ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

విమర్శించే ముందు ఒళ్లు దగ్గర పెట్టుకోవాలి

ABN, Publish Date - Aug 24 , 2024 | 11:47 PM

క్రికెట్‌ అసోసియేషన్‌ సిద్దిపేట జిల్లా కార్యదర్శి కలకుంట్ల మల్లికార్జున్‌

మాట్లాడుతున్న కలకుంట్ల మల్లికార్జున్‌

సిద్దిపేట టౌన్‌, ఆగస్టు 24: కాంగ్రెస్‌ నాయకులు విమర్శించే ముందు ఒళ్లు దగ్గర పెట్టుకుని మాట్లాడాలని క్రికెట్‌ అసోసియేషన్‌ సిద్దిపేట జిల్లా కార్యదర్శి కలకుంట్ల మల్లికార్జున్‌ మండిపడ్డారు. సిద్దిపేట పట్టణంలోని మినీ స్టేడియంలో శనివారం ఆయన మాట్లాడుతూ.. కేసీఆర్‌ ట్రోఫీ రన్నర్స్‌కు నగదు బహుమతి అందించలేదంటూ ఇటీవలే కాంగ్రె్‌సలో చేరిన ఓ వ్యక్తి అసత్య ఆరోపణలు చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. కేసీఆర్‌ ట్రోఫీ గురించి మాట్లాడే నైతిక అర్హత అతడికి లేదన్నారు. సిద్దిపేట క్రికెట్‌ స్టేడియం మరుగునపడానికి ఆ వార్డు కౌన్సిలర్‌ భర్త పెత్తనమే కారణమని విమర్శించారు. క్రీడాకారుల భవిష్యత్తుతో ఆటలు ఆడుతున్న ఆ వార్డు కౌన్సిలర్‌ భర్త సంబంధిత క్రీడశాఖ అధికారులకు ఫోన్లు చేసి భయబ్రాంతులకు గురి చేస్తున్నాడని ఆరోపించారు. గతంలో బీఆర్‌ఎ్‌సలో ఉన్న ఆ కౌన్సిలర్‌ భర్త హరీశ్‌రావు నాకు దేవుడితో సమానమని, కరోనా బారిన పడిన నన్ను కాపాడిన దేవుడు అని పొగిడి నేడు విమర్శిస్తున్నారని మండిపడ్డారు. మీరు బీఆర్‌ఎ్‌సలో ఉన్నప్పుడు మంచిగా కనబడిన పనులు ఇప్పుడు తప్పుగా కనిపిస్తున్నాయా అని ప్రశ్నించారు.

Updated Date - Aug 24 , 2024 | 11:47 PM

Advertising
Advertising
<