మహా సముద్ర ప్రాంతాన్ని సందర్శించిన అదనపు కలెక్టర్
ABN, Publish Date - Jul 20 , 2024 | 11:45 PM
హుస్నాబాద్‌రూరల్, జూలై 20: ఈనెల 15న ‘ఆంధ్రజ్యోతి’లో ప్రచురితమైన ‘మహాసముద్రంకు మహర్దశ వచ్చేనా’ అన్న కథనంపై మంత్రి పొన్నం ప్రభాకర్, జిల్లా అధికారులు స్పందించారు.
‘ఆంధ్రజ్యోతి’ కథనానికి స్పందన
హుస్నాబాద్‌రూరల్, జూలై 20: ఈనెల 15న ‘ఆంధ్రజ్యోతి’లో ప్రచురితమైన ‘మహాసముద్రంకు మహర్దశ వచ్చేనా’ అన్న కథనంపై మంత్రి పొన్నం ప్రభాకర్, జిల్లా అధికారులు స్పందించారు. మంత్రి ఆదేశాల మేరకు శనివారం సిద్దిపేట అదనపు కలెక్టర్ గరిమా అగ్రవాల్ ఇరిగేషన్, టూరిజం శాఖల అధికారులతో మహాసముద్రం ప్రాంతాన్ని పరిశీలించారు. మహాసముద్రంలోకి నీరు ఎక్కడి నుంచి వస్తుంది. దీని కెపాసిటీ ఎంత..? గుట్టల పైభాగాన కోట కిలలు, సర్వాయిపాపన్న నిర్మించిన కోటగోడ, పైన ఉన్న దేవతల విగ్రహాలు, నీటి కొలనుల గురించి అడిగి తెలుసుకున్నారు. ఈ ప్రాంతాన్ని టూరిజం స్పాట్‌గా చేస్తే గుట్టల పైభాగానికి వెళ్లేందుకు కావాల్సిన రహదారి, మహాసముద్రంలో బోటింగ్ ఏర్పాటు తదితర అంశాలపై అధికారులను అడిగి తెలుసుకున్నారు. అలాగే మహాసముద్రానికి వెళ్లే దారి గండి పడడంతో పర్యాటకులకు ఇబ్బందులు లేకుండా అవుట్ ఫ్లో కెనాల్‌పై కల్వర్టు నిర్మాణం చేపట్టేందుకు రూ.18 లక్షలతో ప్రతిపాదనలు తయారు చేసి నిధుల మంజూరు కోసం పంపామని ఇరిగేషన్ అధికారులు అదరనె కలెక్టర్‌కు వివరించారు. ఎట్టకేలకు మహాసముద్రానికి మహర్దశ లభించనుందని స్థానికులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. అనంతరం రాములపల్లి గ్రామంలో ఉపాధిహామీ పథకం ద్వారా సాగుచేసిన మామిడితోటను పరిశీలించారు. పోతారం(ఎ్‌స)లో స్ర్తీశక్తి మహిళల కుట్టు శిక్షణా కేంద్రాన్ని, నానో ఓవెన్ బ్యాగ్స్, పేపర్‌ప్లేట్స్, గార్మెంట్స్ యూనిట్లను సందర్శించి మహిళల స్వయం ఉపాధిపై ఆరాతీశారు. ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్లను ఈ ప్రాంతంలో పెద్ద మొత్తంలో ఏర్పాటు చేయాలని సూచించారు. ఆమె వెంట డీఆర్డీవో జయదేవ్ ఆర్య, అదనపు డీఆర్డీవో మధుసూదన్, సింగిల్ విండో చైర్మన్ బొలిశెట్టి శివయ్య, పీసీసీ సభ్యులు కేడం లింగమూర్తి, బంక చందు, చిత్తారి పద్మ, జిల్లా ప్రాజెక్టు మేనేజర్ కర్ణాకర్, ఎంపీడీవో వేణుగోపాల్‌రెడ్డి, ఏపీఎం జి.శ్రీనివాస్, సీసీలు రవీందర్, అశోక్, వీవోఏ కనకతార, యమునా తదితరులు ఉన్నారు.
నర్సరీని సందర్శించిన అదనపు కలెక్టర్
హుస్నాబాద్, జూలై 20: హుస్నాబాద్ పట్టణంలోని మున్సిపల్ నర్సరీని అదనపు కలెక్టర్ గరిమా అగ్రవాల్ శనివారం సందర్శించారు. నర్సరీలో మొక్కల పెంపకంపై సలహాలు, సూచనలు చేశారు. పట్టణంలో మొక్కలు విరివిగా నాటాలని అధికారులను ఆదేశించారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్‌పర్సన్ ఆకుల రజిత, వైస్ చైర్‌పర్సన్ అయిలేని అనిత, కమిషనర్ మల్లికార్జున్, కౌన్సిలర్లు చిత్తారి పద్మ, వల్లపు రాజు పాల్గొన్నారు.
Updated Date - Jul 20 , 2024 | 11:45 PM