ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

మీ వివాహ కలను నెరవేర్చుకోడానికి 40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్ లో ఇప్పుడు ప్రీమియం మెంబర్షిప్ ఉచితం. ఫోన్|| 9390 999 999, 8008 56 7898

ఘనంగా ప్రపంచ సైకిల్‌ దినోత్సవం

ABN, Publish Date - Jun 03 , 2024 | 11:00 PM

నారాయణపేట జిల్లా సైక్లింగ్‌ అసోసియేషన్‌ ఆధ్వర్యంలో ప్రపంచ సైకిల్‌ దినోత్సవాన్ని పురస్కరించుకొని సోమవారం పట్టణంలోని మినీ స్టేడియం నుంచి అంబేడ్కర్‌ చౌరస్తా వరకు సైకిల్‌ ర్యాలీ నిర్వహించారు

ర్యాలీ నిర్వహిస్తున్న క్రీడాకారులు

మక్తల్‌, జూన్‌ 3 : నారాయణపేట జిల్లా సైక్లింగ్‌ అసోసియేషన్‌ ఆధ్వర్యంలో ప్రపంచ సైకిల్‌ దినోత్సవాన్ని పురస్కరించుకొని సోమవారం పట్టణంలోని మినీ స్టేడియం నుంచి అంబేడ్కర్‌ చౌరస్తా వరకు సైకిల్‌ ర్యాలీ నిర్వహించారు. సైకిల్‌ తొక్కండి.. ఆరోగ్యంగా ఉండండి అని నినాదా లు చేస్తూ సైకిల్‌ ర్యాలీ నిర్వహించారు. ఈ ర్యాలీని సైక్లింగ్‌ జిల్లా ప్రధాన కార్యదర్శి బి.గోపాలం జెండా ఊపి ప్రారంభించారు. అనంతరం ఏర్పాటు చేసిన సమావేశంలో పీఈటీ గోపాలం మాట్లాడుతూ 2018 జూన్‌ 3 నుంచి ప్రపంచ వ్యాప్తంగా సైకిల్‌ దినోత్స వం జరుపుకొని సైకిల్‌ తొక్కడం వల్ల కలిగే ప్రయో జనాలు వివరించారు. శారీరక, ఫిట్‌నెస్‌ వస్తుందని, రోగ నిరోధక శక్తి పెంచుతుందన్నారు. కాలుష్యం తగ్గించే సైకిల్‌ ప్రయాణం ఎంతో శ్రేయస్కరం అన్నారు. సైకిల్‌ తొక్కడం వల్ల సంపూర్ణ ఆరోగ్యంగా ఉంటారన్నారు. కార్యక్రమంలో పీఈటీలు రూప, రమేష్‌కుమార్‌, అంబ్రేష్‌ పాల్గొన్నారు.

సైక్లింగ్‌ పోటీలు వాయిదా..

మక్తల్‌ మినీ స్టేడియంలో ఈనెల 3న జరగాల్సిన జిల్లా స్థాయి సైక్లింగ్‌ పోటీలను వర్షం కారణంగా వాయిదా వేసినట్లు జిల్లా సైక్లింగ్‌ ప్రధాన కార్యదర్శి బి.గోపాలం తెలిపారు. త్వరలో తేదీలు వెల్లడిస్తామన్నారు.

Updated Date - Jun 03 , 2024 | 11:00 PM

Advertising
Advertising