కడవేరుగు శివారులో బ్రిడ్జి నిర్మాణం చేపట్టాలి
ABN, Publish Date - Sep 22 , 2024 | 10:43 PM
సీపీఎం నాయకులు
చేర్యాల, సెప్టెంబరు 22: చేర్యాల మండలం కడవేరుగు శివారులో వరదనీటి ప్రవాహ ముంపు బెడద నివారణకు వంతెన నిర్మాణం చేపట్టాలని కోరుతూ సీపీఎం నాయకులు ఆదివారం వరదనీటిలో నిలబడి నిరసన చేపట్టారు. ఈ సందర్భంగా పార్టీ మండల కార్యదర్శి కొంగరి వెంకట్‌మావో మాట్లాడుతూ.. ప్రతీ ఏటా వర్షాకాలంలో కడవేరుగు శివారులోని చెరువు మత్తడి నీటితో పాటు వరదనీరు రోడ్డుపై నుంచి ప్రవహిస్తుండడంతో రాకపోకలు నిలిచి ప్రజలు, ప్రయాణికులు ఇబ్బందులు పడుతున్నారన్నారు. గత ప్రభుత్వం వంతెన నిర్మాణానికి నిధులు మంజూరుచేసినా పనులు త్వరితగతిన ప్రారంభించకపోవడంతో నిర్మాణానికి నోచుకోలేదన్నారు. ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్‌రెడ్డితో పాటు జనగామ డీసీసీ అధ్యక్షుడు కొమ్మూరి ప్రతా్‌పరెడ్డి ఎన్నికల సమయంలో బ్రిడ్జి నిర్మాణంపై హామీఇచ్చినా పట్టించుకోకపోవడం తగదన్నారు. వెంటనే స్పందించి పనులు త్వరితగతిన ప్రారంభించి ఇబ్బందులు తీర్చాలని కోరారు. కార్యక్రమంలో నాయకులు పొనుగోటి శ్రీనివా్‌సరెడ్డి, గొర్రె శ్రీనివాస్, కనకయ్య, రమేశ్, సత్తయ్య, చంద్రం, బాలు, ప్రకాశ్, రాజు, మహేశ్, పోచయ్య, చంద్రయ్య పాల్గొన్నారు.
Updated Date - Sep 22 , 2024 | 10:43 PM