ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

మత్తు వదలరా!

ABN, Publish Date - Jul 19 , 2024 | 12:02 AM

జిల్లాలో గంజాయి మత్తు చాపకింద నీరులా వ్యాపిస్తుంది. విద్యార్థులు, యువకులు, ఆకతాయిలు గంజాయి తీసుకుంటూ మత్తులో మునిగి తేలుతున్నారు. కొన్ని రోజుల క్రితం పట్టణంలో కొంతమంది యువకులు గంజాయి మత్తులో ఓ వ్యక్తితో సిగరెట్‌ విషయంలో గొడవపడ్డారు. ఆ తర్వాత అర్ధరాత్రి అతని ఇంటికి వెళ్లి గంజాయి మత్తులో విచక్షణ కోల్పోయి దాదాపు 15 మంది యువకులు అతనిపై దాడి చేశారు.

సిద్దిపేటలో గంజాయికి బానిసవుతున్న యువత

మత్తులో విచక్షణ కోల్పోయి దాడులకు పాల్పడుతున్న వైనం

పోలీసులు చర్యలు తీసుకుంటున్నప్పటికీ ఫలితం శూన్యం

గంజాయి బాధితుల్లో విద్యార్థులే ఎక్కువ

సిద్దిపేట టౌన్‌, జూలై 18: జిల్లాలో గంజాయి మత్తు చాపకింద నీరులా వ్యాపిస్తుంది. విద్యార్థులు, యువకులు, ఆకతాయిలు గంజాయి తీసుకుంటూ మత్తులో మునిగి తేలుతున్నారు. కొన్ని రోజుల క్రితం పట్టణంలో కొంతమంది యువకులు గంజాయి మత్తులో ఓ వ్యక్తితో సిగరెట్‌ విషయంలో గొడవపడ్డారు. ఆ తర్వాత అర్ధరాత్రి అతని ఇంటికి వెళ్లి గంజాయి మత్తులో విచక్షణ కోల్పోయి దాదాపు 15 మంది యువకులు అతనిపై దాడి చేశారు. భయభ్రాంతులకు గురైన బాధితుడు వెంటనే 100కు సమాచారం ఇవ్వడంతో పోలీసులు అక్కడికి చేరుకునేలోపే వారు పారిపోయారు. పట్టణంలోని నాసర్‌పురా, ధోబిగల్లి, నర్సాపూర్‌ చౌరస్తా, భారత్‌నగర్‌, అంబేద్కర్‌ నగర్‌, శ్రీనగర్‌ కాలనీ, డబుల్‌ బెడ్‌రూంలతో పాటు మరికొన్ని కాలనీలలో స్థావరాలు ఏర్పాటు చేసుకొని, యువకులు గంజాయి మత్తులో రాత్రిపూట గొడవలకు పాల్పడుతున్నట్లు తెలుస్తున్నది.

24 గంటల పాటు మత్తులో..

యువకులు మత్తులో గొడవ ఎందుకు పెట్టుకున్నారో కూడా అర్థం కాని పరిస్థితిలో ఉన్నారంటే ఏ మోతాదులో వారు మత్తుపదార్థాలను తీసుకుంటున్నారో అర్థం చేసుకోవచ్చు. గంజాయి సేవించిన యువకులు దాదాపు 24 గంటల పాటు మత్తులోనే ఉంటున్నారు. ఎక్కువగా ఇంటర్‌, డిగ్రీ, బీటెక్‌ చదువుతున్న, మధ్యలో ఆపేసిన యువకులే ఉన్నారు. ఉద్యోగాలు చేయకుండా మద్యానికి అలవాటు పడి, ఆ మత్తు చాలక గంజాయికి బానిసవుతున్నారు. సిద్దిపేటలో ఉన్న కొంతమంది ధనికుల పిల్లలు గంజాయితో పాటు, డ్రగ్స్‌ కూడా అలవాటు చేసుకున్నట్లు విశ్వసనీయ సమాచారం. గంజాయి తీసుకున్న తర్వాత రాత్రిపూట కొంత మంది యువకులు విపరీతమైన స్పీడుతో బైక్‌రైడ్‌లో పాల్గొంటున్నారు. వీరిలో కొంతమంది రోడ్డు ప్రమాదాలకు గురై గాయపడ్డ వారు కూడా ఉన్నారు.

