ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

మీ వివాహ కలను నెరవేర్చుకోడానికి 40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్ లో ఇప్పుడు ప్రీమియం మెంబర్షిప్ ఉచితం. ఫోన్|| 9390 999 999, 8008 56 7898

దేశంలో బీజేపీ గెలిస్తేనే తెలంగాణ అభివృద్ధి

ABN, Publish Date - Mar 24 , 2024 | 11:50 PM

నిజాంపేట, మార్చి 24: దేశంలో బీజేపీ అధికారంలోకి వస్తేనే తెలంగాణ అభివృద్ధి చెందుతుందని, 500 ఏళ్లుగా ఎదురుచూస్తున్న రామమందిర నిర్మాణం, 375 ఆర్టికల్‌ రద్దు చేసి కాశ్మీర్‌ భారతదేశంలో కలిపిన ఘనత ప్రధానమంత్రి నరేంద్రమోదీకే దక్కుతుందని బీజేపీ మెదక్‌ పార్లమెంట్‌ అభ్యర్థి రఘునందన్‌రావు అన్నారు.

సమావేశంలో మాట్లాడుతున్న రఘునందన్‌రావు

రామమందిర నిర్మాణం, ఆర్టికల్‌ 375 రద్దు ఘనత మోదీకే దక్కింది

బీజేపీ మెదక్‌ పార్లమెంట్‌ అభ్యర్థి రఘునందన్‌రావు

నిజాంపేట, మార్చి 24: దేశంలో బీజేపీ అధికారంలోకి వస్తేనే తెలంగాణ అభివృద్ధి చెందుతుందని, 500 ఏళ్లుగా ఎదురుచూస్తున్న రామమందిర నిర్మాణం, 375 ఆర్టికల్‌ రద్దు చేసి కాశ్మీర్‌ భారతదేశంలో కలిపిన ఘనత ప్రధానమంత్రి నరేంద్రమోదీకే దక్కుతుందని బీజేపీ మెదక్‌ పార్లమెంట్‌ అభ్యర్థి రఘునందన్‌రావు అన్నారు. ఆదివారం మండల కేంద్రంలో బీజేపీ బూత్‌ అధ్యక్షులు, శక్తి కేంద్రాల ఇన్‌చార్జిలు, పార్టీ ముఖ్య కార్యకర్తల సమావేశం నిర్వహించారు. ముందుగా మండల పరిధిలోని చల్మెడ శివారులో గల తిరుమలస్వామి, పెద్దమ్మతల్లి ఆలయాలను దర్శించి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం నందిగామ గ్రామ తాజా మాజీ సర్పంచ్‌ లద్ధ ప్రీతిరాజగోపాల్‌ను కలిసి బీజేపీకి మద్దతు ఇవ్వాలని కోరారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పదేళ్ల కేసీఆర్‌ పాలనలో పేదవారి కష్టాలు ఎలా ఉన్నాయో.. వందరోజుల రేవంత్‌రెడ్డి పాలనలో కూడా అదేవిధంగా కనిపిస్తున్నాయన్నారు. ముఖ్యంగా ప్రతీ కార్యకర్త బాధ్యతగా తీసుకుని మూడోసారి మోదీకి ప్రధానమంత్రిగా అవకాశం ఇస్తే.. రూ.750 కోట్లతో అబుదాబిలో రామమందిర నిర్మాణాన్ని చేసుకుందామన్నారు. 100 రోజుల్లో రూ.2 లక్షల రుణమాఫీ చేస్తామని గద్దెనెక్కిన కాంగ్రెస్‌, బీఆర్‌ఎస్‌ మాటలను ప్రజలు నమ్మేస్థితిలో లేరని చెప్పారు. అనంతరం మండలంలో ఎన్నికల ప్రచారాన్ని నిర్వహించారు. కార్యక్రమంలో జడ్పీటీసీ పంజా విజయ్‌కుమార్‌, పార్టీ మండలాధ్యక్షుడు చంద్రశేఖర్‌, బీజేపీ సీనియర్‌ నాయకులు తీగల శ్రీనివా్‌సగౌడ్‌, ఆకుల రమేష్‌ పాల్గొన్నారు.

Updated Date - Mar 24 , 2024 | 11:50 PM

Advertising
Advertising