సమగ్ర శిక్ష ఉద్యోగులకు మినిమం టైం స్కేలు అమలు చేయాలి
ABN, Publish Date - Aug 28 , 2024 | 11:10 PM
సంగారెడ్డి అర్బన్, ఆగస్టు 28: విద్యాశాఖలో కాంట్రాక్టు పద్ధతిన పనిచేస్తున్న సమగ్ర శిక్ష ఉద్యోగులకు మినిమం టైం స్కేలు అమలు చేయాలని సమగ్ర శిక్ష జేఏసీ అధ్యక్షుడు శేషాద్రి డిమాండ్ చేశారు.
సంగారెడ్డిలో మహార్యాలీ, నిరసన దీక్ష
సంగారెడ్డి అర్బన్, ఆగస్టు 28: విద్యాశాఖలో కాంట్రాక్టు పద్ధతిన పనిచేస్తున్న సమగ్ర శిక్ష ఉద్యోగులకు మినిమం టైం స్కేలు అమలు చేయాలని సమగ్ర శిక్ష జేఏసీ అధ్యక్షుడు శేషాద్రి డిమాండ్ చేశారు. తమ సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ గురువారం సమగ్ర శిక్ష ఉద్యోగులు సంగారెడ్డిలో మహార్యాలీ నిర్వహించి కలెక్టరేట్ వద్ద నిరసన దీక్ష చేపట్టారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సీఎం రేవంత్‌రెడ్డి ఇచ్చిన హామీని నేరవేర్చాలని కోరారు. గతేడాది హన్మకొండలో టీపీసీసీ అధ్యక్షుడి హోదాలో రేవంత్‌రెడ్డి కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన నెలరోజుల్లో సమగ్ర శిక్ష ఉద్యోగులను రెగ్యులర్ చేస్తామని ప్రకటించిన మాటకు కట్టుబడి ఉండాలన్నారు. ఆరోగ్యభీమా రూ.10 లక్షలు, జీవితభీమా రూ.10 లక్షలు, రిటైర్మెంట్ బెన్‌ఫిట్స్ రూ.10 లక్షల సౌకర్యం కల్పించాలని డిమాండ్ చేశారు. లేకపక్షంలో దశలవారీగా పోరాటాలు చేసేందుకు కార్యాచరణ రూపొందిస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో సీఆర్పీల సంఘం జిల్లా అధ్యక్షుడు ఎం.దత్తు, ఉద్యోగులు పాల్గొన్నారు.
Updated Date - Aug 28 , 2024 | 11:10 PM