ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

గొంతులో గులకరాయి ఇరుక్కుని చిన్నారి మృతి

ABN, Publish Date - Jun 20 , 2024 | 11:47 PM

చేర్యాల, జూన్‌ 20 : చిన్నారులతో కలిసి ఆడుకుంటూ నోట్లో వేసుకున్న గులరకాయి గొంతులో ఇరుక్కుని చిన్నారి మృతి చెందిన సంఘటన గురువారం కొమురవెల్లి మండలం రాంసాగర్‌ గ్రామంలో చోటుచేసుకున్నది.

చేర్యాల, జూన్‌ 20 : చిన్నారులతో కలిసి ఆడుకుంటూ నోట్లో వేసుకున్న గులరకాయి గొంతులో ఇరుక్కుని చిన్నారి మృతి చెందిన సంఘటన గురువారం కొమురవెల్లి మండలం రాంసాగర్‌ గ్రామంలో చోటుచేసుకున్నది. చేర్యాల మండ లం కడవేరుగు గ్రామానికి చెందిన షబీర్‌-జరీనా దంపతుల ఏడాదిన్నర కూతురు అలీషా కొమురవెల్లి మండలం రాంసాగర్‌ గ్రామంలోని అమ్మమ్మ ఇంటి ఆవరణలో చుట్టుపక్కల చిన్నారులతో కలిసి ఆడుకుంటూ గులరకాయి నోట్లో పెట్టుకుని మింగింది. గొంతులో ఇరుక్కుని ఊపిరి ఆడకపోగా, రక్తంకారడాన్ని గమనించిన చుట్టుపక్కవారు కుటుంబసభ్యులకు తెలిపారు. వారు హుటాహుటిన కడవేరుగు గ్రామంలోని ఆర్‌ఎంపీ వద్దకు తీసుకువచ్చారు. ప్రాథమిక చికిత్స జరిపినా ప్రయోజనం కానరాకపోవడంతో చేర్యాలలోని ఓ ప్రైవేటు ఆస్పత్రికి తీసుకెళ్లారు. అప్పటికే చిన్నారి ఆరోగ్య పరిస్థితి విషమించడంతో పెద్దాస్పత్రికి తీసుకువెళ్లమని సూచించారు. సిద్దిపేటలోని చిన్నపిల్లల ఆస్పత్రికి తరలిస్తుండగా మార్గంమధ్యలో పరిస్థితి విషమించి మృతి చెందింది. అల్లారుముద్దుగా చూసుకున్న పాప కన్నుమూయడంతో తల్లిదండ్రులు కన్నీరుమున్నీరుగా విలపించారు.

Updated Date - Jun 20 , 2024 | 11:47 PM

Advertising
Advertising