ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

తీరని మల్లన్న వెతలు

ABN, Publish Date - Aug 10 , 2024 | 11:19 PM

మల్లన్నసాగర్‌ భూనిర్వాసితులతో పాటుగా వారికి సేవలందించే అధికారులకూ ఇబ్బందులు తప్పడం లేదు. మూడేళ్లుగా అటు ప్రజలు.. ఇటు అధికారులు ఇబ్బందు లు పడుతున్నా.. ప్రభుత్వాలు మారినా వారి సమస్యలు మాత్రం తీరడం లేదు.

మల్లన్నసాగర్‌ భూనిర్వాసిత కాలనీ

మండలం ఓ చోట... విధులు మరోచోట

ఇబ్బందులకు గురవుతున్న ఆయా శాఖల అధికారులు

పట్టించుకోని ప్రభుత్వం.. ప్రజాప్రతినిధులు

ప్రజలకు తప్పని ఇబ్బందులు

గజ్వేల్‌,ఆగస్టు10: మల్లన్నసాగర్‌ భూనిర్వాసితులతో పాటుగా వారికి సేవలందించే అధికారులకూ ఇబ్బందులు తప్పడం లేదు. మూడేళ్లుగా అటు ప్రజలు.. ఇటు అధికారులు ఇబ్బందు లు పడుతున్నా.. ప్రభుత్వాలు మారినా వారి సమస్యలు మాత్రం తీరడం లేదు. నిర్వాసితులు సైతం ధర్నాలు, నిరసనలు చేపట్టినా కూడా వారి సమస్యలను పట్టించుకునే వారే లేరు.

గజ్వేల్‌-ప్రజ్ఞాపూర్‌ మునిసిపల్‌ రెవెన్యూ పరిధిలోని సంగాపూర్‌, ముట్రాజ్‌పల్లి, గజ్వేల్‌లో భూనిర్వాసిత కాలనీని ఏర్పా టు చేశారు. దాదాపుగా 3వేల ఇళ్లను నిర్మించారు. గ్రామాలను గజ్వేల్‌కు తరలిస్తున్న క్రమంలో తమ గ్రామాలను గ్రామపంచాయతీలుగానే కొనసాగించాలని, గతంలో మాదిరిగానే పాలన కొనసాగించాలని అప్పటికే సర్పంచ్‌లుగా, ఎంపీటీసీలుగా ప్రజాప్రతినిఽధులుగా ఉన్న నాయకులు కోరడంతో గత ప్రభుత్వం కొనసాగిస్తూ ఉత్తర్వులను ఇచ్చింది. ఈ క్రమంలో ప్రారంభమైన పాలన ఇంకా కొనసాగుతుండడంతో అధికారులు సరైన సేవలు అందించడంలో ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.

సమయానుగుణంగా అందని సేవలు

గజ్వేల్‌-ప్రజ్ఞాపూర్‌ మున్సిపాలిటీ పరిధిలో ఏర్పాటు చేసిన మల్లన్నసాగర్‌ భూనిర్వాసిత కాలనీ ప్రజలకు విద్య, వైద్య, పంచాయతీతో పాటు ఆయా రకాల సేవలను అధికారులు ఇతర మండలాల నుంచి నిర్వహించడం ఇబ్బందిగా మారుతుంది. ప్రజలకు సరైన సమయంలో పౌర సేవలను అందించడంలో అధికారులు విఫలమవుతున్నారు. నిర్వాసితుల కాలనీలో తొగుట, కొండపాక మండలాలకు సంబంధించిన అధికారులు సేవలను అందిస్తున్నారు. నిర్వాసిత కాలనీలో ప్రస్తుతం అంతర్భాగంగా మారిన సంగాపూర్‌, లింగరాజ్‌పేటకు గజ్వేల్‌-ప్రజ్ఞాపూర్‌ మున్సిపాలిటీతో పాటు గజ్వేల్‌ మండల అధికారులు సేవలను అందిస్తున్నారు. ఇక మండల స్థాయి అధికారులు అటు తొగుట, కొండపాక మండలాలతో పాటు ఇటు ఆర్‌అండ్‌ఆర్‌ కాలనీలో సేవలను అందించడం కష్టతరంగా మారుతుందని వాపోతున్నారు. పంచాయతీ కార్యదర్శులు గజ్వేల్‌లో విధులు నిర్వహించి ఏమైనా పనులు, సమావేశాలు ఉంటే మండల కేంద్రమైన తొగుట, కొండపాకకు వెళ్లాల్సి వస్తుంది. ఆశావర్కర్లు, ఏఎన్‌ఎంలు టీకాలు, ఇతరత్రా మందులు, సమావేశాలుంటే మండలాలకు వెళ్లాల్సి రావడం.. విద్యాశాఖ అధికారులు సైతం తమ మండలానికి వెళ్లాల్సి వస్తుండడం, ఇతర శాఖల అధికారులు సైతం రెండు చోట్ల విధులు నిర్వహించడం తలకు మించి భారంగా మారుతుంది. ఇక సమయానికి అనుగుణంగా సేవలు అందకపోవడంతో ప్రజలు ఇబ్బందులకు గురవుతున్నారు.

