ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

అక్రమ ఇంటి నిర్మాణంపై డీఎల్పీవో విచారణ

ABN, Publish Date - Sep 26 , 2024 | 11:17 PM

కార్యదర్శిపై చర్యలకు డీపీవోకు సిఫార్సు

పంచాయతీ కార్యదర్శిని విచారిస్తున్న డీఎల్పీవో

చేర్యాల, సెప్టెంబరు 26: అక్రమ ఇంటి నిర్మాణాలకు అనుమతులు ఇవ్వడంతో పాటు గ్రామంలో పారిశుధ్య పనులు సక్రమంగా నిర్వహించడంలేదని, జవాబుదారీతనంతో పని చేయడంలేదంటూ చేర్యాల మండలం ఆకునూరు మేజర్‌ గ్రామపంచాయతీ కార్యదర్శి పులి బాలయ్యపై వచ్చిన ఫిర్యాదులపై డీఎల్‌పీవో మల్లికార్జున్‌రెడ్డి గురువారం విచారణ చేపట్టారు. గ్రామానికి చెందిన స్వర్గం యాదగిరి అనుమతులు లేకుండా చేపట్టిన అక్రమ ఇంటి నిర్మాణంతో తన ఇల్లు దెబ్బతిన్నదని, పంచాయతీ కార్యదర్శికి తెలిపినా పట్టించుకోలేదని కొద్దిరోజులక్రితం శ్రీహరి అనే వ్యక్తి జిల్లా కలెక్టర్‌తో పాటు ఎంపీడీవోకు ఫిర్యాదు చేశారు. ఈ విషయమై విచారణ చేపట్టిన ఇన్‌చార్జి ఎంపీడీవో మహబూబ్‌ అలీ అక్రమ నిర్మాణంగా నిర్ధారించి మెమో జారీ చేయడంతో పాటు ఉన్నతాధికారులకు నివేదిక సమర్పించారు. అనంతరం డీఎల్పీవో ఇటీవల పంచాయతీ కార్యదర్శి బాలయ్యను సంజాయిషీ కోరుతూ మెమో జారీ చేశారు. డీఎల్‌పీవో మల్లికార్జున్‌రెడ్డి గ్రామానికి చేరుకుని విచారణ చేపట్టారు. స్వర్గం యాదగిరి ఇంటినిర్మాణంతో పాటు భైరు శ్రీహరి ఇంటిని పరిశీలించారు. అలాగే గ్రామంలో పారిశుధ్య పనులు సరిగా లేవన్న విషయం మేరకు పలు వీధులను పరిశీలించారు. ఆయా అంశాల పరిశీలనతో పంచాయతీ కార్యదర్శి పులి బాలయ్య పనితీరుపై అసహనం వ్యక్తం చే శారు. విచారణలో గుర్తించిన అంశాలను నివేదిక తయారుచేసి కార్యదర్శి బాలయ్యపై చర్యల నిమిత్తం డీపీవోకు సిఫారసు చేయ నున్నట్లు డీఎల్‌పీవో మల్లికార్జున్‌రెడ్డి స్థానికులకు తెలిపారు. ఆయనవెంట ఇన్‌చార్జి ఎంపీడీవో మహబూబ్‌ అలీ ఉన్నారు.

Updated Date - Sep 26 , 2024 | 11:17 PM