Share News

మంత్రిని కలిసిన జడ్పీ చైర్‌పర్సన్‌ సరిత

ABN , Publish Date - Feb 08 , 2024 | 11:38 PM

రాష్ట్ర నీటిపారుదల శాఖామంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డిని జిల్లా పరిషత్‌ చైర్‌పర్సన్‌ సరిత దంపతులు మర్యాదపూర్వకంగా కలిశారు.

మంత్రిని కలిసిన జడ్పీ చైర్‌పర్సన్‌ సరిత
మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డితో జడ్పీ చైర్‌పర్సన్‌ దంపతులు

- పెండింగ్‌ పనులు పూర్తి చేయాలని విజ్ఞప్తి

గద్వాల, ఫిబ్రవరి 8 : రాష్ట్ర నీటిపారుదల శాఖామంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డిని జిల్లా పరిషత్‌ చైర్‌పర్సన్‌ సరిత దంపతులు మర్యాదపూర్వకంగా కలిశారు. హైదరాబాద్‌లో గురువారం ఆయనను కలిసి జిల్లాలోని ప్రాజెక్టులు, సాగునీటి సమస్యలను వివరించారు. ఖరీఫ్‌ సీజన్‌ నాటికి పెండింగ్‌ పనులను పూర్తి చేయాలని, ఆయకట్టుకు పూర్తి స్థాయిలో సాగునీరు అందించేలా చర్యలు తీసుకోవాలని కోరారు. జిల్లాకు వచ్చి ప్రాజెక్టులపై సమీక్ష నిర్వహించాలని విజ్ఞప్తి చేశారు.

Updated Date - Feb 08 , 2024 | 11:38 PM