వైద్య సేవలకు తప్పని ఇబ్బందులు

రెండు రోజుల క్రితం విషజ్వరం (డెంగీ అని అనుమానిస్తున్న) తో బాలుడు మృతిచెందడంతో మల్లన్నసాగర్‌ భూనిర్వాసితులకు అందుతున్న పౌర సేవలపై అనుమానాలు తలెత్తుతున్నాయి. మండల కేంద్రం తొగుటలో ఉండడం, సేవలు గజ్వేల్‌-ప్రజ్ఞాపూర్‌ మునిసిపాలిటీలో అందించాల్సి రావడంతో అటు వైద్యాధికారులు, ఇటు వైద్య సిబ్బంది ఇబ్బందులకు గురవుతున్నారు. ప్రస్తుతం సీజనల్‌ వ్యాధుల కాలం కావడంతో ప్రజలకు అవగాహన కల్పించడంలో ఇబ్బందులు తలెత్తుతున్నాయి. వైద్య సిబ్బందిని సమన్వయం చేయడంలో అటు అధికారులు, సమన్వయం చేసుకోవడంలో ఇటు సిబ్బందికి ఇబ్బందులు త ప్పడం లేదు.

ప్యాకేజీ, పరిహారాలకు తప్పని దూరాభారం

గజ్వేల్‌-ప్రజ్ఞాపూర్‌ మునిసిపాలిటీ పరిధిలోని భూనిర్వాసిత కాలనీ ప్రజలు తమకు రావాల్సిన నష్టపరిహారం, ప్యాకేజీ, ఫ్లాట్లు, ఇతరత్రా సదుపాయాల గూర్చి అటు మండల కేంద్రాలైన తొగుట, కొండపాకకు, డివిజన్‌ కేంద్రమైన సిద్దిపేటకు వెళ్లాల్సి వస్తుంది. రాకపోకలకు సమయం, డబ్బు వృథా అవుతున్నాయని వారు వాపోతున్నారు. తమకు అందాల్సిన సేవలను చేరువ చేయాలని, సమీపంలోని మండలంలో విలీనం చేయాలని ఆయా శాఖల అధికారులు, సిబ్బంది కోరుతున్నారు.

రెండు చోట్లా విధులు భారంగా ఉంది

రెండు చోట్ల విధులు నిర్వహించడం భారంగా ఉంది. తొగుట మండలంలోని సగం గ్రామాలు గజ్వేల్‌లో ఉండడంతో ఇటు మండలాన్ని చూడడం అటు భూనిర్వాసిత కాలనీని చూడడం ఇబ్బందిగా ఉంది. అంతేకాకుండా తమ సిబ్బందితో సమన్వయం చేసుకోవడం లేదా వారు చేస్తున్న పనులను పర్యవేక్షించడం ఇబ్బందిగా మారుతుంది. ఈ క్రమంలో మండలంలో ఉంటే కాలనీలో సిబ్బంది పనులు చేయడం లేదు. కాలనీలో ఉంటే మండలంలో సిబ్బంది పనులు చేయడం లేదు. రెండు చోట్ల విధులు నిర్వహించడం ఇబ్బందిగా ఉంది.

- ఓ అధికారి

Updated Date - Aug 10 , 2024 | 11:19 PM

Advertising
Advertising
<