ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

కుండపోత..

ABN, Publish Date - Sep 02 , 2024 | 12:14 AM

ఏకధాటి వర్షానికి వణికిన మెదక్‌ జిల్లా అత్యధికంగా పాతూర్‌లో 21 సెంటీమీటర్ల్లు ఉధృతంగా పారుతున్న వాగులు, వంకలు కొట్టుకుపోయిన రోడ్లు, నిలిచిన రాకపోకలు ఇళ్లలోకి చేరిన వర్షపు నీరు.. జలమయమైన కాలనీలు నేడు ప్రభుత్వ, ప్రైవేటు విద్యా సంస్థలకు సెలవు

మెదక్‌/మెదక్‌అర్బన్‌/ నర్సాపూర్‌/ శివ్వంపేట/ కౌడిపల్లి/ టేక్మాల్‌/ చిన్నశంకరంపేట/హవేళిఘణపూర్‌/అల్లాదుర్గం/పెద్దశంకరంపేట/ తూప్రాన్‌/మనోహరాబాద్‌/వెల్దుర్తి/చేగుంట/మాసాయిపేట

ఏకధాటిగా కురిసిన వానతో మెదక్‌ జిల్లావాసులు తడిసిముద్దయ్యారు. గడిచిన 24 గంటల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు నమోదయ్యాయి. శనివారం ఉదయం నుంచి ఆదివారం సాయంత్రం వరకు మెదక్‌ జిల్లా రికార్డుస్థాయిలో వర్షపాతం నమోదైంది. ఈ సీజన్‌లోనే అత్యధికంగా గడిచిన 24 గంటల్లో మెదక్‌ మండలం పాతూర్‌లో 21 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. రాజ్‌పల్లి 17.4సెం.మీ., మెదక్‌ 14.2సెం.మీ., నాగాపూర్‌ 13.5సెం.మీ., మిన్పూర్‌ 13.4 సెం.మీ., దామారంచ 13.1సెం.మీ., సర్ధన 13.0సెం.మీ., కొల్చారం 12.0సెం.మీ., కౌడిపల్లి 11.7సెం.మీ., కాగాజ్‌మాద్దుర్‌ 11.0 సెం.మీ.,టేక్మాల్‌, నర్సాపూర్‌ 10.5సెం.మీ., పెద్దశంకరంపేట 10.4సెం.మీ., రేగోడ్‌ 10 సెం.మీ., హావేళీఘణపూర్‌ 9.3 సెం.మీ., నిజాంపేట 8.14 సెం.మీ., కొల్చారం 8.0 సెం.మీ., రేగోడ్‌ 7.5 సెం.మీ., మెదక్‌ 7.2 సెం.మీ., పాపన్నపేట 7.1 సెం.మీ., చేగుంట 6.7 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. రానున్న 24 గంటల పాటు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు వాతావరణ శాఖ సూచించింది.

రాకపోకలకు అంతరాయం

మెదక్‌ పట్టణంలోని చమన్‌- పోస్టాఫీస్‌ రోడ్డు జలమయం కావడంతో రాకపోకలు నిలిపివేశారు. నర్సాపూర్‌- హైదరాబాద్‌ రహదారిమధ్యలో పెద్ద వృక్షం నేల కూలి రాకపోకలకు అంతరాయం ఏర్పడడంతో పోలీసులు తొలగించి దారి సరిచేశారు. హవేళీ ఘనపూర్‌ మండలం వాడి పంచాయతీ పరిధిలోని ధూప్‌సింగ్‌ తండాకు వెళ్లే రహదారిలో గల బ్రిడ్జిపై నుండి వరద నీరు ఉదృతంగా ప్రవహిస్తుండడంతో రాకపోకలు పూర్తిగా నిలిచిపోయాయి. హల్దీవాగు ఉదృతి పెరగడంతో తూప్రాన్‌ మండల కేంద్రం నుంచి కిష్టాపూర్‌, వెంకటాయపల్లి, నర్సంపల్లి గ్రామాలకు రకపోకలు నిలిచిపోయాయి. నిజాంపేట మండలం చల్మెడ వాగు పొంగిపొర్లుతుండడంతో ఈ మార్గంలో రాకపోకలు నిలిచిపోయాయి. నందిగామ సాయి చెరువు అలుగు పారడంతో రామాయంపేట-కాట్రియాల రహదారిపై వరద నీరు చేరి రాకపోకలు బంద్‌ అయ్యాయి. చిల్‌పచేడ్‌ మండల పరిధిలోని బందంబాయి వాగు పొంగి ఆప్రాంతమంతా జలమయమైంది. హకీంపేట హల్దీ ప్రాజక్ట్‌ పొంగిపొర్లుతోంది. కొల్చారం మండలం కొంగోడు వద్ద హల్ది వాగు పోంగి పోర్లుతుండటంతో మెదక్‌-కొంగోడు మధ్య రాకపోకలు నిలిచి పోయాయి. చేగుంటలోని ఎన్జీవో కాలనీలో ఇళ్ల మధ్యలో వర్షపునీరు నిలిచింది. పోచారం ప్రాజక్ట్‌లోకి భారీ స్థాయిలో నీరు ప్రవహిస్తుండడంతో జలకళ సంతరించుకుంది. రాయిన్‌పల్లి పాతూర్‌ మధ్యలో రహదారిపై వరదనీరు వచ్చి చేరడంతో జిల్లా కలెక్టర్‌ రాహుల్‌రాజ్‌ ప్రవాహాన్ని పరిశీలించి అధికారులకు తగు సూచనలు చేశారు. మెదక్‌ మండలం రాయిన్‌పల్లి చెరువు అలుగు పారుతోంది. ప్రస్తుతం కురుస్తున్న వర్షాలకు జిల్లాలో 362 చెరువులు పూర్తిస్థాయిలో.. 1,860 చెరువులు సగం నిండాయి. 105 చెక్‌డ్యాములు అలుగు పారుతున్నాయి.

Updated Date - Sep 02 , 2024 | 12:15 AM

Advertising
Advertising