అలంకారప్రాయంగా బస్టాప్!
ABN, Publish Date - Aug 27 , 2024 | 11:10 PM
సంగారెడ్డి అర్బన్, ఆగస్టు 27: సంగారెడ్డిలోని ప్రభుత్వ జనరల్ ఆస్పత్రి వద్ద ఉన్న బస్టాప్ ప్రైవేటు అంబులెన్సులకు అడ్డాగా మారింది. ప్రయాణికులు నిల్చోవాల్సిన బస్టాప్ అంబులెన్సుల పార్కింగ్‌కు నిలయంగా తయారైంది.
అంబులెన్సుల పార్కింగ్‌కు అడ్డాగా బస్‌షెల్టర్
బస్టాప్ ఓ చోట.. ప్రయాణికులు నిల్చునేది మరోచోట
పట్టించుకోని సంబంధిత అధికారులు
సంగారెడ్డి అర్బన్, ఆగస్టు 27: సంగారెడ్డిలోని ప్రభుత్వ జనరల్ ఆస్పత్రి వద్ద ఉన్న బస్టాప్ ప్రైవేటు అంబులెన్సులకు అడ్డాగా మారింది. ప్రయాణికులు నిల్చోవాల్సిన బస్టాప్ అంబులెన్సుల పార్కింగ్‌కు నిలయంగా తయారైంది. బస్టాప్ మూడువైపుల అంబులెన్సులు పార్కింగ్ చేయడంతో ప్రయాణికులు అటుగా వెళ్లేందుకు ఆస్కారం లేకుండా పోయింది. తద్వారా ప్రయాణికులు బస్టాప్ కొద్ది ముందుగా నడిరోడ్డుపై నిల్చోని ఎండకు ఎండుతూ, వానకు తడుస్తూ ఇబ్బందిపడుతూ బస్సుల కోసం వేచిచూస్తున్నారు. నాలుగేళ్ల ఇదే బస్టాప్ సమీపంలో రోడ్డుపై నిల్చున్న ఓ హెడ్‌నర్సును ఆర్టీసీ బస్సు ఢీకొనడంతో తీవ్ర గాయాలయ్యాయి. ఇదిలా ఉండగా ఈ బస్టా్‌పను ఆనుకునే పట్టణ, ట్రాఫిక్ పోలీ్‌సస్టేషన్లు ఉన్నాయి. పోలీసులు తొంగి చూస్తే ఈ బస్టాప్ వద్ద అడ్డంగా నిలిపిన అంబులెన్స్‌లు స్పష్టంగా కనిపిస్తాయి. కానీ ప్రయాణికులు బస్టాప్ వద్దనే నిల్చోవాలని సూచించడం కానీ, బస్టాప్ వద్ద నిలిపిన వాహనాలను తొలగించే చర్యలు కానీ ఇటు పోలీసులు, అటు ఆర్టీసీ అధికారులు తీసుకోకపోవడం పలు విమర్శలకు తావిస్తున్నది.
Updated Date - Aug 27 , 2024 | 11:10 PM