ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

అదనపు వసూళ్లకు ఫుల్‌స్టాప్‌

ABN, Publish Date - Jul 17 , 2024 | 11:24 PM

సిద్దిపేట అగ్రికల్చర్‌, జూలై 17: వినియోగదారులకు సులభంగా సేవలందించాలనే లక్ష్యంతో ఉమ్మడి రాష్ట్రంలో 2011లో ప్రభుత్వం మీ సేవ కేంద్రాలను ఏర్పాటు చేసింది. జిల్లాలో 209 కేంద్రాలు ఉన్నాయి.

సిద్దిపేటలోని మీ సేవలో క్యూఆర్‌ కోడ్‌తో రుసుము చెల్లిస్తున్న వినియోగదారుడు

మీ సేవ కేంద్రాల్లో ఆన్‌లైన్‌ చెల్లింపులు

క్యూఆర్‌ కోడ్‌తో నిర్దేశిత రుసుమే వసూలు

తీరనున్న వినియోగదారుల ఇబ్బందులు

కమీషన్‌ పెంచాలంటున్న నిర్వాహకులు

సిద్దిపేట అగ్రికల్చర్‌, జూలై 17: వినియోగదారులకు సులభంగా సేవలందించాలనే లక్ష్యంతో ఉమ్మడి రాష్ట్రంలో 2011లో ప్రభుత్వం మీ సేవ కేంద్రాలను ఏర్పాటు చేసింది. జిల్లాలో 209 కేంద్రాలు ఉన్నాయి. మహిళా శక్తి ద్వారా మరో 29 కొత్తగా రానున్నాయి. మీసేవ కేంద్రాల్లో ఏ సర్టిఫికెట్‌కైనా దాదాపు రూ.100 తీసుకోవాల్సి ఉంటుంది. కానీ కొందరు నిర్వాహకులు రూ.120 నుంచి రూ.150 వరకు వసూలు చేస్తున్నట్లు ఆరోపణలు ఉన్నాయి. అధిక వసూళ్లకు అడ్డుకట్ట వేసేందుకు మొదట మీ సేవ కేంద్రాల్లో రెవెన్యూ సేవలన్నింటికీ నగదు రహిత చెల్లింపులు తప్పనిసరి చేస్తూ ఉత్తర్వులు జారీచేసింది. జూలై 1 నుంచి ఈ విధానం అందుబాటులోకి వచ్చింది. అంతకుముందే ప్రభుత్వం నిర్వహిస్తున్న కేంద్రాల్లో ప్రయోగాత్మకంగా అమలు చేసింది. ఇది సత్ఫలితాలు ఇవ్వడంతో ప్రైవేట్‌ కేంద్రాల్లోనూ క్యూఆర్‌ కోడ్‌ స్కానర్‌ ద్వారా రుసుము వసూలు చేయాలని ఉత్తర్వులు జారీఅయ్యాయి. దీంతో మీ సేవ కేంద్రాల నిర్వాహకులు స్కానర్లు ఏర్పాటు చేసుకున్నారు. గ్రామీణ ప్రాంతాల్లో క్యూఆర్‌ కోడ్‌ చెల్లింపులపై ప్రజలకు అవగాహన కల్పించాల్సిన అవసరం ఉన్నది.

రానున్న రోజుల్లో అన్ని సర్టిఫికెట్లకు..

మీ సేవ కేంద్రాల్లో రెవెన్యూకు సంబంధించి ఏ సర్టిఫికైనా క్యూ ఆర్‌ కోడ్‌ ద్వారానే డబ్బులు చెల్లించాల్సి ఉంటుంది. నిర్వాహకులు స్కాన్‌ చేయగానే ఎన్ని డబ్బులు చెల్లించాల్సి ఉంటుందో అన్నే డెబిట్‌ అవుతాయి. రానున్నరోజుల్లో అన్ని సర్టిఫికెట్లకు క్యూఆర్‌ కోడ్‌ ద్వారా చెల్లింపులు జరిపే విధంగా చర్యలు తీసుకుంటుంది.