దళారులతో కొనుగోలు

సిద్దిపేటలో కొంతమంది దళారుల చేత హైదరాబాద్‌ నుంచి గంజాయి ప్యాకెట్లను సరఫరా చేసుకుంటున్నారు. రూ. 500 ప్యాకెట్టు రెడీ చేసి సరఫరా చేస్తున్నారు. కొందరు కొనుగోలు చేసేంత స్థోమత లేక వాటిని సరఫరా చేస్తూ వచ్చిన డబ్బుతో గంజాయి తీసుకుంటున్నారు. ఈ సంవత్సరంలో పోలీసులు ప్రత్యేక నిఘా ఏర్పాటు చేసి సుమారు 7 కేసులు నమోదు చేసి, దాదాపు 20 మంది వరకు అరెస్టు చేశారు.

రిహబిలేషన్‌ సెంటర్లో చికిత్సలు

సిద్దిపేటలో కొంతమంది ధనికుల పిల్లలు గంజాయికి అలవాటు పడి జీవితాన్ని చిన్నాభిన్నం చేసుకుంటున్నారు. విషయం తెలుసుకున్న తల్లిదండ్రులు వారికి అవగాహన కల్పిస్తున్నా ఫలితం దక్కడం లేదు. వారిని హైదరాబాద్‌లోని రిహబిలేషన్‌ సెంటర్‌లో చేర్పించి చికిత్స అందిస్తున్నారు. ఇక మధ్యతరగతి కుటుంబాల పిల్లలు గంజాయికి బానిసలవుతూ చదువును మధ్యలోనే ఆపేసి జీవితాలను నాశనం చేసుకుంటున్నారు.

రౌడీషీటర్లపై నిఘా..

సిద్దిపేటలోని పలు పోలీస్‌స్టేషన్లలో రౌడీ షీటర్లుగా కేసులు నమోదైన వారిపై పోలీసులు నిఘా వ్యవస్థను పటిష్టం చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది. పట్టణంలో పేరుమోసిన రౌడీలు గంజాయి మత్తుకు బానిసగా మారి ఇళ్లలోకి వెళ్లి దాడులు చేసేలా వ్యవహరిస్తున్న వారి భరతం పట్టాలని పలు కాలనీవాసులు కోరుతున్నారు. రౌడీషీటర్లుగా కేసులున్న వారు యువకులకు మద్యం గంజాయి మత్తును అలవాటు చేసి అనుచరులుగా మార్చుకొని పట్టణంలో లా అండ్‌ ఆర్డర్‌ సమస్యలు సృష్టిస్తున్న వారిపై ఇకనుంచి పోలీసులు కన్నేసి ఉంచాల్సిన అవసరం ఎంతైనా ఉంది.

4 కిలోల గంజాయి పట్టివేత..

సిద్దిపేట పట్టణ శివారులోని పలు ప్రాంతాలను ఎంపిక చేసుకుంటున్న గంజాయి స్మగ్లర్లు విచ్చలవిడిగా గంజాయిని విక్రయిస్తున్నారు. ఇటీవల సిద్దిపేటలోని డబుల్‌ బెడ్‌రూంల వద్ద గంజాయిని సేవిస్తూ, విచ్చలవిడిగా బహిరంగంగా విక్రయిస్తున్నరన్న సమాచారం మేరకు టాస్క్‌ఫోర్స్‌ పోలీసులు దాడులు చేసి తొమ్మిది మందిని అరెస్ట్‌ చేశారు. విక్రయించేందుకు సిద్ధంగా ఉన్న 4 కిలోల గంజాయితో పాటు కారు, రూ. 23వేల నగదును స్వాధీనం చేసుకున్నారు. నిందితులు పెద్దపల్లి జిల్లా నుంచి తక్కువ ధరకు గంజాయిని కొనుగోలు చేసి సిద్దిపేటలో అధిక ధరకు అమ్ముతున్నట్లు తేలడంతో సిద్దిపేట పోలీసులు నిఘాను మరింత పటిష్ఠం చేశారు.

Updated Date - Jul 19 , 2024 | 12:02 AM

Advertising
Advertising
<