83.4 కిలోల ఎండు గంజాయి పట్టివేత
ABN, Publish Date - Aug 27 , 2024 | 11:16 PM
మునిపల్లి, ఆగస్ట్టు 27: సంగారెడ్డి జిల్లా కంకోల్ టోల్‌గేట్ వద్ద ఎక్సైజ్, ఎన్‌ఫోర్స్‌మెంట్ అధికారులు 83.4 కిలోల ఎండు గంజాయిని సోమవారం పట్టుకున్న విషయం తెలిసిందే. ప్రొహిబిషన్, ఎక్సైజ్, ఎన్‌ఫోర్స్‌మెంట్ మెదక్ డివిజన్ కమిషనర్ శ్రీనివా్‌సరెడ్డి, సంగారెడ్డి, మెదక్ డివిజన్ ఎన్‌ఫోర్స్‌మెంట్ అసిస్టెంట్ సూపరింటెంటెండ్ శ్రీనివా్‌సరావు మంగళవారం వివరాలు వెల్లడించారు.
టాటా సఫారీ సీజ్, సెల్‌ఫోన్ స్వాధీనం
పోలీసుల అదుపులో నిందితుడు
మునిపల్లి, ఆగస్ట్టు 27: సంగారెడ్డి జిల్లా కంకోల్ టోల్‌గేట్ వద్ద ఎక్సైజ్, ఎన్‌ఫోర్స్‌మెంట్ అధికారులు 83.4 కిలోల ఎండు గంజాయిని సోమవారం పట్టుకున్న విషయం తెలిసిందే. ప్రొహిబిషన్, ఎక్సైజ్, ఎన్‌ఫోర్స్‌మెంట్ మెదక్ డివిజన్ కమిషనర్ శ్రీనివా్‌సరెడ్డి, సంగారెడ్డి, మెదక్ డివిజన్ ఎన్‌ఫోర్స్‌మెంట్ అసిస్టెంట్ సూపరింటెంటెండ్ శ్రీనివా్‌సరావు మంగళవారం వివరాలు వెల్లడించారు. ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రం తుని నుంచి మహారాష్ట్రలోని నాసిక్‌కు టాటా సఫారీలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం చిత్తూరు జిల్లా పుంగనూర్ మండలం ఈటవాకిలి గ్రామానికి చెందిన ఎస్.అసరఫ్ అక్రమంగా ఎండు గంజాయిని తరలిస్తున్నట్లు నమ్మదగిన సమాచారంతో సోమవారం ఆ శాఖ అధికారులు కంకోల్‌టోల్ ప్లాజా వద్ద వాహన తనిఖీల్లో భాగంగా టాటా సఫారీని ఆపారు. అనుమానం వచ్చి తనిఖీ చేయగా.. 83.4 కిలోల ఎండు గంజాయి లభించినట్లు తెలిపారు. గంజాయితో పాటు సెల్‌ఫోన్‌ను స్వాధీనం చేసుకుని, వాహనాన్ని సీజ్ చేసినట్లు అధికారులు పేర్కొన్నారు. ఎండు గంజాయి విలువ రూ.30 లక్షలు ఉంటుందని తెలిపారు. ఈ సమావేశంలో సీఐ గాంధీనాయక్, ఎస్‌ఐ అనిల్‌కుమార్. హెడ్ కానిస్టేబుల్ ఎండీ.అలీం, కానిస్టేబుల్స్ మల్కయ్య, సతీష్, అనిల్‌కుమార్, గోపాల్, ప్రహ్లాద్ తదితరులు పాల్గొన్నారు.
గంజాయి విక్రయిస్తున్న ఐదుగురి అరెస్ట్
చేర్యాల, ఆగస్టు 27: కొమురవెల్లి మండల కేంద్రంలో గంజాయి విక్రయిస్తున్న కొమురవెల్లికి చెందిన ఇరువురు మైనర్లతో పాటు సిద్దిపేటకు చెందిన జంగం ఓంకార్, సమీర్, నగేశ్‌లను అరెస్ట్ చేసి రిమాండ్‌కు పంపించినట్లు చేర్యాల సీఐ ఎల్.శ్రీను తెలిపారు. కొమురవెల్లి పోలీ్‌సస్టేషన్‌లో మంగళవారం ఏర్పాటుచేసిన విలేకరుల సమావేశంలో సీఐ నిందితుల వివరాలను వెల్లడించారు. కొమురవెల్లి గ్రామానికి చెందిన ఇరువురు మైనర్లు గంజాయి సేవనానికి అలవాటు పడ్డారు. ఈ క్రమంలో చేర్యాల మండలం పోతిరెడ్డిపల్లి గ్రామానికి చెందిన ప్రేమ్‌రాజ్‌తో పరిచయం ఏర్పడింది. అతడి ద్వారా గంజాయి కొనుగోలు చేస్తూ తోటి యువకులకు అలవాటు చేస్తున్నారని తెలిపారు. ఇదే క్రమంలో సిద్దిపేటకు చెందిన జంగం ఓంకార్, సమీర్, నగేశ్‌లు సోమవారం రాత్రి ఇరువురు బాలురతో కలిసి గ్రామ శివారులోని దాసారంగుట్ట వద్ద గంజాయి సేవిస్తూ.. విక్రయిస్తున్నారన్న సమాచారంతో ఎస్‌ఐ రాజుగౌడ్ వారిని పట్టుకున్నాడని తెలిపారు. వీరినుంచి 60 గ్రాముల గంజాయి, రెండు బైక్‌లు, సెల్‌ఫోన్లను స్వాధీనం చేసుకుని సీజ్ చేసినట్లు తెలిపారు. బాలురకు నోటీసులు జారీచేసి తల్లిదండుల్రకు కౌన్సెలింగ్ చేశామని, సిద్దిపేటకు చెందిన ముగ్గురిని రిమాండ్‌కు పంపించినట్లు తెలిపారు. పోతిరెడ్డిపల్లికి చెందిన ప్రేమ్‌రాజ్ పరారీలో ఉన్నాడన్నారు. మల్లన్న ఆలయ సమీపంలో అసాంఘిక కార్యకలాపాలకు తావివ్వకుండా పటిష్ట నిఘా ఏర్పాటు చేశామన్నారు.
Updated Date - Aug 27 , 2024 | 11:16 PM