విద్యుత్ అమరుల స్ఫూర్తితో పోరాటాలు
ABN, Publish Date - Aug 28 , 2024 | 11:11 PM
సంగారెడ్డి రూరల్, ఆగస్టు 28: బషీర్‌బాగ్ విద్యుత్ పోరాటంలో అసువులు బాసిన విద్యుత్ అమరుల స్ఫూర్తితో పోరాటాలు సాగిస్తామని సీపీఎం రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యుడు ఎస్.వీరయ్య అన్నారు.
సీపీఎం రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యుడు ఎస్.వీరయ్య
సంగారెడ్డి రూరల్, ఆగస్టు 28: బషీర్‌బాగ్ విద్యుత్ పోరాటంలో అసువులు బాసిన విద్యుత్ అమరుల స్ఫూర్తితో పోరాటాలు సాగిస్తామని సీపీఎం రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యుడు ఎస్.వీరయ్య అన్నారు. సంగారెడ్డిలోని కేవల్ కిషన్ భవన్‌లో బుధవారం విద్యుత్ అమరువీరుల చిత్రపటాలకు పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ 2000 సంవత్సరంలో విద్యుత్‌చార్జీల వ్యతిరేక ప్రదర్శన సందర్భంగా బషీర్‌బాగ్ వద్ద పోలీసులు జరిపిన కాలుపుల్లో రామకృష్ణ, బాలస్వామి, విష్ణువర్దన్‌రెడ్డిలు అమరులయ్యారని అన్నారు. చంద్రబాబునాయుడు విద్యుత్ రంగంలో సంస్కరణలు తీసుకురావడానికి ప్రయత్నిస్తే విద్యుత్ రంగం ప్రభుత్వ రంగంలోనే ఉండాలని, ప్రైవేటుపరం చేయవద్దని డిమాండ్ చేస్తూ వామపక్ష పార్టీల ఆధ్వర్యంలో విద్యుత్ పోరాటం చేశామని గుర్తుచేశారు. రాష్ట్రంలో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వ ప్రతినిధి బృందం ఇటీవల సీఎం రేవంత్‌రెడ్డి ఆధ్వర్యంలో అమెరికా, దక్షిణ కొరియా దేశాల్లో పర్యటన చేసిందని, ఈ పర్యటనలో ప్రపంచ బ్యాంకుతో ఏం చర్చలు జరిపారు. ప్రపంచ బ్యాంకు ఎలాంటి సలహాలు ఇచ్చిందో తెలంగాణ ప్రజలకు బహిర్గతం చేయాలని చుక్క రాములు డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో సీపీఎం రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యుడు చుక్క రాములు, సీపీఎం నాయకులు పాల్గొన్నారు.
Updated Date - Aug 28 , 2024 | 11:11 PM