చెక్కుల పంపిణీలో రసాభాస
ABN, Publish Date - Aug 31 , 2024 | 11:39 PM
కౌడిపల్లి, ఆగస్టు 31: సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కుల పంపిణీలో రసాభాస నెలకొని, కాంగ్రెస్, బీఆర్‌ఎస్ కార్యకర్తలు తోపులాడుకున్నారు.
బీఆర్‌ఎస్, కాంగ్రెస్ కార్యకర్తల మధ్య వాగ్వాదం
కౌడిపల్లి, ఆగస్టు 31: సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కుల పంపిణీలో రసాభాస నెలకొని, కాంగ్రెస్, బీఆర్‌ఎస్ కార్యకర్తలు తోపులాడుకున్నారు. ఈ సంఘటన కౌడిపల్లి మండల కేంద్రంలోని ఎంపీడీవో కార్యలయం ఆవరణలోని సమావేశ మందిరంలో శనివారం జరిగింది. మండలంలోని 79 మంది లబ్ధిదారులకు సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కుల పంపిణీ కార్యక్రమంలో నర్సాపూర్ ఎమ్మెల్యే సునితారెడ్డి మాట్లాడారు. ప్రజా సమస్యల పరిష్కారానికి తన శక్తివంచన లేకుండా కృషి చేస్తానని, రాజకీయాలు తనకు కొత్తేమీ కాదని, ఎవరికీ భయపడాల్సిన అవసరం లేదని తెలపడంతో బీఆర్‌ఎస్ నాయకులు ‘జై సునీతమ్మ అని అనడంతో.. అక్కడే ఉన్న కాంగ్రెస్ నాయకులు ‘జై రేవంత్‌రెడ్డి’ అని అన్నారు. దీంతో ఇరువర్గాల నాయకులు ఒకరిపై ఒకరు ఆరోపణలు చేసుకోవడంతో సభా ప్రాంగణం హోరెత్తింది. చివరకు ఒకరినొకరు తోచుకునే వరకు వచ్చింది. వెంటనే పోలీసులు రంగ వ్రేఏశం చేసి ఇరుపార్టీల నాయకులకు సర్దిచెప్పారు. కాంగ్రెస్ ప్రభుత్వంలో వచ్చిన చెక్కులను ఎమ్మెల్యే ఎలా పంపిణీ చేస్తారని విమర్శించారు. ఈ కార్యక్రమంలో మాజీ మండలాధ్యక్షుడు రాజునాయక్, బీఅర్‌ఎస్ మండలాధ్యక్షుడు సార రామగౌడ్, మాజీ వైస్ ఎంపీపీ నవీన్‌గుప్తా, మాజీ ఎంపీటీసీల ఫోరం అధ్యక్షుడు ప్రవీణ్, మాజీ సర్పంచ్ కాంతారావు, శ్యాంసుందర్‌రావు, కాంగ్రెస్ మండలాధ్యక్షుడు శ్రీనివా్‌సరావు, పాష తదితరులు పాల్గొన్నారు.
Updated Date - Aug 31 , 2024 | 11:39 PM