ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

విద్యుత్‌ సమస్యలపై వినియోగదారుల అర్జీలు

ABN, Publish Date - Aug 27 , 2024 | 11:05 PM

సిద్దిపేట టౌన్‌, ఆగస్టు 27: ఎన్నోరోజులుగా నెలకొన్న విద్యుత్‌ సమస్యలను పరిష్కరించాలంటూ విద్యుత్‌ అధికారులు, సిబ్బందికి విన్నవించుకున్నా పరిష్కరించడం లేదంటూ సిద్దిపేట సబ్‌ డివిజన్‌కు చెందిన రైతులు, ప్రజలు తమ గోడను వెళ్లబుచ్చుకున్నారు.

సిద్దిపేట పట్టణంలోని విద్యుత్‌ భవన్‌లో విద్యుత్‌ ప్రజావాణిలో మాట్లాడుతున్న అధికారులు

త్వరలోనే పరిష్కరిస్తామన్న అధికారులు

విద్యుత్‌ ప్రజావాణికి 86 దరఖాస్తులు

సిద్దిపేట టౌన్‌, ఆగస్టు 27: ఎన్నోరోజులుగా నెలకొన్న విద్యుత్‌ సమస్యలను పరిష్కరించాలంటూ విద్యుత్‌ అధికారులు, సిబ్బందికి విన్నవించుకున్నా పరిష్కరించడం లేదంటూ సిద్దిపేట సబ్‌ డివిజన్‌కు చెందిన రైతులు, ప్రజలు తమ గోడను వెళ్లబుచ్చుకున్నారు. మంగళవారం సిద్దిపేట పట్టణంలోని విద్యుత్‌ భవన్‌లో సీజీఆర్‌ఎ్‌ఫ(కన్జ్యూమర్‌ గ్రీవెన్సెస్‌ రీడ్రెసెల్‌ ఫోరం) హైదరాబాద్‌ ఆధ్వర్యంలో విద్యుత్‌ ప్రజావాణిని నిర్వహించారు. ఈ సందర్భంగా ఎఫ్‌ఎసీ చైర్మన్‌ పి.నాగేశ్వర్‌రావు, టెక్సికల్‌ సీఈ సభ్యుడు రామాంజనేయ నాయక్‌, సిద్దిపేట జిల్లా ఎస్‌ఈ టీఆర్‌ చంద్రమోహన్‌ మాట్లాడుతూ విద్యుత్‌ ప్రజావాణిలో విద్యుత్‌ పరమైన సమస్యలు, లో వోల్టేజీ సమస్యలు ఇతరత్రా వాటిని పరిష్కరిస్తామని చెప్పారు. దీంతో రైతులు విద్యుత్‌ పోల్స్‌, ఓవర్‌ లోడ్‌, లో వోల్టేజీ, వ్యవసాయ భూమిలో ట్రాన్స్‌ఫార్మర్‌ ఏర్పాటు వల్ల హర్వేస్టర్‌ రావడం లేదంటూ పలు సమస్యలను దరఖాస్తు రూపంలో వినియోగదారులు విన్నవించుకున్నారు. దీంతో మొత్తంగా 86 ఆర్జీలు వచ్చినట్లు ఆ శాఖ అధికారులు తెలిపారు.

విద్యుత్‌ తీగలు ప్రమాదకరంగా ఉన్నాయి

వ్యవసాయ భూముల వద్ద విద్యుత్‌ తీగలు కిందకు వేలాడటంతో ప్రమాదకరంగా మారింది. అటువైపు వెళ్లాలంటేనే భయమేస్తున్నది. రెండేళ్ల నుంచి విద్యుత్‌ అధికారులు, సిబ్బంది దృష్టికి తీసుకెళ్లినా పట్టించుకోవడం లేదు. విద్యుత్‌ స్తంభాల మధ్య దూరం తగ్గించి మరిన్ని స్తంభాలను ఏర్పాటు చేయాలి. విద్యుత్‌ ప్రజావాణిలో సమస్యను పరిష్కరిస్తారని అర్జీ అందజేశాను.

- వెంకటరమణారెడ్డి, వెల్కటూర్‌, నంగునూరు మండలం

పశువులు చనిపోతున్నాయి

తమ వ్యవసాయ భూముల వద్ద ఏర్పాటు చేసిన విద్యుత్‌ నియంత్రిక వద్ద విద్యుత్‌ను నియంత్రించే ఆన్‌ ఆఫ్‌ సిస్టమ్‌ లేకపోవడంతో పశువులు విద్యుదాఘాతానికి గురై చనిపోతున్నాయి. కొన్నినెలలుగా సమస్యను పరిష్కరించాలని విద్యుత్‌ సిబ్బంది దృష్టికి తీసుకెళ్లినా ఫలితం లేకుండాపోయింది. త్వరలోనే సమస్యలను పరిష్కరిస్తామని విద్యుత్‌ ప్రజావాణిలో హామీనిచ్చారు.

- లక్ష్మణ్‌, అక్కెనపల్లి

Updated Date - Aug 27 , 2024 | 11:05 PM

Advertising
Advertising
<