ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

మత్స్యకారుల సంక్షేమానికి కృషి

ABN, Publish Date - Nov 05 , 2024 | 11:21 PM

మత్స్యకారుల సంక్షేమానికి కృషి చేస్తున్నామని కాంగ్రెస్‌ పార్టీ కొడంగల్‌ నియోజకవర్గ ఇన్‌చార్జి ఎ.తిరుపతిరెడ్డి అన్నారు.

మద్దూర్‌ కాచెరువులో చేపపిల్లలను వదులుతున్న అధికారులు, నాయకులు

- కాంగ్రెస్‌ పార్టీ కొడంగల్‌ నియోజకవర్గ ఇన్‌చార్జి ఎ.తిరుపతిరెడ్డి

- మద్దూర్‌, కోస్గి, కొత్తపల్లి మండలాల్లోని చెరువుల్లో చేప పిల్లల వదిలివేత

మద్దూర్‌/కోస్గి/కొత్తపల్లి, నవంబరు 5 (ఆంధ్రజ్యోతి): మత్స్యకారుల సంక్షేమానికి కృషి చేస్తున్నామని కాంగ్రెస్‌ పార్టీ కొడంగల్‌ నియోజకవర్గ ఇన్‌చార్జి ఎ.తిరుపతిరెడ్డి అన్నారు. మంగళవారం మద్దూర్‌ గ్రామ శివారులోని కాచెరువుతో పాటు, కోస్గి మునిసిపల్‌ పరిధిలోని నాగుల చెరువు, కొత్తపల్లి మండలం మన్నాపూర్‌ చెరువులో మత్స్యశాఖ ఏడీ ఎస్‌ఏ.రహ్మాన్‌తో కలిసి చేప పిల్లలను వదిలారు. అనంతరం ఆయా చోట్ల ఏర్పాటు చేసిన సమావేశాల్లో తిరుపతిరెడ్డి మా ట్లాడారు. నియోజకవర్గంలో ఎంపికైన చెరువులో సంఘాల ఆధ్వర్యంలో చేప పిల్లలను వదులుతున్నామన్నారు. మద్దూర్‌లో మత్స్యకారులు తిరుపతిరెడ్డితో పాటు, ఏడీని ఘనంగా సన్మానించారు. కార్యక్రమంలో కాడా అధికారి వెంకట్‌రెడ్డి, జడ్పీటీసీ మాజీ సభ్యుడు రఘుపతిరెడ్డి, మాజీ ఎంపీపీ సంజీవ్‌కుమార్‌, కోస్గి మార్కెట్‌ కమిటీ చైర్మన్‌ భీములు, పీఏసీఎస్‌ అధ్యక్షుడు నర్సింహా, జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్‌ వార్ల విజయ్‌కుమార్‌, మండల మత్స్యకార సంఘం సభ్యు లు, మండల అధికారులు పాల్గొన్నారు. కోస్గిలోని నాగులచెరువులో చేపపిల్లలను వది లిన అనంతరం స్థానిక 13వ వార్డులో హైమాస్ట్‌ లైట్లను తిరుపతిరెడ్డి ప్రారంభించారు. అలాగే, 11వ వార్డులో ఆంజనేయస్వామి ఆలయ నిర్మాణ పనులు పరిశీలించారు. గుండుమల్‌ గ్రామంలో కాడా అధికారి వెంకట్‌రెడ్డితో కలిసి కల్యాణలక్ష్మి షాదీముబారక్‌ చెక్కులు పంపిణీ చేసి, మాట్లా డారు. కార్యక్రమంలో ఎంపీడీవో శ్రీధర్‌, తహసీల్దార్‌ భాస్కరస్వామి, మునిసిపల్‌ కమిషనర్‌ నాగరాజు, కాంగ్రెస్‌ పార్టీ మండల అధ్యక్షుడు రఘువర్దన్‌రెడ్డి, పీఏసీఎస్‌ చైర్మన్‌ భీంరెడ్డి, మార్కెట్‌ కమిటీ వైస్‌ చైర్మన్‌ గిరిప్రసాద్‌రెడ్డి, ముని సిపల్‌ అధ్యక్షుడు బెజ్జు రాములు, కౌన్సిలర్లు, నాయకులు పాల్గొన్నారు. కొత్తపల్లిలో కాంగ్రెస్‌ పార్టీ మండల అధ్యక్షుడు కోట్ల మహేందర్‌రెడ్డి, రమేష్‌రెడ్డి, విజయ్‌ కుమార్‌, తిరుపతిరెడ్డి, రాజశేఖర్‌రెడ్డి ఉన్నారు.

Updated Date - Nov 05 , 2024 | 11:21 PM