జిల్లాలో బంద్ ప్రశాంతం
ABN, Publish Date - Aug 13 , 2024 | 11:57 PM
బంగ్లాదేశ్‌లో హిందువులపై, హిందూ ఆలయాలపై దాడికి నిరసనగా హింధూ ఐక్యవేదిక నాయకులు సిద్దిపేట బంద్‌కు పిలుపునిచ్చారు
మద్దతు తెలిపిన ఆయా పార్టీల నాయకులు
స్వచ్ఛందంగా వాణిజ్య, వ్యాపార, విద్యాసంస్థల మూసివేత
సిద్దిపేట క్రైం/గజ్వేల్/ములుగు, ఆగస్టు 13 : బంగ్లాదేశ్‌లో హిందువులపై, హిందూ ఆలయాలపై దాడికి నిరసనగా హింధూ ఐక్యవేదిక నాయకులు సిద్దిపేట బంద్‌కు పిలుపునిచ్చారు. హిందూ ఐక్యవేదిక నాయకుల పిలుపుమేరకు పట్టణంలో వాణిజ్య, వ్యాపార, విద్యాసంస్థలు స్వచ్ఛందంగా బంద్ పాటించాయి. పట్టణంలో ప్రధాన వీధుల గుండా హిందూ ఐక్యవేదిక ఆధ్వర్యంలో భారీ బైక్ ర్యాలీ నిర్వహించారు. కొందరు వ్యాపారులు బంద్ పాటించకపోవడంతో హిందూ ఐక్యవేదిక నాయకులు వారితో వాగ్వాదానికి దిగారు. పోలీసులు ఇరువర్గాలను శాంతిపంజేశారు. ఎలాంటి గొడవలు జరగకుండా పోలీసులు పటిష్ఠమైన బందోబస్తు నిర్వహించారు. గజ్వేల్-ప్రజ్ఞాపూర్ మునిసిపాలిటీలో చేపట్టిన బంద్ ప్రశాంతంగా ముగిసింది. హైందవ సంఘాల నాయకులు పిలుపునిచ్చిన ఈ బంద్‌కు బీజేపీ, బీఆర్‌ఎస్, కాంగ్రెస్ పార్టీల నాయకులు పూర్తిస్థాయిలో మద్దతు ప్రకటించారు. ప్రభుత్వ, ప్రైవేటు కళాశాలలలు, పాఠశాలల యాజమాన్యాలు పూర్తిస్థాయిలో సంఘీభావం ప్రకటించగా, స్కూళ్లు మూతబడ్డాయి. వ్యాపార, వర్తక సంస్థల యజమానులు స్వచ్ఛందంగా బంద్‌ను పాటించారు. అంగడిపేట హనుమాన్ ఆలయం నుంచి వివేకానంద విగ్రహం వరకు భారీ ర్యాలీని చేపట్టారు. ఈ ర్యాలీకి బీఆర్‌ఎస్ గజ్వేల్ నియోజకవర్గ ఇన్‌చార్జి వంటేరు ప్రతా్‌పరెడ్డి, గజ్వేల్-ప్రజ్ఞాపూర్ మునిసిపల్ చైర్మన్ ఎన్‌సీ రాజమౌళి, మునిసిపల్ మాజీచైర్మన్ గాడిపల్లి భాస్కర్, బీజేపీ నాయకులు వెంకటరమణ, గురువారెడ్డి, మనోహర్‌యాదవ్ తదితరులు మద్దతు పలికారు. పిడిచెడ్ రోడ్డు చౌరస్తాలో నిరసన తెలిపిన అనంతరం పలువురు హైందవ సంఘాల నాయకులు గజ్వేల్ ఆర్డీవోకు వినతీపత్రాన్ని అందజేశారు. ములుగు, వంటిమామిడిలో బీజేపీ నాయకుల ఆధ్వర్యంలో ప్రజలు స్వచ్ఛందంగా బంద్ పాటించారు. బీజేపీ నాయకులు లక్ష్మణ్‌గౌడ్, చిరంజీవి యాదవ్, బాగ్యలక్ష్మి కృష్ణయాదవ్‌తో పాటు పలు పార్టీలకు చెందిన నాయకులు పాల్గొన్నారు.
Updated Date - Aug 13 , 2024 | 11:57 PM