ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

పర్యావరణ వ్యవస్థలో ప్రతీ జీవి ముఖ్యమే

ABN, Publish Date - Oct 04 , 2024 | 12:03 AM

జిల్లా అటవీశాఖ అధికారి కొత్తపల్లి శ్రీనివాస్‌, ఇంటర్‌ విద్యాధికారి రవీందర్‌రెడ్డి

మెడల్స్‌ చూపుతున్న విద్యార్థులు

సిద్దిపేట కల్చరల్‌, అక్టోబరు 3: పర్యావరణ వ్యవస్థలో ప్రతీ జీవి ముఖ్యమైనదేనని జిల్లా అటవీశాఖ అధికారి కొత్తపల్లి శ్రీనివాస్‌, ఇంటర్‌ విద్యాధికారి రవీందర్‌రెడ్డి పేర్కొన్నారు. 70వ వన్యప్రాణి పరిరక్షణ వారోత్సవాలను సిద్దిపేట ప్రభుత్వ జూనియర్‌ కళాశాల (కో ఎడ్యుకేషన్‌)లో అటవీశాఖ అధ్వర్యంలో గురువారం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా వ్యాసరచన, ఉపన్యాస, చిత్రలేఖనం పోటీలను నిర్వహించారు. ఈ పోటీల్లో విజేతలుగా నిలిచినవారికి మెడల్స్‌ అందించారు. అంతకుముందు విద్యార్థిని, విద్యార్థులతో ర్యాలీ నిర్వహించారు. అనంతరం ఏర్పాటు చేసిన సమావేశంలో వారు మాట్లాడారు. ప్రతి ఒక్కరూ బాధ్యతగా ప్రకృతి సమతుల్యతను కాపాడలని, మొక్కలు, వన్యప్రాణులు ప్రాధాన్యతను విద్యార్థులు తెలుసుకోవాలని సూచించారు. కార్యక్రమంలో కళాశాల ప్రిన్సిపాల్‌ సత్యనారయణరెడ్డి, అటవీశాఖ అధికారులు, అధ్యాపకులు, విద్యార్థులు పాల్గొన్నారు.

Updated Date - Oct 04 , 2024 | 12:03 AM