వహిస్తున్న రాష్ట్ర స్థాయి ఎస్‌జీఎఫ్ అండర్- 19 బాల,బాలికల బాస్కెట్‌బాల్ టోర్నీ హోరా హోరీగా కొనసాగుతున్నది. శనివారం జరిగిన మ్యాచ్‌లో బాలుర విభాగంలో జరిగిన సెమీఫైన ల్ హైదరాబాద్ జట్టు కరీంనగర్‌పై 26-20, రెండో సెమీఫైనల్ రంగారెడ్డి జట్టు వరంగల్‌పై 33-11 స్కోర్ తేడాతో గెలిచి హైదరాబాద్, రంగారెడ్డి జట్లు ఫైనల్ చేరాయి. బాలికల విభాగంలో జరిగిన మొదటి సెమీఫైనల్‌లో హైదరాబాద్ జట్టు రంగా రెడ్డిపై 34-10 గెలిచింది. రెండో సెమీఫైనల్ మ్యాచ్ మహబూబ్‌నగర్ జట్టు ఖమ్మంపై 28-26 స్కోర్ తే డాతో గెలిచింది. బాలికల విభాగంలో హైదరాబాద్, మహబూబ్‌నగర్ జట్లు ఫైనల్‌కు చేరాయి. ఆదివారం ఫైనల్‌లో జట్లు తలబడనున్నాయి.
ఎస్జీఎఫ్ అండర్-19 ఫుట్‌బాల్ బాలబాలికల జట్టు ఎంపిక
జడ్చర్ల, (ఆంధ్రజ్యోతి) : ఎస్జీఎఫ్ అండర్-19 ఫుట్‌బాల్ బాలబాలికల జిల్లా జట్టు ఎంపిక ప్రక్రియను శని వారం జడ్చర్లలోని మినీస్టేడియంలో నిర్వహించారు. ఈ ఎంపి కలో 80 మంది క్రీడాకారులు పాల్గొనగా, ఒక్కో జట్టుకు క్రీడాకారు లను ఎంపిక ప్రక్రియ నిర్వహించారు. జడ్చర్లలో జరగబోయే 68వ ఎస్జీఎఫ్ అండర్-19 ఫుట్‌బాల్ పోటీలకు జిల్లా జట్టు పక్షాన పాల్గొనే క్రీడాకారులను ఎంపిక చేసినట్లు నిర్వాహకులు తెలిపారు. ఈ ఎంపిక ప్రక్రియలో ఎస్జీఎఫ్ కార్యదర్శి పాపిరెడ్డి, ఆర్గనైజింగ్ కార్యదర్శి మో యిన్, భానుకిరణ్, కృష్ణ, నరసింహరెడ్డి, నాగేశ్వర్, కిశోర్, రామకృష్ణ, రాములు, శ్రీనివాసులు తదితరులు పాల్గొన్నారు.
Updated Date - Nov 09 , 2024 | 11:12 PM