ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

స్నేహం.. దేవుడిచ్చిన వరం

ABN, Publish Date - Aug 03 , 2024 | 10:57 PM

సంగారెడ్డి రూరల్‌, ఆగస్టు 3: సృష్టిలో అమ్మ ప్రేమది మొదటి స్థానమైతే... స్నేహానిది రెండో స్థానమని చెప్పవచ్చు. స్నేహం అనేది ఇద్దరు పురుషులు, ఇద్దరు బాలికల మధ్య ఉండడమే స్నేహం కాదు.

కష్టసుఖాల్లో పాలుపంచుకునేది స్నేహితులే

నేడు స్నేహితులు దినోత్సవం

సంగారెడ్డి రూరల్‌, ఆగస్టు 3: సృష్టిలో అమ్మ ప్రేమది మొదటి స్థానమైతే... స్నేహానిది రెండో స్థానమని చెప్పవచ్చు. స్నేహం అనేది ఇద్దరు పురుషులు, ఇద్దరు బాలికల మధ్య ఉండడమే స్నేహం కాదు. బాల, బాలికల మధ్య కూడా పవిత్రమైన స్నేహం ఉంటుంది. బాల్యం నుంచి వృద్ధాప్యం వరకు అందరికీ స్నేహితులు ఉంటారు. సమాజంలో అమ్మ తరువాతి స్థానం స్నేహానిదే. అమ్మ తన బిడ్డల కోసం సర్వం త్యాగం చేస్తే స్నేహం తన మిత్రుల కోసం ఎంతటి త్యాగానికైనా సిద్ధమవుతారు. స్నేహం భగవంతుడు ప్రసాదించిన వరం. నేడు స్నేహితుల దినోత్సవం సందర్భంగా ‘ఆంధ్యజ్యోతి’ అందిస్తున్న కథనం.

ఈ సృష్టిలో తోబుట్టువులు, బంధువులు లేనివారు ఉండవచ్చు కానీ స్నేహితులు లేని వారు మాత్రం ఉండరనేది జగమెరిగిన సత్యం. స్నేహితులు అనగానే మనకు ముందుగా గుర్తుకువచ్చేది మహాభారతంలోని కర్ణుడు. తన స్నేహితుడు దుర్యోధనుడి కోసం తన కుటుంబసభ్యులతో సైతం యుద్ధానికి పూనుకుంటాడు. కృష్ణుడు, కుచేలుడు, రామాయణంలో రాముడు, సుగ్రీవుడుల స్నేహం చరిత్ర పుటల్లో నిలిచిపోయింది. పురాణ గాధలు మహాభారతం నుంచి నేటివరకు స్నేహానికి ప్రాధాన్యత సంతరించుకుని ఉన్నది. స్నేహితులుగా ఉంటూ ఎందరో తమ మిత్రుల కోసం ప్రాణ త్యాగాలు చేసినట్టు చరిత్ర చెబుతున్నది. ఎవరైనా ఒకరితో స్నేహం చేసే ముందు కులం, మతం, ప్రాంతాలు అడగరు. నిజమైన మిత్రులకు ఆస్తి లేదనే చెప్పాలి. స్నేహానికి ఎల్లలు, సరిహద్దులు చేరిపేశక్తి ఉంటుంది. తల్లిదండ్రులు, అన్నదమ్ములతో పంచుకోలేనివి స్నేహితునితో పంచుకుంటారు. మంచి స్నేహం ప్రారంభదశ నుంచి మహావృక్షంలా ఎదుగుతుంది.

