ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

బాలురతో సమానంగా బాలికలకూ హక్కులు

ABN, Publish Date - Jul 23 , 2024 | 11:26 PM

జోగిపేట, జూలై 23: సమాజంలో బాలురతో సమానంగా బాలికలకూ హక్కులుంటాయని జిల్లా న్యాయసేవాధికార సంస్థ కార్యదర్శి, సంగారెడ్డి జిల్లా సీనియర్‌ న్యాయాధికారి రమేశ్‌ అన్నారు.

మాట్లాడుతున్న సంగారెడ్డి జిల్లా సీనియర్‌ న్యాయాధికారి రమేశ్‌

లింగనిర్ధారణ పరీక్షలు జరగకుండా అంగన్‌వాడీలు చూడాలి

జిల్లా సీనియర్‌ న్యాయాధికారి రమేశ్‌

జోగిపేట, జూలై 23: సమాజంలో బాలురతో సమానంగా బాలికలకూ హక్కులుంటాయని జిల్లా న్యాయసేవాధికార సంస్థ కార్యదర్శి, సంగారెడ్డి జిల్లా సీనియర్‌ న్యాయాధికారి రమేశ్‌ అన్నారు. మంగళవారం ఎంపీడీవో కార్యాలయంలో జిల్లా శిశు సంక్షేమశాఖ, మహిళా సాధికారత కేంద్రం సంయుక్తాధ్వర్యంలో మిషన్‌ శక్తి-100 రోజుల ప్రత్యేక అవగాహనా కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సమావేశానికి ఆయన అసిస్టెంట్‌ ట్రైనీ కలెక్టర్‌ మనోజ్‌తో కలిసి హాజరయ్యారు. ఈ సందర్భంగా రమేష్‌ మాట్లాడుతూ భారత రాజ్యాంగం ప్రకారం.. బాల బాలికలంతా సమానమేనన్నారు. బాలురతో పాటు బాలికలకూ సమాన హక్కులుంటాయని వివరించారు. ఈ హక్కులపై గ్రామీణ ప్రాంతాల్లో అవగాహన కల్పించాల్సిన అవసరం ఉన్నదన్నారు. అలాగే లింగ నిర్ధారణ జరిపే పరీక్షలను నిలువరించాల్సిన బాధ్యత అంగన్‌వాడీ కార్యకర్తలపై ఉన్నదని చెప్పారు. అనంతరం అసిస్టెంట్‌ ట్రైనీ కలెక్టర్‌ మనోజ్‌ మాట్లాడుతూ.. గ్రామీణ ప్రాంతాల పిల్లల ఆరోగ్యం, విద్య విషయాల్లో ప్రత్యేక శ్రద్ధ కనపరచాలన్నారు. పోక్సో చట్టం గురించి కిశోర బాలికలకు, అవగాహన కల్పించి, వారిని చైతన్యపరచాలన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా మహిళా శిశు సంక్షేమ శాఖాధికారి లలితకుమారి, జోగిపేట సీఐ అనిల్‌కుమార్‌, సీడీపీవో ప్రియాంక, ఎంపీడీవో రాజేశ్‌, మున్సిపల్‌ కమిషనర్‌ తిరుపతి తదితరులు పాల్గొన్నారు.

Updated Date - Jul 23 , 2024 | 11:26 PM

Advertising
Advertising
<