ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

ఇచ్చిన మాటను నిలబెట్టుకున్న కాంగ్రెస్‌

ABN, Publish Date - Aug 19 , 2024 | 12:04 AM

కాంగ్రెస్‌ సిద్దిపేట ఇన్‌చార్జి హరికృష్ణ

మాట్లాడుతున్న పూజల హరికృష్ణ

సిద్దిపేట టౌన్‌, ఆగస్టు 18: రైతులకు రూ. 2 లక్షల రుణమాఫీని చేస్తామని ఇచ్చిన మాటకు కట్టుబడి మాట నిలబెట్టుకున్న పార్టీ కాంగ్సెసని ఆ పార్టీ సిద్దిపేట నియోజకవర్గ ఇన్‌చార్జి పూజల హరికృష్ణ పేర్కొన్నారు. సిద్దిపేట పట్టణంలోని పార్టీ క్యాంపు కార్యాలయంలో ఆదివారం తాజా పరిణామాల దృష్ట్యా ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడారు. సిద్దిపేటలో అల్లర్లు సృష్టించడం ద్వారా రాజీనామా అంశాన్ని పక్కదారి పట్టించేందుకు ఎమ్మెల్యే హరీశ్‌రావు ప్రయత్నిస్తున్నారని ఆరోపించారు. దేశంలో ఎక్కడా లేని విధంగా తెలంగాణలోని రైతులకు ఒకేసారి రెండు లక్షల రుణమాఫీ చేశామని తెలిపారు. రుణమాఫీ చేస్తే రాజీనామా చేస్తానన్న మాటకు కట్టుబడి ఉండాలని సిద్దిపేట కాంగ్రెస్‌ పక్షాన డిమాండ్‌ చేయడం తప్పు ఎలా అవుతుందని ప్రశ్నించారు. కాంగ్రెస్‌ నాయకులను పోలీసులు అరెస్టు చేసి స్టేషనులకు తరలిస్తే, బీఆర్‌ఎస్‌ నాయకులు మాత్రం బయట ఉండి చట్టాన్ని చేతిలోకి తీసుకున్నారని చెప్పారు. ఈనెల 20న సిద్దిపేట పట్టణంలో కాంగ్రెస్‌ కార్యకర్తల సభ నిర్వహిస్తామన్నారు. కార్యక్రమంలో పట్టణ అధ్యక్షుడు అత్తు ఇమామ్‌, కౌన్సిలర్‌ రియాజుద్దీన్‌, నాయకులు బుచ్చిరెడ్డి, మిద్దె రవి, గాయాజుద్దీన్‌, వహాబ్‌, గోపికృష్ణ, అజ్మత్‌, రాశాద్‌ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.

Updated Date - Aug 19 , 2024 | 12:04 AM

Advertising
Advertising
<