స్నేహితుల మధ్య దూరం పెంచిన స్మార్ట్‌ఫోన్లు

గతంలో కొత్త సంవత్సర వేడుకలు వచ్చాయంటే చాలు తమ స్నేహితులకు నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపేందుకు వివిధ డిజైన్లలో గ్రీటింగ్‌ కార్డులను ఇచ్చేవారు. స్నేహితుల బ్యాండ్లు ఒకరికొకరు చేతులకు వేసుకుని శుభాకాంక్షలు చెప్పుకునేవారు. కానీ ప్రస్తుతం మార్కెట్‌లోకి వచ్చిన స్మార్ట్‌ఫోన్ల పుణ్యమా అని స్నేహితుల మధ్య దూరం పెరిగింది. గతంలో తమ ఇంటిలో పెళ్లిల్లు, బర్త్‌డే ఇతరత్రా శుభకార్యాలు జరిగితే ఎంత దూరమైనా వారి వద్దకు వెళ్లి పత్రికలు అందించి ఆహ్వానించేవారు. ప్రస్తుతం ట్రెండ్‌ మారిపోయింది. నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలపడమే కాకుండా తమ ఇళ్లలో పెళ్లితో సహా బర్ద్‌డేలు జరిగినా ఫోన్‌లో కార్డు పంపించడం ఆనవాయితీగా మారిపోయింది.

జీవితంలో ఓ భాగమైన స్నేహితులు

స్నేహితులు జీవితంలో ఓ భాగమై పయనం సాగుతుంది. కష్టసుఖాల్లో అంటిపెట్టుకుని ఉండేవాడే నిజమైన స్నేహితుడు. తనకు బాల్యమిత్రులు ఇప్పటికీ కలుస్తూ తనతో వారి కష్టాలు పంచుకుంటారు. తనకు ఎల్లప్పుడూ ధైర్యాన్నిచ్చే స్నేహితుడు శ్రీనివాస్‌. అతడితో కలిస్తే తనకు పోయిన ఊపిరి వచ్చినట్లవుతుంది.

- రాజు, ఇరిగ్గిపల్లి గ్రామం, సంగారెడ్డి మండలం

స్నేహితుడిని మరిచిపోవద్దు

ఆపదలో ఉన్న స్నేహితుడిని ఆదుకుని ఒడ్డున చేర్చేవాడే నిజమైన స్నేహితుడు. కష్టాలు వచ్చినప్పుడు ఆండగా నిలిచిన స్నేహితుని మరిచిపోవద్దు. స్నేహితుడిని ద్వేషించకు.. అతనిలోని గుణాలను ద్వేషించి మంచి మార్గంలో పెట్టగలిగేవారిదే నిజమైన స్నేహం. తనకు అధికంగా దగ్గరగా ఉండే స్నేహితుడు ఏపీవో వెంకట్‌. అతను కలిసిన ప్రతిసారి తమ బాగోగులు, కష్టసుఖాలు పంచుకుంటాం.

- ఏవీజీకే ప్రసాద్‌, ఏవో, సంగారెడ్డి ప్రత్యేకాధికారి

స్నేహితుడికి చేయూత

జగదేవ్‌పూర్‌, ఆగస్టు 3: జగదేవ్‌పూర్‌ మండలం మునిగడప జిల్లా పరిషత్‌ ఉన్నత పాఠశాలలో 2000-2001 పదో తరగతి బ్యాచ్‌ పూర్వ విద్యార్థులు స్నేహితుడికి ఆర్థిక చేయూతనిచ్చారు. దొమ్మట బాలరాజు ఇటీవల అనారోగ్యంతో ఆర్‌వీఎం ఆస్పత్రిలో చేరాడు. ఆపరేషన్‌కు లక్షల్లో ఖర్చవుతుందని వైద్యులు చెప్పారు. విషయం తెలుసుకున్న పూర్వ విద్యార్థులు శనివారం ఆస్పత్రికి చేరుకుని పరామర్శించారు. అనంతరం రూ.43 వేల ఆర్థిక సహాయం అందించి మనోధైర్యం కల్పించారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎంపీటీసీ మహే్‌షయాదవ్‌, సత్యనారాయణ, నర్సింహులు పాల్గొన్నారు.

Updated Date - Aug 03 , 2024 | 10:57 PM

Advertising
Advertising
<