ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

మీ వివాహ కలను నెరవేర్చుకోడానికి 40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్ లో ఇప్పుడు ప్రీమియం మెంబర్షిప్ ఉచితం. ఫోన్|| 9390 999 999, 8008 56 7898

నెలన్నరైనా తెరుచుకోని ఈఎ్‌సఐ డిస్పెన్సరీ!

ABN, Publish Date - May 15 , 2024 | 11:22 PM

తూప్రాన్‌, మే 15: కార్మికులకు వైద్య సేవలు అందజేసేందుకు ఏర్పాటుచేసిన ఈఎ్‌సఐ డిస్పెన్సరీ నెలన్నర రోజులుగా మూతపడింది.

మూతపడిన ఈఎ్‌సఐ డిస్పెన్సరీ ఆస్పత్రి ఎదుట సిబ్బంది(ఫైల్‌)

అద్దె చెల్లించకపోవడంతో తాళం వేసిన యజమాని

తీవ్ర అవస్థలు పడుతున్న రోగులు

తూప్రాన్‌, మే 15: కార్మికులకు వైద్య సేవలు అందజేసేందుకు ఏర్పాటుచేసిన ఈఎ్‌సఐ డిస్పెన్సరీ నెలన్నర రోజులుగా మూతపడింది. అద్దె చెల్లించకపోవడంతో యజమానికి తాళం వేయగా, వైద్యసేవలు అందక రోగులు అవస్థలు పడుతున్నారు. మెదక్‌ జిల్లాలో కార్మికులకు వైద్యసేవలు అందజేసేందుకు ఈఎ్‌సఐ డిస్పెన్సరీని శివ్వంపేట మండలం శభా్‌షపల్లికి మంజూరుచేశారు. కొద్దిరోజులపాటు సమీపంలోని దొంతిలో నిర్వహించారు. భవనం, కార్మికుల ఇబ్బందులను దృష్టిలో పెట్టుకుని మూడు దశాబ్దాల క్రితం తూప్రాన్‌ మండల కేంద్రానికి మార్చారు. కొన్నేళ్లు తూప్రాన్‌ పట్టణంలో నిర్వహించగా, రావెల్లి పంచాయతీ పరిధి పోతరాజుపల్లి (ప్రస్తుతం తూప్రాన్‌ పట్టణ పరిధి)కి మార్చారు. దశాబ్దకాలంగా పోతరాజుపల్లిలోని గజ్వేల్‌ రోడ్డులో నిర్వహిస్తున్నారు. అద్దె భవనంలో కొనసాగుతున్న ఈఎ్‌సఐ డిస్పెన్సరీకి ఏడాదికాలంగా అద్దె చెల్లించకపోవడంతో ఏప్రిల్‌ 1న యజమాని ప్రతా్‌పరెడ్డి తాళం వేశారు. ఈఎ్‌సఐ డిస్పెన్సరీ తాళం వేసి నెలన్నర గడిచినా ఇప్పటికీ అద్దె చెల్లించలేదు. సిబ్బంది రోజు డిస్పెన్సరీ వద్దకు విచ్చేసి బయటే కూర్చొని సమయం కాగానే వెళ్లిపోతున్నారు. డిస్పెన్సరీ వద్దకు వస్తున్న రోగులు వైద్యం లేక.. మందుల్లేక తీవ్ర అవస్థలు పడుతున్నారు. అధికారులు ఇప్పటికైనా చర్యలు తీసుకొని డిస్పెన్సరీ తెరిపించాలని డిమాండ్‌ చేస్తున్నారు.

ఇబ్బందులు పడుతున్నాం

తూప్రాన్‌ ఈఎ్‌సఐ డిస్పెన్సరీకి తాళం వేయడంతో తీవ్ర ఇబ్బందులు పడుతున్నాం. డిస్పెన్సరీ తెరుచుకోకపోవడంతో రోగులు వచ్చి వెళ్తున్నారు. ప్రభుత్వం అద్దె చెల్లించి ఈఎ్‌సఐ డిస్పెన్సరీని తెరిపించాలి. హైదరాబాద్‌కు వెళ్లలేక ప్రైవేటులోనే చికిత్సలు చేయించుకుంటున్నారు. అధికారులు స్పందించి వెంటనే అద్దె చెల్లించి, డిస్పెన్సరీని తెరిపించాలి.

- శ్రీనివా్‌సగౌడ్‌, టోల్‌గేట్‌ ఉద్యోగి, తూప్రాన్‌

Updated Date - May 15 , 2024 | 11:22 PM

Advertising
Advertising