ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

మీ వివాహ కలను నెరవేర్చుకోడానికి 40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్ లో ఇప్పుడు ప్రీమియం మెంబర్షిప్ ఉచితం. ఫోన్|| 9390 999 999, 8008 56 7898

పిడుగుపాటుకు నలుగురి మృతి

ABN, Publish Date - Jun 06 , 2024 | 11:39 PM

పిడుగుపాటుకు మెదక్‌, సంగారెడ్డి జిల్లాల్లో నలుగురు మృతిచెందారు. మెదక్‌ జిల్లా హవేళిఘణపూర్‌ మండలం శమ్నాపూర్‌ శివారులో ఇద్దరు మృతిచెందిన ఘటన గురువారం వెలుగులోకి వచ్చింది.

హవేళిఘణపూర్‌/కౌడిపల్లి/కోహీర్‌, జూన్‌ 6: పిడుగుపాటుకు మెదక్‌, సంగారెడ్డి జిల్లాల్లో నలుగురు మృతిచెందారు. మెదక్‌ జిల్లా హవేళిఘణపూర్‌ మండలం శమ్నాపూర్‌ శివారులో ఇద్దరు మృతిచెందిన ఘటన గురువారం వెలుగులోకి వచ్చింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం శమ్నాపూర్‌ గ్రామానికి చెందిన శెట్టబోయిన సిద్దయ్య (48) రైతు. ఓరంగంటి నందు (23) వ్యవసాయ కూలీ. సిద్దయ్యకు చెందిన పూరిగుడిసె కప్పేందుకు పొరకను తీసుకువచ్చేందుకు ఇద్దరు కలిసి గ్రామ శివారులోని అడవికి వెళ్లారు. రాత్రయినా తిరిగిరాకపోవడంతో కుటుంబ సభ్యులు, గ్రామస్థులు వెతికారు. అర్ధరాత్రి తరువాత వారు అడవిలోని చెట్టుకింద వారి మృతదేహాలు గుర్తించారు. బుధవారం సాయంత్రం కురిసిన వానకు చెట్టు కింద నిలబడటంతో పిడుగుడి మృతి చెందినట్టు గుర్తించారు. పోలీసులకు సమాచారం అందించగా మృతదేహాలను పోస్టుమార్టు నిమిత్తం మెదక్‌ ప్రభుత్వాసుపత్రికి తరిలించారు. మృతుల కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై ఆనంద్‌గౌడ్‌ తెలిపారు.

గొర్రెల కాపరి..

గొర్రెలు, పశువులను మేపుతున్న వ్యక్తిపై పిడుగు పడడంతో ఒకరు మృతి చెందిన ఘటన మండల పరిధిలోని పీర్లా తండాలో గురువారం సాయంత్రం చోటుచేసుకుంది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం ధలవత్‌ గేమ్య నాయక్‌ (53) గురువారం మధ్యాహ్నం గొర్రెలు, పశువులను మేతకు తీసుకువెళ్లారు. ఇంటికి వచ్చేక్రమంలో తండా సమీపంలోని బురుజుగడ్డ సమీపంలోనికి రాగానే పిడుగు పడడంతో అక్కడిక్కడే మృతి చెందారు. కుటుంబ సభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేశారు.

ఉపాధి కోసం వచ్చి..

పిడుగు పాటుకు సంగారెడ్డి జిల్లా కోహీర్‌ మండలంలోని పిచేర్యాగడి గ్రామంలో ఒకరు మృతిచెందారు. గ్రామస్థులు తెలిపిన వివరాల ప్రకారం కర్ణాటక రాష్ట్రంకుంచారం మండలం శివరాంపూర్‌ గ్రామానికి చెందిన గోపాల్‌ (38) ఉపాధి కోసం భార్య, కూతురితో పిచేర్యాగడికి వచ్చి ఓ రైతు వద్ద పనికి కుదిరాడు. గురువారం సాయంత్రం పొలం వద్ద పనిచేస్తుండగా వర్షం రావడంతో చెట్టు కింద నిల్చున్నాడు. ఇంతలోనే పెద్ద శబ్దంతో గోపాల్‌ తలపై పిడుగు పడడంతో అతని అక్కడికక్కడే మృతి చెందాడు.

Updated Date - Jun 06 , 2024 | 11:39 PM

Advertising
Advertising