సెస్టెంబరు నుంచి ఎల్‌-1 డివైజ్‌ల వినియోగం

ఏ ప్రభుత్వ పథకానికైనా ఈ-కేవైసీ తప్పనిసరి. బయోమెట్రిక్‌ డివైజ్‌ల ద్వారా వేలిముద్రలు తీసుకుంటారు. నూతనంగా మీ సేవ కేంద్రాలకు కొత్త పరికరాలు ఏర్పాటు చేయాలని యూఐడీఏఐ ఆదేశాలు జారీచేసింది. మీ సేవ కేంద్రాల్లో ప్రస్తుతమున్న బయోమెట్రిక్‌ డివైజ్‌ల స్థానంలో తీసేసి ఎల్‌-1 పరికరాలను ఉపయోగించాలని ఆదేశాలను జారీ చేసింది. జూలై 1 తర్వాతే అమలు చేయాలని ఆదేశాలు జారీచేసిన ప్రభుత్వం సెప్టెంబరు వరకు గడువు విధించింది. ప్రతి మీసేవ కేంద్రం నిర్వాహకులు వీటిని కొనుగోలు చేయాల్సి ఉంటుంది.

నిర్వహణ కష్టమవుతోంది

ప్రభుత్వ నిబంధనలతో పెరుగుతున్న నిత్యావసర ధరలు, కరెంటు బిల్లులు, అద్దెలతో మీ సేవ కేంద్రాల నిర్వహణ కష్టతరమవుతోందని నిర్వాహకులు వాపోతున్నారు. నిబంధనలకు అనుగుణంగా సేవలందిస్తే ప్రభుత్వం రూ.10 కమీషన్‌ అందించింది. నిర్వాహకుల విజ్ఞప్తి మేరకు 2017లో రూ.10 కమీషన్‌ను రూ.15కు పెంచింది. కరోనా కంటే ముందు, తర్వాత అన్నిరకాల ముడి సరుకుల ధరలు, అద్దెలు పెరగడంతో జీవనం సాగించడం ఇబ్బందిగా ఉంది. కొత్త నిబంధనలతోపాటు కమీషన్‌ పెంచి, ఉచిత కరెంట్‌, ఉచిత ఇంటర్నెట్‌ సౌకర్యం కల్పించాలి.

ఉచిత విద్యుత్‌ ఇవ్వాలి

మీ సేవ కేంద్రాల నిర్వాహకులకు ఉచిత విద్యుత్‌తోపాటు ఇంటర్నెట్‌, స్టేషనరీ సౌకర్యం కల్పించాలి. గ్రామస్థాయిలో రైతులకు అవసరమైన పహణీలు, 1బీ వంటి సేవలు ధరణి పోర్టల్‌ వచ్చిన తర్వాత రద్దు చేయడంతో ఇబ్బందులు పడుతున్నాం. మహిళా సంఘాల ద్వారా సేవలు అందించడంతో జీవనోపాధి దెబ్బతింటోంది.

- నగేష్‌, మీసేవ కేంద్రం నిర్వాహకుడు, నంగునూర్‌

ఆన్‌లైన్‌లోనే చెల్లించాలి

మీ సేవ కేంద్రాల్లో ఆన్‌లైన్‌ ద్వారానే డబ్బులు చెల్లించాలి. ఈ విధానాన్ని అన్ని మీ సేవ కేంద్రాల్లో అమలుచేస్తాం. వినియోగదారులు పొందిన సేవలకు క్యూఆర్‌కోడ్‌ ద్వారానే రుసుము చెల్లించాలి. మీ సేవ కేంద్రాల నిర్వాహకులు సెప్టెంబర్‌ వరకు బయోమెట్రిక్‌ ఎల్‌-1 పరికరాలు ఏర్పాటు చేసుకోవాలి.

- ఆనంద్‌, ఈడీఏ

Updated Date - Jul 17 , 2024 | 11:24 PM

Advertising
Advertising
<